Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, July 23, 2012

Photo Story On DCM New Walls

Here it is the confirmation Raviteja's 'Devudu Chesina Manushulu' is surly hitting the screens on August 15th.

Here is the interesting photo story on newly released walls of DCM

'దేవుడు చేసిన మనుషులు ' అనే ఈ సినిమాలో మన  పూరి చేసిన హీరో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడంటా... ఈ పాయింట్ ను ఆసరాగా చేసుకుని సరదాగా అల్లిన కధ  మీ కోసం ....!

మన హీరో బయట ఎంత అల్లరి చేసిన ప్రోఫిషన్ విషయంలో మాత్రం చాలా కూల్ ... అదే ఈ లుక్.


చెప్పుకున్నంగా మనోడు బయటకు వస్తే 'బలాదూర్' అని ఇప్పుడు  ఆఫ్ డ్యూటీ .....!


సహజంగా పూరి హీరోలకు నిమిషానికి ఒక కిక్కు కావాలి. అందులో మాస్ మహారాజాకు మరీను... అలాంటిది ఊరికినే  ఉంటాడా ... రొటీన్ లైఫ్ చిరాకు దొబ్బి ... ఏమిచేద్దాం అని అలోచించి .... చివరికి ప్రేమిద్దాం అని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ సిగ్గు.


తొందరగానే మనోడి నీరిక్షణ ఫలించి సుబ్బలక్ష్మి తారస పడింది.... అది ఈ గంతులకు కారణం .


సైటేసుకున్నాడు ....'సుబ్బలక్ష్మి' అని పాటేసుకున్నాడు.... ప్రేమలో పడేసుకున్నాడు ... ఆ ఫై వాటేసుకున్నాడు.  


తరవాత 'నేవ్వంటే చాల ఇష్టమే....' అని మనోడు ,  'నాక్కూడా...' అని సుబ్బలక్ష్మి కలిసి డ్యూయెట్ వేసుకున్నారు. మనోడికి కుసింత ఎనర్జీ ఎక్కువ కాదా... అందుకని వీపరీతం డాన్సు చేయటంతో అలిసిపోయి అమ్మాయి ఒళ్లో ఇలా పడుకున్నాడు.


ఆ ఫై చనువు పెరిగింది కదా అని చొరవ తీసుకున్నట్టు ఉన్నాడు. కాని ఈ విషయం ఆ అమ్మాయితో పాటు ఫై నుండి చూస్తున్న లక్ష్మిదేవి కూడా నచ్చినట్టు లేదు ....!


వినోదం చూస్తున్న విష్ణుమూర్తి ని యాక్షన్ తీసుకోమని సిఫార్స్ చేసినట్టుంది లక్ష్మి దేవి. ఆయన ఊరుకుంటాడా... వాళ్ళిద్దరి మద్య ఏదో పుల్ల  పెట్టాడు. ఇంకేముంది గొడవలు మొదలు...!


గొడవలు ముదిరినట్టున్నాయ్ ... మనోడి ప్రేమ చేదిరినట్టుంది .  ఏమి చేస్తాడు పాపం  ఎంతైనా దేవుడు చేసిన మనిషే కదా ఇదంతా దేవుడే చేసాడని అర్ధం చేసుకున్నాడు. అందుకే   ఎమ్ .... లిటికేషన్ పెట్టావయ్య ..? అని దేవుణ్ణే అడుగుతున్నాడు. 


దేవుడు మనోడి మొర అలకించాడో.... లేక వీడి నస బరించలేక వదిలేసాడో తెలియదు కాని మొత్తానికి వాళ్ళిద్దరూ మళ్ళి  కలిసారు.


 అసలేం జరిగింది....? ఎందుకు జరిగింది .....? వాళ్ళెలా కలిసారు..? అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆగష్టు 15 న దియేటర్లకు రండి .... అక్కడ చూసుకుందాం అని మనోడు సిగ్నల్ ఇస్తున్నాడు . అది సంగతి..!


ఈ ఫోటో స్టొరీ అనే తతంగం మీకు నచ్చితే ఓ కామెంట్ పడేసి ... మీ ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చెయ్యండి.
నచ్చక పొతే లైట్ తీసుకోండి.

No comments:

Post a Comment