చిరంజీవి పేరు వింటేనే చిర..చిరలాడుతూ శివాలెత్తిపొయే యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు మెగాస్టార్ తో అడిగిమారి తన్నించుకొవటానికి ఉబలాటపడుతున్నాడు. ఫామ్ కోల్పోయినా.. పాపులారిటీ తగ్గిపోయినా... రోషానికి మాత్రం తగ్గకుండా ఎవడైతే నాకేంటి అంటూ భార్యతో కలిసి చిరు ఫై అలుపెరగని రాద్దంతాలు చేసిన ఈ శివయ్య సడెన్ గా రూటు మార్చి రాజిబేరానికి రావటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఇంతకీ సంగతేమిటంటే.. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో పలు సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడిన రాజశేఖర్ ..'వయసును దృష్టిలో పెట్టుకుని హీరోగానే కాకుండా మంచి పాత్రలలో నటించాలని ఉంది అని కొత్త కోరికను బయటపెట్టారు. అక్కడితో ఆగకుండా అవసరమైతే విలన్ గా కూడా నటిస్తానని చెప్పుకొచ్చారు. అదే జోరులో మరో అడుగు ముందుకేసి అడిగి చూడండి చిరంజీవి 150 వ చిత్రంలో విలన్ గా నటించటానికి కూడా అభ్యంతరం లేదని మొహమాటాన్ని పక్కన పెట్టి మరి బహిరంగంగా ప్రకటించాడు.
ఈ స్టేట్మెంట్స్ విని.. చిరంజీవి మంత్రి అయ్యాడని జంకో..లేక చిరు స్థాయిని అర్ధం చేసుకునో రాజశేఖర్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని కొందరు అభిప్రయపడుతుంటే....కొందరేమో తరిగిపోతున్నా స్టార్ డమ్ ను కాపాడుకోవటానికి చేస్తున్నా దిద్దుబాటు చర్యల్లో భాగామే ఈ కాకాలు అని చెవులు కొరుక్కుంటున్నారు. ఎదేలాగున్నా మొత్తానికి ఆవేశాన్ని తగ్గించుకుని ఒక మెట్టు దిగి ఈ అల్లరి ప్రియుడు చేసిన పరోక్ష అభ్యర్ధనను ఎంతమంది గుర్తిస్తారో.. వేచి చూడాలి.
No comments:
Post a Comment