Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, July 23, 2012

Thumbs Down For Eega At Mass Areas



సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెలుగు జాతి గర్వించ తగ్గ రీతిలో 'ఈగ' అనే దృశ్య కావ్యాన్ని రూపొందించి తెలుగు సినిమా గొప్పతనాన్ని జగద్విదితం చేస్తే.... ఏమిటి వృధా ప్రేలాపన అని కోపగించుకోకండి. నిజం నిప్పు లాంటిది ఒప్పుకోక పొతే... కాల్చి పారేస్తుంది! ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన ఈగ మాస్ ప్రేక్షకులను మెప్పించి మచ్చిక చేసుకోవటంలో సఫలం కాలేదు. ఫై గా రాజమౌళి ని అమితంగా ఇష్ట పడే  మాస్ జనాలు సినిమా చూసి  నిరాశ  పడ్డారన్నది వాస్తవం.  సినిమా విడుదలైన రోజు  క్లాసు ఏరియస్ లో అద్భుతం, మాస్టర్ పీస్ వంటి పొగడ్తలు  వినిపిస్తే... మాస్ ప్రాంతాల్లో యావరేజ్, పర్లేదు వంటి మాటలు వినపడ్డాయి. మీడియా కూడా క్లాస్ వర్గమే కాబట్టి మాస్ అభిప్రాయానికి పెద్ద గుర్తింపు రాలేదు.

దాని మూలంగా ఈగకు వచ్చిన నష్టం ఏమి లేదు, ఎందుకంటే క్లాసు ఏరియస్  లో సినిమా పూర్తీ ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అని అనుకుంటే  పొరబాటే. ఎందుకంటే క్లాస్ ప్రేక్షకులతో పోల్చితే నచ్చిన సినిమాను రెండు మూడుసార్లు చూసేది మాస్ ప్రేక్షకుడే. అతను ఒక్కసారి చాలు అనుకున్నడంటే వసూళ్ళ పరంగా ఎంతో కొంత తేడా తప్పక కనపడుతుంది. హిట్ టాక్ ఉంది కాబట్టి పెట్టుబడి  పోను అర కొర లాభం రావచ్చు. అదే మాస్ తలుచుకుంటే బయ్యర్ దగ్గరనుండి నిర్మాత వరకు అందరి పంట పండినట్టే. అప్పుడు సినిమా సక్సెస్ రేంజ్ ను అంచనా కూడా వేయలేం.

అసలు ఈగ ఎందుకు మాస్ ను మెప్పించలేకపోయింది అని ఆలోచిస్తే ప్రధానంగా కనిపించే కారణలు హీరో గా వాళ్ళు అభిమానించే వ్యక్తి లేకపోవటం, వారిని అలరించే పాటలు లేక పోవటం, కామెడీ లేక పోవటం  అని వినిపిస్తున్నాయి. అది కొంతవరకు నిజమే...! కాని ఇక్కడ  గుర్తించాల్సిన విషయం ఇంకోటుంది...  ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు మన మాస్ ఏరియస్ లో వీపరీతమైన డిమాండ్ ఉంది. ఆ సినిమాల్లో తెలిసినవాళ్లు ఎవరుంటారు, అలాగే వాటిలో పాటలు ఉండవు, కామెడీ కూడా తక్కువే అయిన వాటిని ఎగబడి చూస్తున్నారు...? ఎందుకు అని విశ్లేషించు కుంటే... అందులో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్న అనువాద చిత్రాలే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. దాంతో గ్రాఫిక్స్ అనగానే వాళ్ళు ఊహించుకునేది చాల హేవీ గా ఉంటుంది. అలాంటి వారి పెద్ద ఊహ ముందు  ఓ మాదిరి గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు ఏమి సరిపోతాయి చెప్పండి. ఇదే ప్రధానంగా మాస్ ను ఈగ అలరించలేక పోవటానికి కారణం అని మారుతి టాకీస్ అభిప్రాయం.

ఈ పరిణామం ప్రోత్సహించతగినది కాదు. వాస్తవంగా 'ఈగ ' ఒక అద్బుతమైన చిత్రం... మనమందరం  మనస్పూర్తిగా ఏకీభవించాలి. కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఈగ ఏమి చేయగలదు ..నత్తింగ్ ..! అలాంటిది దాని చేత రాజమౌళి చేయించిన సాహసాలు అనన్య సామాన్యం. రాజమౌళి ఆలోచన శక్తికి , పవర్ ఫుల్ ఇమాజినేషన్ కు హాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. కాని ఈ విషయం మాస్ కి అర్ధమయ్యేట్టు చెప్పటంలో ఎక్కడో చిన్న కమ్యునికేషన్ గ్యాప్.  ఆ గ్యాప్ ను పట్టుకుని పరిష్కరించకపోతే  భవిష్యత్తులో తెలుగులో గ్రాఫిక్స్ తో రూపొందే సినిమాలు మరిన్ని సమస్యలు చవిచూడాల్సి రావొచ్చు.  

No comments:

Post a Comment