Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, February 19, 2013

టాలీవుడ్ లో నెంబర్ ఒన్ లేడని తేల్చిన రెబెల్


అన్ని రంగాల కంటే సినిమారంగంలో నెంబర్ వన్ స్థానం గురించి ఎప్పుడూ ప్రత్యేకమైనా చర్చలు సాగుతూనే ఉంటాయి. పెద్ద రేంజ్ లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ హీరోను నెంబర్ వన్ రేస్ లో నిలబెట్టి ఎవరకూ తోచినట్టు వాళ్ళు వివరణలు , విశ్లేషణలు చేసేస్తూ ఉంటారు. తాజాగా మిర్చి చిత్రం అందించిన విజయాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నా ప్రభాస్ ను అలానే నెంబర్ రేస్ లో నిలబెట్టి టాలీవుడ్ లో అతని స్థానం గురించి వాడి వేడి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నెంబర్ ఒన్ స్థానానికి సంబంధించి ఒక నిర్వచనాన్ని ప్రతిపాదించాడు.

ఒక ఇంటర్వ్యూ లో నెంబర్ ఒన్  స్థానానికి సంబంధించి అతనికి ఎదురైనా ప్రశ్నకు స్పందిస్తూ ' నెంబర్ వన్ అంటే ఏమిటి..? నా  దృష్టిలో ఏ వ్యక్తీ 10- 20 సంవత్సరాలు జయాపజయాలతో సంబంధం లేకుండా పరిశ్రమను శాసించే స్థాయిలో ఉంటాడో... అతనే నెంబర్ వన్. నేనో.. లేక మరెవరో.. వరసగా మూడు హిట్లు ఇచ్చినంత మాత్రానా నెంబర్ ఆన్ అయిపోము. నేనైతే నెంబర్ ఒన్ రేస్ లో లేను' అని ముక్తాయించాడు. అలా ప్రభాస్ నెంబర్ ఒన్  కు ఇచ్చిన నిర్వచనంలో కొంత ఒప్పుకోవాల్సిన నిజం ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ నే పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే టాలీవుడ్ లో నెంబర్ ఒన్ కొరతను స్పష్టంగా గుర్తించవచ్చు. 

ప్రస్తుతం టాప్ హీరోలుగా చెప్పుకోబడుతున్నా హీరోలలో ముగ్గురు నలుగురు పది సంవత్సరాలా నుండి పరిశ్రమలో ఉన్నప్పటికీ జయాపజయాల పరంగా ఒక క్రమమైనా కెరీర్ గ్రాఫ్ ను మైంటైన్ చేసినవాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. ఎందుకంటే వారందరికీ సూపర్ హిట్లు ఉన్నాయి, సూపర్ ప్లాప్స్ ఉన్నాయి, ముఖ్యంగా ప్రతి హీరోకి కెరీర్ మొత్తం గుర్తించుకో తగ్గ ఓ డిజాస్టర్ కూడా ఉంది. సో... దీనిని బట్టి తేలేదేమంటే ప్రభాస్ నిర్వచనాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే మన టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ ఒన్  ఎవరు లేరని...!         

No comments:

Post a Comment