Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 1, 2013

Ram Ongole Gittha Movie Review


రంకెలు పెట్టే పొగరుబోతు ఎద్దుకు తీసిపోని ఎనర్జీకి ఓనర్ అయిన హీరో రామ్ సత్తాకు తగ్గట్టు తన కొత్త సినిమాకు 'ఒంగోలు గిత్త' అనే పేరు పెట్టుకుని దానిని సార్ధకం చేసుకోవటానికి బోల్డంత ఆర్భాటంగా ఈ వారం దియేటర్లకు వచ్చాడు.  హుషారు మోతాదును మరింత పెంచి రెచ్చిపోయిన రామ్ ఈ సినిమాతో తన తోటి హీరోలకు కొత్త సవాల్ విసరటానికి సిద్దం అయ్యాడని పరోక్షంగా చెప్పుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఫైకి చెప్పకపోయినా అన్ని కుదిరిన కధ... ఇలాంటి కధలు దొరికితే చాలు సక్సెస్ దానంతటా అదే వస్తుంది అంటూ సినిమా విజయంఫై కనిపించని పొగరు ప్రదర్శించాడు రామ్.

అలానే ఆరెంజ్ నేర్పిన పాఠం సాఫ్ట్ సినిమాల భాస్కర్ ను సాలిడ్ మాస్ సినిమా దర్శకుడిగా మార్చేసింది. క్లాస్ సినిమాలతో చప్పట్లు కొట్టించుకున్నా బొమ్మరిల్లు బాబు మాస్ దర్శకుడిగా ఒంగోలు గిత్త విన్యాసాలను చూపించి విజల్స్ కొట్టించుకోవటానికి సిద్దం అయ్యాడు. స్వతహాగా తమిళ వలసపక్షి అయిన భాస్కర్ తమిళ సంగీత దర్శకుడు ప్రకాష్ తో చేపించుకున్నా పాటలు వింటుంటే.. నేపద్యం ఆంధ్రదే కాని ఆత్మ తమిళనాడు మాదిరి ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. హీరోకు కాని, దర్శకుడికి కాని ఓ భారి పరాజయం తరవాత వచ్చే చిత్రం ఫై అంచనాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటుంది ఈ ఒంగోలు గిత్త. దాంతో సినిమా విజయానికి తొలిరోజు టాక్ కీలకంగా మారింది. మరీ ఆ టాక్ ఏమిటో...? ఒంగోలు గిత్త ఫలితం ఏమిటో...? మన సమీక్షలో చూద్దాం.

కధ : 

12 ఏళ్ళ వయసులో అనాధనంటూ ఒంగోలు మిర్చి యార్డుకు చేరిన  వైటు (రామ్) అంచలంచలుగా ఎదిగి 22 ఏళ్ళు వచ్చేప్పటికి యార్డ్ జనాలలో ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. యార్డ్ చైర్మన్ గా తీరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఆదికేశవనాయుడు(ప్రకాష్ రాజ్) నుండి చైర్మన్ గిరిని దక్కించుకొవాలనేది వైటు కల. ఆ గమ్యం వైపుగా వైటు చేస్తున్నా ప్రయత్నాలు ఫైకి మంచివాడిగా నటిస్తున్నా ఆదికేశవనాయుడి లోపలున్నా చెడ్డవాడిని రెచ్చగోడతాయి. ఆ ఫై వైటు ఆ యార్డ్ కొచ్చిందే అదికేశవనాయుడి అసలు రంగును బయటపెట్టటానికే అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఆదికేశవనాయుడు వైటు పెట్టే పరీక్షలను ఓపికగా ఎదుర్కుంటాడు కాని బయటపడడు.ఇలా సాగే ఈ కోల్డ్ వార్ లో వైటు ఎలా గెలిచాడు అన్నది మిగిలిన కధ . 

విశ్లేషణ: 

బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు సినిమా తో ఒక మేనియలోకి వెళ్లి పోయాడు. బొమ్మరిల్లు లో తండ్రి చాటు కొడుకు పడే వేదనను చూపించాడు. పరుగులో లేచి పోయిన అమ్మాయి తండ్రి పడే భాధను చూపించాడు. ఆరెంజ్ లో ప్రేమలో ఉన్న నిలకడ గురించి చర్చించాడు. అలానే ఈ సినిమాలో మంచితనం చాటునుండే చెడ్డ వాడి నైజాన్ని చూపించాడు.మంచి వాణ్ణి తొందరగా మోసం చేయవచ్చు. కాని మంచి ముసుగులో ఉన్న చెడ్డవాణ్ణి బయటకు తీసుకురావటం అంత తేలిక కాదు అన్నా విషయాన్నీచెప్పే ప్రయత్నం చేశాడు. ఈ పాయింటే కధకు ఆయువు కాబట్టి విలనే అయిన ప్రకాష్ రాజే ఈ సినిమాకు హీరో అని చెప్పాలి. ఆదికేశవనాయుడు పాత్రను భాస్కర్ ఎంత పక్కగా రుపొందించాడో అంతే పక్కగా స్క్రీన్ మీద ప్రెసెంట్ చేశాడు. ఆ పాత్రను ఆధారంగా చేసుకునే భాస్కర్ మిగత పాత్రలను, కధను నడిపించాడు. అంటే ఆ పాత్రకు బుద్ది చెప్పటమే కధ కాబట్టి... ఆదికేశవులు మిగత వాళ్లను ఎలా ఇబ్బంది పెడతాడు... హీరో అతన్ని ఎలా ఇబ్బంది పెడతాడు అన్నదే ప్రధానంగా సినిమా అంతా సాగుతుంది. అందునా ఇలాంటి పాత్రలకు ప్రకాష్ రాజ్ పెట్టింది పేరు కాబట్టి.. సహజంగానే తన రేంజ్ లో నటించి అదరగొట్టేశాడు. 

అ ఒక్క పాత్రే కాదు మిగత పాత్రలను కూడా కధకు తగ్గట్టు బాగానే రూపొందించాడు. కాని స్క్రీన్ ప్లే పరంగా భాస్కర్ అవలంభించిన విధానం సినిమాకు చాల నష్టాన్ని కలగజేసిందని చెప్పాలి. కధలో డ్రామాకు ఎక్కువ అవకాశం ఉన్న పాయింట్  పెట్టుకుని కధనాన్ని మాస్ ఎంటర్ టైనర్ గా మలచాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. కధనం ఓ పద్దతి లేకుండా ఎత్తు పల్లాలతో సాగుతూ సినిమా ఫై అటెన్షన్ కుదరకుండా చేస్తుంది. అంటే కధలో కొన్ని ఆసక్తి కరమైన మలుపులుంటాయి. ప్రతి మలుపుకు కావలసిన విధంగా హైప్ క్రియేట్ చేస్తాడు భాస్కర్ కాని ఆ హైప్ ను కొనసాగించకుండా వెంటనే పడేసేస్తాడు. దాంతో బాగుందే అనుకున్న కాసేపటికే.. ఇదేం  సినిమారా బాబు..! అనిపిస్తుంది. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ ఒంగోలు గిత్తను తీర్చి దిద్దే క్రమంలో మంచి కధను ఎంచుకున్నంత తేలికగా కధనాన్ని లొంగదీసుకోలేకపోయాడు. అలానే పోటా పోటిగా హీరో , విలన్ ల మద్య జరిగే ఆసక్తికరమైన పోరుకు ముగింపు పలకటానికి మూస ఐడియాను ఎంచుకుని క్లైమాక్స్ ను నీరుగార్చాడు. టెక్నికల్ గా అన్ని విభాగాలు ఉన్నత స్థాయి ప్రమాణాలను ప్రదర్శించాయి కాని కధనాన్ని నడిపించిన విధానం సినిమా ఫై ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగించదు. 

సినిమా ఎలా ఉంది అన్న సంగతి పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం భాస్కర్ ను మనస్పూర్తిగా అభినందించాలి. ఎందుకంటే తెలుగు వాడు కాకపోయినప్పటికీ సినిమాలో తెలుగుతనాన్ని, తెలుగు నేపద్యాన్ని చొప్పించాడు. పాటల పరంగా కొంత అరవమేళం పోకడలు వినిపిస్తాయి కాని మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్, జనపదాలతో కూడిన పాట, గుంటూరు, తణుకు, తాడేపల్లి గూడెం, ద్వారకా తిరుమల మొదలైన ప్రాంతాలను లోకేషన్స్ గా ఎంచుకోవటం చాలా వరకు సినిమాకు తెలుగుతనాన్ని తీసుకువచ్చింది. 

రేటింగ్: 


                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం :
వయసుకు మించిన పాత్రలానే అనిపించినప్పటికీ తనదైనా ఏనార్జితోను , పర్ఫెక్ట్ టైమింగ్ తోనూ అద్భుతంగా మేనేజ్ చేసి వాహ్వా అనిపించాడు రామ్. ప్రచారం లో చెప్పినట్టుగానే ఫూల్ ఎనర్జితొ సూపర్ గా కనిపించాడు. ఇక పాటలు, ఫైటుల సంగతైతే చెప్పనే అవసరం లేదు. దుమ్ము దులిపేశాడు. ముఖ్యంగా ఎర్ర మిరపల్లో.., చాల్ చాల్లే.. పాటల్లో డాన్స్ ఇరగదీశాడు. కృతి హీరోయిన్ పాత్రకు యాప్ట్ అనిపించలేదు కాని అ విషయం బయటపడకుండా బాగానే నెట్టుకొచ్చింది. క్యారక్టర్ పరంగా భాస్కర్ కృతి పాత్రను బాగానే వ్రాసాడు కానీ దానిని మరింత ఆసక్తిగా మలచలేకపోయాడు. ప్రకాష్ రాజ్ మాత్రం మరో సారి చాల గొప్పగా నటించి ఆకట్టుకున్నాడు. నగ్నంగా కనిపించటంలో కూడా హుందాగా నటించాడు. పాత్రలోని రెండు చాయలను అద్భుతంగా రక్తి కట్టించాడు. ఆహుతి ప్రసాద్, ప్రభు, తదితరులు బాగానే నటించారు. రఘుబాబు కామెడీ , తిక్క వారి పాలెం ఎపిసోడ్స్ నవ్విస్తాయి.     




3/5

దర్శకత్వం :
భాస్కర్ సినిమాను కధ ప్రకారం తియ్యాల్సింది లేదా మాస్ మసాలా ఫార్ములా ప్రకారం నడిపించాల్సింది. అలా కాకుండా వాటిని  ఓ పద్దతి లేకుండా కలపటానికి ప్రయత్నించి రెంటికి చెడ్డా రేవడి అయ్యాడు. సాంకేతికంగా అన్నివిభాగాలను సక్రమంగానే ఉపయోగించుకుని సినిమాను అందంగా తెర మీద చూపించాడు. కధనం పరంగా మరింత జాగ్రత్త వహించినట్టైతే బాగుండేది.  



2.75/5




 రచన 



కధ:
కధ రొటీన్ గానే అనిపించినా సత్తా ఉన్న కధ . ముఖ్యంగా విలన్ పాత్ర తీరు, తెన్ను మంచి అనుభూతి కలిగిస్తుంది. 3/5


కధనం:
ప్రయోగమో లేక కావాలని చేశారో తెలియదు కాని కధనాన్ని చాలా నీరసంగా తాయారు చేశారు. సినిమా ఓ పద్దతిగా నడిచినట్టు అనిపించదు. ఎప్పుడు ఏది గుర్తొస్తే అది పెట్టి కధనాన్ని తయారుచేసినట్టున్నారు. దాని ఫలితంగా సినిమాను ఎంజాయ్ చెయ్యలేం. 2/5 

   2.5/5

మాటలు : 
అక్కడక్కడ కొన్ని మాటలు తప్పించి పెద్దగా ఆకట్టుకునే డైలాగులు కనిపించవు. 2.5/5


సంగీతం 









 3/5

పాటలు : 
జి వి ప్రకాష్ కుమార్ పాటలు రెండు బాగున్నాయి. రా చిలుక అన్నిటికన్నా బాగుంది. జనపదాలా పాట బానే ఉంది కాని అందులో తమిళ ఘాటు కొంచెం ఇబ్బంది పెడుతుంది. 2.75/5


నేపధ్య సంగీతం:
మణిశర్మ ఎప్పటిలానే తన స్టైల్ లో రెచ్చిపోయారు. 3/5



డాన్సులు:
మూడు పాటల చిత్రీకరణ బాగుంది. ఎర్ర మిరపల్లో... చాల్ చాల్లే పాటల్లో డాన్సులు అదిరాయి. 3/5

సాంకేతికం 








  3/5

కెమెరా:
వెంకటేష్ కెమెరా పనితనం నీట్ గా ఉంది. 3/5

ఎడిటింగ్ :
మార్తాండ్  కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా కధకు తగ్గట్టు బానే ఉంది. 3/5





ఫైట్స్ : 
ఫైట్స్ కంపోజిషన్ కంటే రామ్ ఎనర్జీనే ఫైట్స్ కు బోల్డంత వన్నె తెచ్చింది. 3/5

తులాభారం







  2/5


హెచ్చులు :
  • విలన్ పాత్ర , ప్రకాష్ రాజ్ అభినయం 
  • రామ్ ఎనర్జీ తో చేసిన డాన్సులు, ఫైటులు 

తగ్గులు:
  • పద్దతిగా లేని కధనం 
  • భాస్కర్ మాస్ మంత్రం 
  • కామెడీ తక్కువగా ఉండటం  


                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  2.75/5

                     

            

కొసమెరుపు : 

బలమైన కధ ఉన్నప్పటికీ భారమైన కధనం, వినోదం తగ్గటం వంటి విషయాలు సినిమా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కధనాన్ని పట్టించుకోకుండా ఎనర్జీతో కూడిన రామ్ ఫైటులు, డాన్సులు సినిమాను కొంత మేరన్నా రక్షిస్తాయేమో వేచి చూడాలి. 
    

No comments:

Post a Comment