సోనాక్షి తెలుగు అరంగేట్రానికి చట్టబద్దత వచ్చింది. అంటే గవర్నమెంట్ ఆమోదించి ముద్రేసిందనుకునేరు.. అదేమీ కాదు... ఈ విషయాన్నీ ఆవిడే ఖరారు చేయటంతో తెలుగు సినిమాలో ఆమె నటిస్తుందన్నా సంగతి నిర్దారణ అవటమే కాకుండా.. మహేష్ - క్రిష్ కాంబినేషన్లో సినిమా ఉంటుందో... లేదో... అన్నా అనుమానానికి కూడా సమాధానం దొరికింది.
శివం టైటిల్ తో మహేష్ హీరోగా క్రిష్ సినిమా చేస్తున్నడన్నా సంగతి కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. కాని మహేష్ వరసగా ఒప్పుకుంటున్నా సినిమాల జోరును చూసి సినిమా ఉంటుందో..? లేదో..? అన్నా అనుమానాలు వ్యకం అయ్యాయి. చివరికి మహేషే స్వయంగా నిర్ధారించినప్పటికీ.. నాలుగు వేరే సినిమాలా పేర్లతో కలిపి ఈ సినిమా గురించి చెప్పటం, గతంలో కూడా మాట ఇచ్చి మద్యలో అటకెక్కించిన అనుభవాలను బట్టి... సెట్స్ ఫైకి వెళ్ళే వరకు అనుమానమే అనుకున్నారు అందరు..!కాని ఇప్పుడు సోనాక్షి ఇచ్చిన ఉత్సాహభరితమైన స్టేట్మెంట్ తో 'శివం' తప్పక ఉంటుందని నిర్ధారణ అయ్యింది.
తెలుగు, తమిళ భాషల్లో 60 కోట్ల భారి బడ్జెట్ తో అశ్వనిదత్ నిర్మించ తలపెట్టిన ఈ 'శివం' సినిమా స్క్రిప్ట్ విని కాదనలేకపోయానని సోనాక్షి ముద్దుగా చెప్పటం..., క్రిష్ తెలివితేటలను మెచ్చుకోవటం .. తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసి అందుతున్నా అభినందనలు మళ్లీ కొత్తగా పరిచయం అవుతున్నా ఫీలింగ్ ను కలిగిస్తూ థ్రిల్ చేస్తున్నాయని ఉటంకించటం .. సినిమా సెట్స్ ఫై కి ఎంత తొందరగా వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను వంటి మురిపాల మాటలతో ... ఈ ముంబై భామ ఏంతో ఉత్సాహంగా... ఇంకెంతో ఉల్లాసంగా ఈ సినిమాలో నటిస్తున్నా సంగతిని బహిర్గతం చేయటాన్ని చూస్తుంటే ఆరు నూరైనా ఈ శివం తెర ఫై కనపడతాడని నమ్మకం కలుగుతుంది. ఆ ఫై ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు ఎలా ఉంటే అలానే జరుగుతుంది.

No comments:
Post a Comment