Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 17, 2012

SVSC Audio Launch Highlights



సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుక ఏంతో వైభవంగా జరిగింది. పలువురు అతిరధ మహారధుల సమక్షంలో ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణుల జతగా దిల్ రాజు జరిపిన ఈ వేడుకలో విశేషాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం... 




ఈ వేడుకకు గొప్ప విశేషం పాటలను విడుదల చేయటానికి వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్ కుమారుడు గౌతమ్ ముఖ్య అతిధులుగా రావటం. సినిమా తోలి సి డి ని అర్జున్ విడుదల చేసి గౌతమ్ కు అందజేశాడు. 






 తరవాత ఈ ఫంక్షన్ లో ఆకట్టుకుంది దర్శకుడు శ్రీకాంత్ అడ్డలా  మరియు ప్రకాష్ రాజ్. సినిమా మీద వారికున్న సానుకూల అభిప్రాయాన్ని  ఏంతో చక్కగా జనాలకు తెలిసేట్టు చెప్పారు. శ్రీకాంత్ ఈ సినిమాకోసం ఇద్దరు పెద్ద హీరోలను ఎంచుకోవటానికి కారణం.. కధలోని విషయం ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంగా చెప్పటం గొప్పగా అనిపించింది. అలానే ప్రకాష్ సినిమా పాయింట్ 'మనుషులందరూ మంచివాళ్ళు..! అసలు మంచిగా ఉంటేనే మనిషంటారు ' అని చెప్పి.. సినిమా చేస్తున్న కాలంలో  మనిషిగా చాలా మారాను అని చెప్పటం  సినిమా మీద ఆసక్తిని  మరింత పెంచింది.

  



వెంకటేష్, మహేష్ లు   ఒకే వేదిక ఫై నుంచుని ఒకే సినిమా గురించి మాట్లాడటం కొత్తగానూ, ఎంతో ఆనందంగాను అనిపిస్తుంది. సినిమాతోనూ, సినిమాకు పనిచేసిన ఇతర సభ్యులతోను వారికీ  కలిగిన అనుభవాలను ఏంతో  ఆత్మీయంగా అభిమానులతో పంచుకున్నారు.    







దిల్ రాజు సినిమా ఫై ఎంత స్పష్టతతో ఉన్నాడో అతను  మాట్లాడే మాటలను బట్టి అర్ధం అయ్యింది. అలానే పెద్ద హీరోలు ఉన్నారు కదా అని మాస్ సినిమాలా కాకుండా ఓ ఫామిలీ వినోద చిత్రంగానే భావించి దియేటర్ల కు రావాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ సినీ పరిశ్రమ లో ఇద్దరు కొడుకులున్నా సెలెబ్రిటిలను చూపించి వారితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కుటుంబలన్నిటికీ ఈ సినిమాను అంకితం ఇచ్చి తన దూర దృష్టిని , తెలివితేటలను చాటుకున్నాడు.  





   

అంజలి , సమంతా కొద్దిగానే మాట్లాడిన ఆకట్టుకున్నారు. ఇరువురు తమకు వచ్చిన అవకాశానికి కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. అంజలి వెంకటేష్ కు జోడిగా 'సీత' అనే  పాత్రలో నటించానని చెప్పింది.










ఆడియో వేడుక నిర్వహించటానికి ఏర్పాటు చేసిన వేదిక ఓ మధ్యతరగతి ఇంటి సెట్ అప్ తో   చాలా బాగుంది. అలానే అక్కడ పండగ వాతావరణాన్ని సృష్టించి అతిదులుగా  వచ్చిన వారికి అరటి గెలలు, కొబ్బరి బొండాలు కానుకలుగా ఇచ్చి పంపారు. 







అలానే తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ సంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.  వాటిలో జడ కోలాటం ఆకట్టుకుంది. హరిదాసు , వేద మంత్ర పారాయణం వంటి  కార్యక్రమాలతో పాటు ఎప్పుడు రెగ్యులర్ గా వేసే డాన్సులు కనిపించాయి. 




అన్నిటితో పాటు ఈ వేడుకకు ఓ తల నోప్పి  కూడా ఉంది. అది యాంకరింగు..! సుమ ఝాన్సిలకు వారిద్దరిలో ఎవరేక్కువో తేల్చుకోవటానికి ఒక వేదిక దొరికినట్టయినది. వాళ్ళు సినిమా గురించి మాట్లాడటం కంటే వారివారి డామినేషన్ను ప్రదర్శించటానికే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చారు. ముఖ్యంగా  సుమ  సమయోచిత  స్పందనను  అందుకోలేక ఝాన్సీ పెట్టిన నసే ఎక్కువ చిరాకు పెట్టింది.   







మొత్తంగా ఏంతో ఘనంగా జరిగిన ఈ వేడుక సినిమా ఫై బోలెడన్ని ఆశలను రేకెత్తించింది. ఇక అందరి చూపులు సినిమా విడుదల కోసమే ఎదురు చూస్తున్నాయని వేరే చెప్పక్కర్లేదు.    

No comments:

Post a Comment