Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, December 8, 2012

దేవరాయ రివ్యూ : సి. అ. కా. దే. ది. రా. ...!



శతాదిక చిత్రాల నటుడు అన్నా పేరు మినహా మిగత ప్రత్యేకతలను పక్కన పెట్టి నిస్సారంగా నట జీవితాన్ని తోసుకెళ్తున్నా శ్రీకాంత్ ను తాజాగా 'దేవరాయ' రూపంలో మరో పరాజయం వెక్కిరించటానికి ఖాయం అయ్యింది.  ఈ రోజు విడుదలైన ఈ సినిమా కు సంబంధించి అన్నివైపులనుండి నెగిటివ్ రిపోర్ట్స్ నమోదవుతున్నాయి. ఇక విశ్లేషకులైతే కోమలత్వాన్ని వదిలి కసాయి వాళ్ళలా కత్తులకు, కండలకు పనిచెబుతున్నారు. అవును మరీ..! ఈ సినిమాలో కనిపించే తప్పులను ఖైమా కొట్టడానికి ఆ మాత్రం కసరత్తు అవసరమే..!

శ్రీకాంత్ కు ప్రస్తుతం తన కెరీర్ లోనే గడ్డు కాలం నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 100 సినిమాల చరిత్ర కలిగిన శ్రీకాంత్ నట జీవితంలో హిట్లకు, సూపర్ హిట్లకు ఎంత స్థానం ఉందొ.. ప్లాపులకు, డిజాస్టర్స్ కు అంతే స్థానం ఉంది. కానీ ఇప్పుడు మాదిరి వరస ఘోర పరాజయాలను మాత్రం చూసి ఉండడు. అందుకు ప్రధాన కారణం మాస్ లోను , యూత్ లోను శ్రీకాంత్ కు ఫాలోయింగ్ లేకపోవటమే..! అలానే కృష్ణ రెడ్డి, ఇ వి వి  వంటి దర్శకులు లేకపోవటం, ఇప్పుడున్నా స్టార్ దర్శకులలో కొంతమంది శ్రీకాంత్ ను పట్టించుకోకపోవటం.. మరి కొందరు ఆయన్ని క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే చూడటం కూడా కొంత కారణమే. ఇలాంటి  పరిస్థితుల మద్య కూడా తన హీరోఇజాన్ని నిలుపుకోవటానికి శ్రీకాంత్ పడుతున్న ఆపసోపాలు మిగిలి ఉన్న కాస్త ఇమాజ్ ను కూడా టోటల్ గా డామేజ్ చేస్తున్నాయి. అందుకు లేటెస్ట్ ఎవిడెన్స్ ఈ 'దేవరాయ'.

విశ్లేషణాత్మకంగా రివ్యూ వ్రాయాలి అనుకుంటే... సినిమా ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర మొదలు పెట్టి ఎండ్ టైటిల్ కార్డు వరకు ఒక్కో అంశాన్ని తీసుకుని ఎకటం మొదలు పెడితే.... ఓపికని బట్టి రెండో.. మూడో... దిట్టమైన పరుపులను తాయారు చేయవచ్చు. కాని మనకంత ఓపిక లేదు కాబట్టి సింపుల్ గా కానిచ్చేద్దాం. 

బేసిక్ గా లాజిక్ లేని కధ , పొంతన లేని కధనం అనే రెండు జోడు గుర్రాలను అనుభవం సంగతి పక్కనుంచి అసలు గుర్రలంటేనే తెలియని సారధి నడిపితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి... అలా ఉంటుంది ఈ సినిమా. వంట వండే ముందు చక్కగా కూరలను కడిగి , అనువుగా ముక్కలు కోసుకుని ఓ క్రమంలో దినుసులు గట్రా  వేసుకుంటూ వంటకాన్ని తాయారు చేయటం అనేది పద్దతి. అలా కాకుండా పొయ్యి మీద ఓ గిన్నె పెట్టి దొరికినదాన్ని దొరికినట్టు అందులో వేసి కలేసి, మెలేసి కంగాళి చేసి మహాప్రసాదం అని పేరు పెడితే సరిపోతుందా...? కొత్త దర్శకుడు నాని కృష్ణ కొద్దిగా అటు ఇటుగా దేవరాయ సినిమాతో చేసిందదే. 

ఇక రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అన్నా సామెత చందంగా కెప్టన్ అఫ్ ది షిప్పే సరిగా లేకపోయేప్పటికి మిగతావాళ్ళు ఎవరికీ తోచినట్టు వాళ్ళు చేసి... సినిమా చూసేవాళ్ళతో సహనం అనే కేటగిరీలో ఓ రెండున్నర గంట పాటు ఒలింపిక్ గేమ్ ఆడించారు. దొరబాబుగా , శ్రీ కృష్ణ దేవరాయలుగా కనిపించటానికి శ్రీకాంత్ కష్టపడ్డాడు కాని సరైన గైడెన్స్ లేక పోవటంతో దొరబాబు పాత్రలో చిరంజీవిని, రాయలు పాత్రలో యన్ టి ఆర్ ను అనుకరింఛి తన ఉనికిని కోల్పోయాడు. ఇక హీరోయిన్ లా గురించి మాట్లాడుకోనవసరంలేదు. పెద్ద పెద్ద నటులు ఉన్నప్పటికీ వారిని సరిగా ఉపయోగించుకోలేదు. సాంకేతిక అంశాల పరంగా నాని కృష్ణ అసమర్ధ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే..! ఏ విభాగం మీద అతనికి పట్టు ఉన్నట్టు అనిపించదు. ఎవరు ఏది చేస్తే దానికి తల ఉపి ఊరుకున్నట్టు ఉన్నాడు. అందుకు నిదర్శనం చక్రి సంగీతం . చక్రి నుండి ఇంత బాడ్ అవుట్ పుట్ ను అసలు ఊహించలేం. పాటలు, బ్యాక్ స్కోర్ భరించలేని విధంగా ఉన్నాయి. ఇలాంటి మూకుమ్మడి తప్పులకృషి ఫలితమే.. ఈ దేవరాయ. 

ఈ సినిమా చూస్తూ 'సహనం' అనే పాజిటివ్ గుణాన్ని చాలా వరకు పెంపొందించుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం. అంతే కాని ఎంజాయ్ చేయ్యటానికో... టైం పాస్ చేయ్యటానికో అయితే మాత్రం  ఈ సినిమా ఏ  విధంగానూ ఎంచుకోతగింది కాదు. ఇక పొతే ఈ సినిమాకు రేటింగ్ ఇచ్చేంత ధైర్యం నేను చేయలేను. మన్నించండి...! 

అరె... టైటిల్ లో చూపించిన 'సి. అ. కా. దే. ది. రా.' అంటే అర్ధం ఏమిటో చెప్పలేదు కాదు .. అంటే.... ఈ సినిమా అర్ధం కావాలంటే దేవుడు దిగి రావాలి అని..! అది సంగతి.                           


No comments:

Post a Comment