Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, July 24, 2012

Rajamouli become a brand in Tamil



తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే ..! ఏదో సరదాగా టైం పాస్ కోసం చేద్దాం అనుకున్న సినిమా అనుకోని విధంగా పెద్ద సినిమాగా తయారై ... రూపొందించిన వ్యక్తికీ యెనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది అంటే మాములు విషయం కాదు. 'ఈగ' సినిమా రాజమౌళి కూడా  అంచనా వేయని విధంగా సంచలనాలు సృష్టించి ఆయనకు పెద్ద పేరు తీసుకు వచ్చింది.

ఈ మద్య రాజమౌళి తెలుగులో రూపొందించిన సినిమాలు ఇతర బాషలలో రీమేక్ అయ్యి విజయాలు సాదించటంతో కొంత గుర్తింపు కూడపెట్టుకున్నాడు. కాని 'ఈగ' విడుదల  తరవాత రేగిన కలకలం మూలంగా దేశవ్యాప్తంగా అయన పేరు మారుమోగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో రాజమౌళి మాయలో పడిపోయారు. తాజాగా 'నాన్ ఈ' తో తమిళ ప్రేక్షకులు కూడా అయన మీద ప్రేమ పెంచేసుకున్నారు. దాంతో రాజమౌళి అక్కడ  సరి  కొత్త బ్రాండ్ గా అవతరించాడు.

ఈ క్రేజ్ ను గుర్తించిన కొందరు రాజమౌళి పాత సినిమాల దుమ్ము దులిపి తమిళంలోకి డబ్ చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. అందులో భాగంగా ఛత్రపతి సినిమాను రాజమౌళి పేరు కలిసోచ్చేట్టు 'చంద్రమౌళి' అనే టైటిల్ అనువాదం చేస్తున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ ఈ రోజు అన్ని తమిళ పత్రికలలో వచ్చింది . కాకపోతే అక్కడ విశేషం ఏమిటంటే ఆ పోస్టర్ లో ప్రభాస్ కాని, శ్రియ కాని లేకుండా రాజమౌళి ఫోటో మాత్రమే ఉండటం. దాంతో ఈ అంశం మీద తమిళ సిని వర్గాలలో పెద్ద చర్చ జరుగుతుంది.

ఎవరెలా అనుకున్న తెలుగులో తమిళ దర్శకులు హావా  నడుస్తున్న ఈ కాలంలో తెలుగు దర్శకుడు తమిళ నాట జెండా పాతటం శుభసూచికం. రాజమౌళి తుస్సి గ్రేట్ హో.....! తోఫా కుబుల్ కరో..!

    

No comments:

Post a Comment