ఎంత సాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా సంతృప్తి చెందకపోవటం అనేది మనిషి నైజం. ప్రతి కోరికకు సంబంధించి కేవలం ప్రయత్నం మాత్రమే మనిషిది, అది నెరవేరుతుందా..? లేదా..? అన్నది ఎవరి చేతుల్లోను లేని విషయం. మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి కూడా ఈ సూత్రానికి అతీతుడు కారు. అయన జీవితంలో ఎన్నో కోరికలను జయించి ఉండవచ్చు.అలానే కొన్ని కోరికల ఆశయాలు ఇంకా నెరవేరక పోయి ఉండవచ్చు.
ఈ మద్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనియ్యంశం అయిన ఓ అంశానికి సంబంధించి మార్పు రావాలని 30 సంవత్సరాల క్రితమే చిరంజీవి తన సినిమాతో అభిలాష పడ్డారు. కాని అ అంశంలో ఇప్పటికి మార్పు రాకపోవటం అనేది ఆలోచించాల్సిన అంశంగా మారింది. 1983 లో యండమూరి రచన ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అభిలాష' చిత్రం ప్రధానంగా అమానవియ్యమైన మరణ శిక్షను మన రాజ్యాంగం నుండి చెరిపెయ్యలన్నా దోరణిలో సాగుతుంది. అంతేకాకుండా సినిమా చివరిలో ఏ ప్రెసిడెంట్ పాలనలో, ఏ ప్రధానమంత్రి ఈ శిక్షను రాద్దుచేస్తారో... వారికీ ఈ సినిమా అంకితం అని సూచించారు.
కాని ఈ సమస్యకు సంబంధించి సమాజానికి, రాజకీయ వ్యవస్థకు మద్య ఎటువంటి అభిప్రాయము ఇప్పటికి కుదరలేదు... ఎప్పుడుకు కుదురుతుంది అన్నా విషయంలో కూడా స్పష్టతలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా అదికారంలో ఉన్నా చిరంజీవి నేను సైతం అంటూ ఆ సినిమాతో అభిలాష పడ్డా ఆశయాన్ని నెరవేర్చటానికి ప్రయత్నం చేస్తారా..? లేదా ..? అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోతుందో... లేక నెరవేరుతుందో... కాలమే నిర్ణయించాలి.
No comments:
Post a Comment