సక్సెస్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ ను బేస్ చేసుకుని నిర్మాతలను లైన్ లో నిలబెట్టి దూకుడుగా సినిమాలు చేసుకుంటూపోతున్నా మాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయలిచ్చి ఆఖరుగా ఓ విజయం కోసం 'సారోచ్చారు ' అంటూ ఈ వారం దియేటర్లలో సందడి మొదలుపెట్టాడు. మాస్ జనాలలో రవితేజకు ఉన్న క్రేజ్ ఆయన్ని మినిమమ్ గ్యారంటి హీరోగా చేసింది. అందుకనే పరాజయాల రికార్డ్ ఘనంగా ఉన్నా అతగాడి సినిమా ప్లాప్ అయితే వచ్చే నష్టం శాతం తక్కువ కాబట్టి ఈ మాస్ రాజా చుట్టూ నిర్మాతలు ఈగల్లా ముసురుతున్నారు.
దాంతో కష్టపడి సంపాయించుకున్నా క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా విజయాల కోసం వెంపర్లడకుండా ఎవరు ముందొస్తే వాళ్ళకే అన్న ప్రాతిపదికన ప్రసాదంలా కాల్ షీట్లను పంచేస్తూ సమయస్పూర్తిని ప్రదర్శిస్తున్నాడు ఈ బలాదూర్. ఆ క్రమంలో ఇప్పుడు తొలిసారిగా అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వంతు వచ్చింది. పెద్ద హీరోలాతో మాత్రమే సినిమాలు చేసే బ్యానర్ గా పెద్ద పేరు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ ఈ మద్య ఘోర పరజయలా పరంపరను కొనసాగిస్తుంది. సో... చేతి నిండా సినిమాలున్నా హిట్లు లేని హీరోగారిని దురదృష్టానికి... క్రేజీ కాంబినేషన్ లో భారి బడ్జెట్ తో సినిమాలు తీసిన ఫలితం దక్కని బ్యానర్ దురదృష్టం తోడై.. మైనస్సు... మైనస్సు... కలిసి ప్లస్ అయినట్టుగా ఈ ఇద్దరి తోలి కలయికలో వస్తున్నా 'సారోచ్చారు ' సినిమా వారికీ అదృష్టాన్ని తీసుకోచ్చిందేమో మనసమీక్షలొ చూద్దాం .
కధ :
హీరో కార్తీక్ (రవితేజ) రౌడీలను కొట్టి తన ఫ్రెండ్ ప్రేమ పెళ్లి చేయటంతో మొదలవుతుంది ఈ సినిమా. తరవాత అక్కడ కట్ చెప్పుకుని రోమ్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నా కార్తీక్ కు సినిమాను ముందుకు తీసుకువెళ్ళే భాద్యత ఉంది కాబట్టి తనలానే ఆలోచించే హీరోయిన్ సంధ్య(కాజల్) తో పరిచయం అవుతుంది. చదువుకోవటానికి వచ్చిన హీరోయిన్ తప్పకుండా హీరోను ప్రేమించాలి కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకుని ఆయన్ని తన వైపుకు తిప్పుకునే కామెడీ ప్రయత్నాలు చేసి కాసేపు సినిమాలో కామెడీ నటులు లేని కొరతను తీరుస్తుంది.
ఎంతకు హీరోగారు లొంగకపోయేప్పటికి ఓపెన్ అయ్యి ప్రేమించమని అడుగుతుంది. మొదలైన ముప్పావుగంటకే సినిమా అయిపోవటం ఇష్టం లేని హీరో మొదటి ట్విస్ట్ వదులుతాడు. అదీ తనకు ఇంతకు ముందే పెళ్లైందని ..! ఆ ఫై రెండో హీరోయిన్ తో తన ప్రేమ, పెళ్లి వ్యవహారాలను మొదటి హీరోయిన్ తో పంచుకుని ఇంటర్వెల్ కోసం మరో ట్విస్ట్ వదులుతాడు. రెండో సగం మొదలైనతరవాత తన ట్విస్ట్ ల గురించి కారులో వెళ్తూ హీరోయిన్ కు వివరణ ఇస్తూ ... ఇస్తూ... చివరికి అసలైన ట్విస్ట్ ఇచ్చి కధను క్లైమాక్స్ కు చేరుస్తాడు. ఆ ఫై సినిమాలో విలన్ లు ఎవరు లేని కారణంగా తమకై తాముగా తెచ్చుకున్న అవాంతరాలను దాటుకుని హీరో హీరోయిన్ ఒక్కటవ్వటంతో సినిమా ముగుస్తుంది.
విశ్లేషణ :
ఒకే రకం పాత్రలను వరసగా చూడటం వల్ల పుట్టిన విసుగును తుడిచేయటానికి ఇమేజ్ బౌండరీ నుండి ఓ అడుగు ఇవతలకు వేసి కొద్దిగా కొత్తగా కనిపించేలా ఈ 'సారోచ్చారు'. గతంలో ఈ అబ్బాయి చాలా మంచోడు తరహా పాత్రనే రవి ఈ సినిమాలో పోషించాడు కాకపోతే కొంచెం మాస్ టచ్ తో..! తనదైన మార్క్ వెటకారంతో , మాస్ పంచ్ లతో వీపరితమైన హడావిడి చేసే మాస్ మహారాజ చాలా రోజుల తరవాత తేలికపాటి హాస్యాన్ని జోడించిన రొమాంటిక్ డ్రామాలో నటించటమే ఈ సినిమాకు సంబంధించి పెద్ద విశేషం.
ఇక కధ , కధనాలా విషయం దగ్గరికి వస్తే .. ఇలాంటి కధలు తెలుగు సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. డిటైల్డ్ గా చెప్పాలి అంటే ఆ మద్య నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రాన్ని అటు ఇటు మార్చి 'సారోచ్చారు ' అన్నారు అని మొహమాటం లేకుండా చెప్పవచ్చు. కాని ఈ సినిమాను సంతోషం నుండి వేరు చేసి ప్రత్యేకంగా చూపించేది మాత్రం ఇందులో ఉన్నా మాటలు. దర్శకుడు పరశురామ్ కు ఉన్న అసలైన ప్రతిభ మాటలతో కోటలు కట్టడం. అతను వ్రాసే మాటలు సందర్భానికి అనుగుణంగా ఉండవ్... సందర్భాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆ విషయాన్నీ సార్ధకం చేస్తూ బలమైన మాటాల పునాది మీదే 'సారోచ్చారు ' సినిమాను అందంగా కట్టాడు.
అలానే కధలో కొన్ని అంశాలను చాలా స్పష్టంగా చర్చించాడు. పెళ్ళికి ముందు ప్రేమకు... పెళ్లి తరవాత ఉండే ప్రేమకు మధ్యగల తేడాను చాలా బాగా చూపించాడు. ఆతను చూపించిన సన్నివేశాలతో సంబంధం ఉన్నా ప్రేక్షకులకు ఈ సినిమా సూటిగా తగులుతుంది... వాళ్ళకు వీపరీతంగా నచ్చుతుంది కూడా..! కాకపోతే అందరికి ఆ అంశాలతో సంబంధం ఉండే అవకాశం లేదు అలాంటి వారికి నెమ్మదిగా నడిచే కధనం బోర్ కొట్టించే ప్రమాదం ఉంది. అలానే రొటీన్ క్లైమాక్స్ లో బలమైన విషయం లేక తేలిపోవటం... సరదా కోసం సినిమాకు వచ్చే వాళ్ళకు అవసరమైన కామెడీ లేకపోవటం సినిమా విజయాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు.
రేటింగ్ :
విభాగాలు
|
రేటింగ్
|
|||||||||
అభినయం:
|
2.75/5
|
|||||||||
| రవితేజ నటన పరంగా కార్తీక్ పాత్రకు 100% న్యాయం చేశాడు. డాన్సులు, ఫైట్స్ ఎప్పటిలానే బాగా చేశాడు. కాకపోతే ముఖంలో కనిపిస్తున్న ముదురు లక్షణాలను చూస్తూ అతన్ని రొమాంటిక్ హీరోగా ఒప్పుకోబుద్దికాదు. వీర లో రవితేజ పక్కన చిన్న పిల్లలా కనిపించిన కాజల్ వృద్ది సాదించి ఈ సినిమాలో ఆయనకు సరి జోడిలా కనిపించింది. ఇప్పటివరకు లేనిది ఒక్కసారిగా మిడిగుడ్లు, పెద్ద పళ్ళు కాజల్ ప్రత్యేకమైన సెక్స్ అప్పీల్ గా కనిపిస్తున్నాయి. నటన పరంగా తనకు తెలిసినదాన్ని బాగానే చేసింది. బొద్దుగుమ్మ రిచా పెద్దగా ఆకట్టుకోలేదు. అమెలోను, ఆమె నటనలోను ఆకర్షణ లోపించింది. నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో చాలా డీసెంట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. జయసుధ మినహా చంద్రమోహన్, దేవన్, యం యస్ తదితరులు ప్రాదాన్యత లేని నామ్ కే వస్తే.. పాత్రల్లో కనిపించారు . | ||||||||||
దర్శకత్వం:
|
3/5
|
|||||||||
| దర్శకుడిగా అన్ని విభాగాలను కధ , కధనాలకు అనుగుణంగా చక్కగా ఉపయోగించుకున్నాడు. కాకపోతే రవితేజ, కాజల్, రిచా, రోహిత్ పాత్రలకు తప్ప మిగత పాత్రలకు ప్రాధాన్యత లేకుండా చేయటం, కామెడీ గురించి శ్రద్ద పెట్టకపోవటం అతని వైపు నుండి కొన్ని లోపాలు. | ||||||||||
రచన :
|
3/5 |
|||||||||
కధ
|
కధనం
|
మాటలు
|
||||||||
| రెగ్యులర్ గా వినిపించే కధే. అలానే కధలో కనిపించే మూడు ముఖ్యమైన మలుపులు కూడా రసవత్తరంగా అనిపించవు. 2.5/5 |
కధనంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మాత్రం కట్టిపడేస్తాడు పరశురామ్ . కాని క్లైమాక్స్ పేలవంగా ఉండటం నొప్పిస్తుంది. 2.75/5
|
నిరాశతో ఉన్న భార్య ని గురించి భర్త చెబుతూ 'భాద్యతను భాదనుకుంటుంది..ఓపికను నొప్పనుకుంటుంది..' అంటాడు. పరిస్థితికి తగ్గట్టు ఇలాంటి హత్తుకునే డైలాగులు ఈ సినిమాలో కోకొల్లలు..! ఈ విషయంగా పరశురామ్ ను ఎంత పొగిడిన తక్కువే. 4/5
|
||||||||
సంగీతం
|
2.75/5
|
|||||||||
పాటలు
|
నేపధ్య సంగీతం
|
డాన్సులు
|
||||||||
దేవి పాటలు వినటానికి చాల బాగున్నాయి. కాకపోతే వాటికీ సినిమా ఫీల్ తో సంబంధం ఉన్నట్టు కాకుండా అతికించినట్టు అనిపిస్తాయి.
2.75/5
|
బ్యాక్ స్కోర్ పరవాలేదని పిస్తుంది అంతేకాని కొత్తగానో.. కదిలించేలానో... ఉండదు...!
2.5/5
|
'మేడ్ ఫర్ ఈచ్ అథర్ ' పాట మినహా మిగత పాటల్లో డాన్సులు రొటీన్ గా ఉన్నాయికాని రవితేజ బ్రాండ్ కు తగ్గట్టు గ్రాండ్ తగ్గకుండా ఉన్నాయి.
2.75/5
|
||||||||
సాంకేతికం
|
2.75/5
|
|||||||||
కెమెరా
|
ఎడిటింగ్
|
ఆర్ట్
|
ఫైట్స్
|
|||||||
విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ
ఏంతో నీట్ గా సినిమా మూడ్ కు తగ్గట్టు చాలా ప్లెజెంట్ గా ఉంది.
3/5
|
కోటగిరి గారి ఎడిటింగ్ లో ఎక్కడ లోపం లేకుండా చక్కగా చేశారు .
3/5
|
కొత్త ఆర్ట్ దర్శకుడికి
ఈ సినిమా పెద్ద పనిపెట్టలేదు. పాటలకు వేసిన సెట్స్ మాత్రం రెగ్యులర్ గా ఉన్నాయి.
2.5/5
|
రవితేజ ఉన్నాడు కాబట్టి ఫైట్స్ ఉండాలి అని పెట్టినట్టు ఉంటాయి కాని వాటి గురించి చెప్పుకోవటానికి ఏమిలేదు. కాకపోతే విచిత్రం ఏమిటంటే వాటి కోసం కూడా ముగ్గురు ఫైట్ మాస్టర్స్ ను ఉపయోగించటం.
2.5/5
|
|||||||
తులాభారం
|
3/5
|
|||||||||
హెచ్చులు
|
తగ్గులు
|
|||||||||
|
|
|||||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 3/5
(2.875 is the exact rating but concluding it as 3 for our convenience)
|
||||||||||
కొసమెరుపు:
సారోచ్చారు సినిమాకు ఉన్నా ప్రత్యేకమైన ఆకర్షణ డైలాగ్స్..! అవి ప్రేక్షకులకు ఏ మోతాదులో కనెక్ట్ అవుతాయి అన్నాదాని బట్టే సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

No comments:
Post a Comment