ఇప్పటివరకు పవర్ స్టార్ అంటే ఇండియా మొత్తానికి, దాదాపు ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్కడు కనిపించేవాడు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కన్నడలో కూడా ఓ పవర్ స్టార్ ఉన్నాడుకాని ఎప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ ను డామినేట్ చేసిందే లేదు. కాని ఇప్పుడు పవర్ స్టార్ అనే బిరుదును మొత్తంగా కొట్టేయటానికి ఒక సునామి తమిళనాడు నుండి సూపర్ ఫాస్ట్ గా దూసుకొస్తుంది.
తనకు తానుగా పవర్ స్టార్ అనే బిరుదును ప్రధానం చేసుకుని గత కొంతకాలంగా టాక్ అఫ్ ది స్టేట్ గా అరవదేశంలో హాల్ చల్ సృష్టిస్తున్నాడు వయసు మీరిన వర్ధమాన తమిళ నటుడు డాక్టర్ శ్రీనివాసన్. అతి చేష్టలతో, అతి స్టేట్మెంట్స్ తో, అతి ప్రచారంతో వెటకారాన్ని తమిళ తంబిలా ఫై వెదజల్లుతూ 'నాక్కొంచం తిక్కుంది కాని దానికే లెక్కే లేదు' అన్నా చందంగా అదోరకం అభిమానాన్నికూడగట్టుకున్నాడు ఆ పవర్ స్టార్ . దీనికి తోడూ మొన్నా సంక్రాంతి పండక్కి ప్రముఖ హాస్యనటుడు సంతానంతో కలిసి శ్రీనివాసన్ చేసిన 'కన్నా లడ్డు తిన ఆశయ' చిత్రం విజయదుందుభి మ్రోగించటమే కాకుండా ఆ క్రెడిట్ లో చాలా భాగం అతనికే దక్కటంతో పవర్ స్టార్ పేరు తమిళనాట మారు మ్రోగిపోయింది.
దాంతో అక్కడ అందరు అతన్ని శ్రీనివాసన్ అని పిలవటం మానేసి పవర్ స్టార్ అనే పిలుస్తున్నారు. ఇదే కోలాటం ఇంటర్నెట్ లో కూడా ఊపందుకోవటంతో పవర్ స్టార్ అనే బిరుదు పవన్ కళ్యాణ్ నుండి శాశ్వతంగా(ప్రపంచం దృష్టిలో ) చేజారిపోయే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే గూగుల్ సెర్చ్ లో పవర్ స్టార్ అని కొడితే పవన్ కళ్యాణ్ ను ఒక మూలకు నెట్టి మొత్తంగా ఆ ముసలి పవర్ స్టారే కనిపిస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే మన పవర్ స్టార్ ఆ పవర్ ఫుల్ టైటిల్ ను వదిలేసుకోవాల్సి వస్తుందేమో..? ఇదిగో పవనాభిమానులు వింటున్నారా ...! ఉరికే చదివి ఊరుకోకుండా మన పవర్ స్టార్ ప్రతిష్ట పెరిగేలా ఏదో ఒకటి చెయ్యండీ ....!
No comments:
Post a Comment