కాలక్రమేణ వచ్చే మార్పులను దగ్గుబాటి వారి కుటుంబం అందిపుచ్చుకుంటున్నంత త్వరగా తెలుగు సినీ పరిశ్రమలో మిగత వాళ్ళు అందుకోలేకపోతున్నరనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో అంతరించి పోయిందనుకున్నా స్టార్ హీరోలా మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ శంకుస్థాపన చేసి ముందడుగు వేసిన ఘనత వెంకటేష్ బాబుకే దక్కుతుంది. ఒక్కడుగుతోనే వదిలేయకుండా వరసెంబడి బహు కధానాయకుల సినిమాలు చేయటానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ మిగత వారికి ఆసక్తి కలిగిస్తున్నారు వెంకీ. అదే క్రమంలో దగ్గుబాటి వారి యువతరం వారసుడు రానా మరో మార్పుకు స్వాగతం పలుకుతూ టాలీవుడ్ లో బాలీవుడ్ ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడు.
స్టార్ హీరోలుగా ఉంటూ సొంత స్టార్ డమ్ తో సినిమాలు చేస్తున్నప్పటికీ వేరే సినిమాలలో మంచి పాత్ర, అది చివరికి విలన్ పాత్ర అయినా సరే మనసుకువచ్చితే కళ్ళుమూసుకుని ఒప్పుకుని, ఆ పాత్రలో రాణించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నా సంస్కృతీ గత కొంతకాలంగా బాలీవుడ్ లో వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఆ పద్దతిని తెలుగు వారికి రుచి చూపించాలనే ఉద్దేశంతో రానా ఒడి ఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రుపొందుతున్నా బాహుబలి చిత్రంలో ప్రభాస్ హీరోఇజాన్ని సవాలు చేసే ప్రతినాయక పాత్రలో కనిపించటానికి సిద్దమైనా రానా, తాజాగా హీరోయిన్ ప్రధానంగా సాగే రుద్రమదేని చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపించటానికి ఒప్పుకుని మరో సంచలనానికి తెర తీశాడు.
రుద్రమదేవి చిత్రంలో రాణి రుద్రమ భర్త చాళుక్య వీరభద్రుడిగా రానా నటిస్తున్నాడని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించాడు. రుద్రమదేవి వీరనారిగా మారటంలో తండ్రి గణపతిదేవులు పాత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ కొంత ఆమె భర్త వీరబద్రుడి ప్రభావం కూడా ఆమె ఫై ఉందని చరిత్ర చెబుతుంది. కాని రుద్రమ తన జీవితంలో అత్యంత కష్ట కాలాన్ని తండ్రి, భర్తా మరణించిన సమయంలోనే అనుభవించింది.ఆ తరవాతే ఆమె మహా సామ్రాజ్ఞిగా ఆంధ్రదేశాన్ని ఏంతో సమర్ధవంతంగా ఏలింది. ఈ సమాచారం ప్రకారం రానా పాత్ర ఈ సినిమాలో ఎంతవరుకు పరిమితమో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఒప్పుకున్నడంటే.. స్టార్ గా కాదు నటుడిగా పేరు తెచ్చుకోవాలనే రానా తపనే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
కృష్ణం వందే జగద్గురుమ్ కమర్షియల్ గా నడవకపోయినా నటుడిగా రానా మాత్రం నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఆ పాయింట్ ను పట్టుకుని హీరోగా పది సినిమాలు వరసగా చేసే సత్తా అతని వెనుక ఉంది. కాని అలా చేయకుండా మంచి పాత్రలను ఎంచుకోవటం నటన పట్ల అతని అంకితభావానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఒక పెద్ద నిర్మాణ సంస్థ వెనక ఉంది కాబట్టి లేదా నాన్నా స్టార్ హీరో కాబట్టి హీరోగా మాత్రమే కనిపించాలి తప్పా.. మరే ఇతర పాత్రలో నటించకూడదనే అర్ధం లేని నానుడికి స్వస్తి పలుకుతూ రానా తీసుకుంటున్నా నిర్ణయాలు అభినందించతగ్గవి. రానా రగిలించిన స్పూర్తి మరికొంతమందిని మార్చగలిగితే... తెలుగు సినిమాలలో కొత్త ప్రయోగాలు వల్ల కలిగే సరికొత్త అనుభూతులతో ప్రేక్షకులు తడిసి ముద్దవటం ఖాయం.
No comments:
Post a Comment