Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 20, 2012

షాడో కుర్రాడి బడాయి బానే ఉంది...!


ఒక్క హిట్  కూడా  లేక పోయిన పెద్ద హీరోలతో తప్పా సినిమాలు చేయని దర్శకుడు మెహర్ రమేష్. ఆయన  ఇప్పుడు  వెంకటేష్ తో షాడో అనే యాక్షన్ కామెడీని రూపొందిస్తున్నాడు.ఫిబ్రవరిలో విడుదల అవుతుందనుకుంటున్నా ఈ సినిమా మీద బాలీవుడ్ కన్ను పడిందని సమాచారం. ఈ మధ్య తెలుగు సినిమాలను రీమేక్ చేసుకుని హిట్ల మీద హిట్లు కొడుతున్నా సల్మాన్ ఖాన్ , అజయ్ దేవగన్ లు ఈ సినిమా కోసం పోటి పడుతున్నారని నిన్న ఒక కధనం ప్రచారంలోకి వచ్చింది. 

ఆ ఫై ఇరువర్గాల వారు దర్శకుడు రమేష్ తో మంతనాలు సాగిస్తున్నారని ఆ కధనం స్పష్టం చేసింది. అంతటితో  ఆగకుండా  ఈ విషయాన్నీ షాడో ప్రొడక్షన్ హౌస్ దృవికరించింది అని సెలవ్వివటంతో కొంత అనుమానించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఎందుకంటే బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాల కోసం ఎగబడుతున్నా మాట వాస్తవమే అయినప్పటికీ.. దానిని ఆసరాగా తీసుకుని కొందరు ప్రచారం కోసం ఇలాంటి ట్రిక్కులు కామన్ గా  ప్లే చేస్తున్నారు.. అందుకు..! కాని షాడో కు రచయతగా వ్యవహరిస్తున్నా కోన వెంకట్ కు, సల్మాన్ కు మద్య ఒక మంచి రిలేషన్ ఉంది. అలానే  సి సి యల్ పుణ్యమా అని వెంకటేష్ కూడా బానే సల్మాన్ తో దోస్తీ కడుతున్నాడు. వీటి  కారణంగా సల్మాన్ ఈ సినిమా ఫై ఆసక్తి చూపించి ఉండవచ్చు అని అనడంలో కొంత వాస్తవం ఉంది... కనుక నమ్మొచ్చు...! 

ఎటొచ్చి అజయ్ దగ్గరే స్పష్టత మిస్ అవుతుంది. అదేమంటే రమేష్ ముంబాయి వెళ్లి అజయ్ ను కలిసాడంటా. ఈ విషయాన్నీ రమేషే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. కాని రమేష్ అజయ్ కు షాడో కధ కాకుండా వేరే కొత్త పాయింట్ వినిపించాననే సరికొత్త విషయం మెల్లిగా చెబుతున్నాడు. దాంతో ఈ వార్తను ఎంత వరకు నమ్మాలో అర్ధం కాకుండా ఉంది. అంతే కాకుండా వార్తకు సంబంధం లేకుండా  రమేష్ చెబుతున్నా  డాబు కబుర్లు విని అబ్బాయిగారు బడాయి బానే పోతున్నారని ఫిలిం నగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు. 

No comments:

Post a Comment