Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 27, 2012

Yamudiki Mogudu Movie Review


కామెడీ సినిమాలా హీరోగానే కాకుండా నాన్ స్టాప్ సినిమాలా హీరోగా కూడా నరేష్ కు టాలీవుడ్ లో పేరుంది. అంటే రెండు మూడు నెలల గ్యాప్ లో నరేష్ నటించిన సినిమా రావటం అనే తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఆనవాయితీగా ఉంది. కాని ఈ సంవత్సరం నరేష్ ఈ పద్దతికి కొద్దిగా సడలింపు ఇచ్చాడు. కేవలం మూడు సినిమాలతోనే 2012 ను సాగనంపుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక హిట్టు (సుడిగాడు) ఒక ఫట్టు (నువ్వా నేనా ) తో సమానంగా ఉన్న అల్లరి బాబు 2012 తనకు కలిసి వచ్చిందో... లేదో... తెలుసుకోవటానికి ఆఖరుగా 'యముడికి మొగుడు' చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సుడిగాడు సినిమా కేవలం విజయం మాత్రమే సాదించలేదు.... నరేష్ కలక్షన్ కెపాసిటీ ని తరవాతి స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ 'యముడికి మొగుడు' హిట్ అనిపించుకుంటే చాలు ఆ మార్కెట్ నిలబడుతుంది. పరాజయం పాలైతే మాత్రం అతని మార్కెట్ విలువ కొంత తగ్గే అవకాశాలున్నాయని విడుదలకు ముందు సినిమా గురించి  విశ్లేషకులు అంచనా వేశారు. అలా నరేష్ కెరీర్ కు చిన్నపాటి ప్రాధాన్యంగా మారిన  ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర ఏమి చేయబోతుందో.. మన సమీక్షలొ చూద్దాం .  

కధ :

బ్రహ్మ చేసిన తప్పిదం కారణంగా తలరాత లేకుండా, నెలలు నిండకుండానే పుడతాడు అల్లరి నరేష్ (సినిమాలో కూడా అదే పేరు). నరేష్ నుదిటినా బ్రహ్మ రాతలేని కారణంగా అతడు దేవతలతో సమానమైన శక్తులు కలిగి, చావు లేకుండా ఉంటాడని తెలుస్తుంది. ఆ ఫై  అతనికి ఆ శక్తులు గురించి తెలిస్తే దేవతలకు ముప్పని కొన్ని సంకేతాలు తెలియజేస్తాయి. దాంతో అందరు కలసి అతన్ని ఆపటానికి యమధర్మరాజు సహాయం కోరతారు. కాని మీ తప్పు ఫలితం మీరే అనుభవించండి నన్ను ఇందులోకి లాగకండి అంటూ తప్పించుకుంటాడు యముడు . దాంతో కోపం తెచ్చుకున్న దేవతలు నారదుడి సాయంతో అల్లరి నరేష్ ను యముడికి మొగుణ్ణి చేయాలనీ నిశ్చయించుకుంటారు.

పెరిగి పెద్దవాడైన నరేష్ తో యముడి దూల తీర్చటానికి సంకల్పించిన నారదుడు యముడి కూతురు యమజ (రిచా పనాయ్ )ను  భూలోకానికి రప్పించి నరేష్ కు ముడి పెడతాడు. జరిగింది ఉత్తుత్తి పెళ్ళే అయిన నరేష్ ను నిజమైన భర్తగానే భావించిన యమజ 'మొగుడా...మొగుడా.. ' అని పిలిచి .. పిలిచి కొన్ని రీళ్ల తరవాత నరేష్ ను ప్రేమలో పడేస్తుంది. కుమార్తె ప్రేమ వ్యవహారం తెలిసిన యముడు తెలుగు సినిమా విలన్ లా  వాళ్ళ ప్రేమను హేళన చేస్తూ యమజను బలవంతంగా యమపురికి లాక్కునిపోతాడు. అప్పటికే ప్రేమ కోసం ఏమి చేయటానికైనా సిద్దం అయిన నరేష్ యముడి వాహనం దున్నపోతు తోక పట్టుకుని వెనుకాలే యమపురికి చేరుకుంటాడు. ఆ ఫై నరేష్ కు, యముడికి మద్య జరిగిన పంతలా పోరులో నరేష్ ఎలా నెగ్గాడు అన్నది మిగిలిన కధ.

విశ్లేషణ: 

2012 లో యముడి నేపద్యంలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. కాని ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఫైగా తెలుగు సినిమాకు కలిసొచ్చే పాత్రగా చెప్పుకుంటున్నా యముడి పాత్రను ఆ మూడు సినిమాలలోను ఎవరి వెర్రి మేర వాళ్ళు సం... నకించారు..! ఇంతకు ముందు విడుదలైన దరువు, మమహో యమ చిత్రాలు ఓ మాదిరిగా యముడి పరువుకి నష్టం కలిగించి వదిలేశాయి. కాని అసలు పరవు ఉండటమే ఇష్టం లేనట్టు ఆయన్ని పూర్తిగా రచ్చకీడ్చి రభస చేసింది ఈ వారం విడుదలైన 'యముడికి మొగుడు' సినిమా. యముడి పాత్రకు ఉన్న విశిష్టతను, ప్రాముఖ్యాన్ని గుర్తించకుండా ఆ పాత్రను విలన్ గానో... కమెడియన్ గానో లెక్క కట్టి వీళ్ళు ఆడించిన ఆట ఆ పాత్ర గొప్పతనాన్ని చెడగొట్టింది. అక్కడి తో ఆగకుండా తెలుగుతనం ఉట్టి పడేలా ఉండే యముడి వేషాన్ని పరబాష నటులతో కట్టించి సంకర సంభాషణలు చెప్పించి తెలుగు బాషను కూడా అపహాస్యం చేసారు. అలానే ధర్మపరిరక్షణ ధురందరుడైన యమధర్మరాజుకు రంకుతనాన్ని, మద్యపానా ప్రియత్వాన్ని అంటగట్టి ఈ సినిమా రచయతలు, దర్శకుడు వారి క్రియేటివిటికి ఉన్న కుంటితనాన్ని చాటుకున్నారు. 

నరేష్ సినిమా అంటే బుర్రున్నోళ్ళు చూసే సినిమా కాదు అని ఈ సినిమా రుపకర్తల ఉద్దేశమెమో కాని సినిమాలో కనిపించే వెకిలి వేషలను చూసి కంపరం పుడుతుంది. ఏరా.. ఒరేయ్ తో పాటు చీప్ మాటలు మాట్లాడుకునే దేవతలు, ద్వందర్ధం తప్ప మరో మాట మాట్లాడటం రాని  చిత్రగుప్తుడు, ఇష్టానుసారం ఏదేదో.. చేసే యముడి కొడుకు, దేవకన్య అయ్యుండి బాషను ఖూని చేసి మాట్లాడే హీరోయిన్ , తిక్క తిక్క గా పరవర్తించే మిగత పాత్రాలు బాబోయ్ ఒకటి కాదు... జి హెచ్ యం సి(GHMC) ఎత్తి పారేసే మున్సిపాలిటీ చెత్త మొత్తాన్నిఏరుకొచ్చి ఈ సినిమాలో పడేశారు. ఆ చెత్త మద్యలో కూర్చున్నా ఈ సినిమా చూస్తున్నా పెద్ద తేడా ఏమి అనిపించదు. 

సినిమా మొదలైన 10 నిమిషాల లోపే మిగత సినిమా ఎలా ఉండబోతుందో... మనకు సూచనప్రాయంగా ఇష్టానుసారం జోకులేసుకుంటూ మాట్లాడుకునే దేవతలు తెలియజేస్తారు. ఎంతైనా దేవతలు కదా మన మంచికే చెబుతారు. కాని 50 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం కదా అన్నా మొహమాటానికి లొంగిపోతం చూడండి.. ఆ వీక్  పాయింట్ ను పట్టుకుని మనల్ని తీసుకెళ్ళి మయపురిలో పడేస్తారు. ఆ తరవాత వీడని లేదు.. వాడని లేదు.. కాస్ట్ అనిలేదు...క్రూ అనిలేదు... ఎవడి స్టైల్ లో వాళ్ళు మయలోకపు శిక్షలను మనకు రుచి చూపిస్తారు అది కూడా గ్యాప్ వదలకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా.....! టోటల్ గా సినిమా నుండి బయటకు వచ్చేప్పటికి తనివితీరా  దూ... తీరిపొద్ది నమ్మండి.


రేటింగ్ : 


                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం : 
నరేష్ ఎప్పటిలానే తన పంధాలో తానూ చేసుకుంటూ పోయాడు. కధ, కధనం, వాటిలో ఉండే ప్రత్యేకత వంటి విషయాలకు ప్రాదాన్యత ఇవ్వకుండా తన వీలును బట్టి నరేష్ పాత్రలో నటించాడు. నాలుగు సినిమాలు చేస్తున్నా వాటిలో ఇదోకటి అన్నా ఫీలింగే కన్పిస్తుంది తప్పా.. ఆ పాత్ర ఫై నరేష్ కమిట్ మెంట్ కనిపించదు. సినిమా లో హీరోయిన్ ను చూడగానే కసుక్కున కొరికి తినేయ్యలనిపిస్తుంది. అంత సెక్సీగా ఉంటుంది. కాని ఆవిడా నోరు విప్పితేనే మనం మాట్లాడుకునే భాష మీద మనకే నమ్మకం పోతుంది. చాలా కష్టపడి ఆమె తెలుగును ఖైమా కొడుతుంటే భాదపడుతూ ఉంటాం తప్పా  ఏమి చేయలేం. మొదటి సినిమాకే  సొంత డబ్బింగ్ చెప్పుకున్నా ఆమె టాలెంట్ ను మెచ్చుకోవాలో... ఆమె మాట్లాడిన భాష అర్ధం కానందుకు తిట్టుకోవాలో అర్ధం కాదు. యముడిగా షాయాజీ సరిపోలేదు. పై పెచ్చు ఆయని సంకర బాష , కొంగర వేషాలు చికాకు పుట్టిస్తాయి. రమ్య కృష్ణ పరవాలేదనిపిస్తుంది. నారదుడిగా నరేష్ బాగానే చేశాడు. భరత్ , రఘు బాబు, జ్యోతిల మద్య వచ్చే కామెడీ ఎబ్బెట్టుగా ఉంటుంది. చిత్రగుప్తుడిగా కృష్ణ భగవాన్ పింప్ లా వ్యవహరించాడు. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బానే చేశారు.  








2/5
  
దర్శకత్వం :





1/5

ఇ వి వి శిష్యుడైన సత్తిబాబు ఈ సినిమాను చూసుకుని నాలుగైదు సినిమాలు చేసిన దర్శకుడిగా చెప్పుకోవటానికి సిగ్గుపడాలి. కధ మీదకాని , కధనం మీద కాని ఆయనకు ఎటువంటి పట్టు ఉన్నట్టు అనిపించదు. ఓ చినదానా, ఒట్టేసి చెబుతున్నా చిత్రాలలో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన సత్తిబాబు ఈ సినిమాలో డబుల్ మీనింగ్ తో కూడిన హాస్యం ..కాదు.. కాదు.. వెటకారం మీద ఆధారపడటం సోచనియ్యం. పాత్రల రూపకల్పనలోనూ, ఎంపిక లోను, చిత్రీకరణలోను లెక్కకు మిక్కిలి తప్పులు చేశాడు.      



 రచన 



కధ:
కధ వస్తువు ప్రకారం మనసుపెట్టాలే కాని చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. కాని సత్తా ఉన్న అంశాలను పక్కన పెట్టి  చచ్చు అంశాలను ఎంచుకుని జనాల తాట తీశారు.(2/5)


కధనం:
కధ  లైన్ ను పక్కాగా తాయారు చేసుకోవటంలోనే జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. అదే పొరపాటు కధనం అంత పొంగి పొర్లింది.  (1/5)


1.5/5

మాటలు : 
ఈ విభాగం గురించి మాత్రం చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఈ సినిమాకు మాటలు వ్రాసిన క్రాంతి రెడ్డి సకినలాను ఈ రోజే ప్రారంభం అయిన తెలుగు మహాసభలకు తీసుకెళ్ళి పదలా గురించి పాఠాలు చెప్పించి తెలుగు మీద మమకారం పెంపొందించాలి. గ్రందికంలో చెడిపోతున్న తెలుగును, వెటకారాన్ని చొప్పించి కోపం తెప్పించాడు. (1/5)


సంగీతం 








2/5

పాటలు :
కోటి గారు చాలా నిరుత్సాహ పరిచాడు. అత్తో..అత్తమ్మ కూతురో.. పాట మినహా మరే పాట కనీసం వింటానికి కూడా బాగోలేదు.(2.5/5)


నేపధ్య సంగీతం:
బ్యాక్ స్కోర్ అసలేం బాగోలేదు. (1/5)



డాన్సులు:
ఉంటానికి నలుగురు డాన్సు మాస్టర్లు ఉన్నారు కాని ఒక్క పాట  కూడా  ఆకట్టుకోదు. కాకపోతే పాటల్లో హీరోయిన్ అందాల విందు మాత్రం కొద్దిగా ఉరటను ఇస్తుంది.(2/5)

సాంకేతికం 












2.5/5

కెమెరా
రవీంద్ర బాబు సినిమాటోగ్రఫీ  సాదారణంగా ఉంది. మరి వారెస్ట్ అని చెప్పలేం.. అలా అని బాగుందని అనలేం.
 ( 2/5)

ఎడిటింగ్ :
కధకు అనుగుణంగా అవకాశం మేర ఎడిటింగ్ బాగానే ఉంది. ( 2.5/5)

ఆర్ట్ :
యమపూరి సెట్ మరియు ఆ వాతావరణం ఆకట్టుకునేలానే వచ్చాయి.(3/5)

గ్రాఫిక్స్ :
గ్రాఫిక్స్ పరంగా మంచి పనితనం కనిపించిది. ముఖ్యంగా యముడి దున్నపోతు చాలా బాగుంది. (3/5)


ఫైట్స్ : 
ఉన్న ఒక్క ఫైట్ నార్మల్ గా  ఉంది. (2/5)

తులాభారం





0/5


హెచ్చులు : 
సినిమాను గట్టేక్కించటానికి అవసరమైన ఒక్క ప్లస్ పాయింట్ కూడా కనిపించదు. 

తగ్గులు:
సినిమా అంత మైనస్సుల మయమే 


                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  1.5/5





                                

        

కొసమెరుపు: 

ఈ సినిమా చూసిన తరవాత అనిపించేదేమిటంటే  నిజంగా యముడనే వాడు ఉంటే... ఈ సినిమాను తీసిన వాళ్ళు తరవాత ఎప్పుడైనా యమపురికి వెళ్తే  వాళ్ళకు శిక్షగా ఈ సినిమానే మళ్లీ మళ్లి  వేసి చూపించాలని వేడుకోవాలనిపిస్తుంది.


         

No comments:

Post a Comment