Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 20, 2012

పాపులర్ అయిన రామ్ చరణ్ 'వెంట్రుక '



స్టార్ హీరో తలుచుకోవాలేగాని కుక్కపిల్లా , అగ్గిపుల్లా ,సబ్బు బిళ్ళా దేనికైనా పాపులారిటీ తెచ్చేయగలడు. ఇప్పుడు టాలీవుడ్ లో వెంట్రుక అనే పదార్ధం గత రెండు రోజులుగా హల్  చల్ చేస్తుంది. అందున  మెగా పవర్ స్టార్ 'వెంట్రుక' అయ్యేప్పటికి అది చేస్తున్నా సౌండ్ సర్వత్ర చర్చనియ్యంశం అయ్యింది. 

రెండు రోజుల క్రితం 'నాయక్' పాటల విడుదల కార్యక్రమంలో మెగా ఫ్యామిలి గురించి పిచ్చి వ్రాతలు వ్రాస్తూ పిచ్చి కూతలు కూస్తున్నా మీడియా మీద ఊహించని విధంగా ఫెయిర్ అయ్యాడు చరణ్. లేనివి ఉన్నట్టు వ్రాసే వాళ్ళకు వార్నింగ్ ఇస్తూనే.. అలాంటి వ్రాతలు నా వెంట్రుకతో సమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు . చాలా కొద్దిమంది తప్పా మీడియాలోని అన్ని వర్గాలు మెగా ఫ్యామిలిలో పవన్ వ్యవహారాన్ని భూతద్దంలో చూపెట్టినవే..! కానీ వాటిలో ఏది కూడా రామ్ చరణ్ మాటలను ఎదుర్కోవటానికి సిద్దంగా లేదుకాని అన్ని కలిసి అతని వెంట్రుకకు మాత్రం ఎడతెరిపి లేకుండా ప్రచారం చేసి భీభత్సమైన పాపులారిటీ కట్టబెట్టాయి. 

కొన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రామ్ చరణ్ ఆవేశంలో అర్ధం ఉందనే చెప్పవచ్చు. కాని అతను ప్రతిస్పందించిన విధానం మాత్రం సరైనది కాదనే చెప్పాలి. స్టార్ ఇమేజ్ అంటే హోదా కాదు... భాద్యత..! తప్పుడు మాటలకూ మంచి చేతలతోనే సమాధానం చెప్పాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం చిరంజీవి 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానమే . అందుకని చరణ్ ఆవేశం తగ్గించుకుని సమయస్పూర్తితో వ్యవహరించాలని ఓక సూచన. 
     

No comments:

Post a Comment