ఈ మద్య కాలంలో వరసెంబడి సినిమాలు చేస్తూ రొటీన్ అనే పదానికి కేర్ అఫ్ అడ్రెస్స్ అయిన మాస్ మహారాజా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వెరైటిగా వస్తున్నాను అని బిల్డప్ ఇచ్చి రొటీన్ గానే 'సారోచ్చారు' అని అనిపిస్తున్నాడు. ఈ నెల 21 న విడుదల అవటానికి రెడీ అవుతున్న 'సారోచ్చారు' సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈ రోజు బయటకు వచ్చింది. ఆ ట్రైలర్ సినిమా మూసగానే ఉంటుంది అనే సిగ్నల్ ను ముచ్చటగా చూపిస్తుంది.
కొటేషన్లు కొత్తగా చెబుతూ రవితేజను అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని రొటీన్ గానే చూపిస్తూ ఈ ప్రచార చిత్రాన్ని తయారుచేశారు. ఇదెలా ఉందంటే కొటేషన్లు వినగానే రవితేజ ఇలా ఎలా ఉంటాడో చూడాలి..! అన్నా ఫీలింగ్ కలుగుతుంది కాని వెంటనే రవితేజ ప్రత్యక్షం అయ్యి ఎక్కువ ఊహించుకోవద్దు నేను మాములుగానే ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తాడు. దాంతో సినిమాలో కొత్తగా ఎదో ఉంది అన్నా ఫీలింగ్ కనిపించలేదు.అలానే ట్రైలర్ చివరలో కాజల్ చెప్పిన 'కెలుక్కుని, రాసుకుని ... పూసుకుని... ఇప్పుడు తుడుచుకోలేక చస్తున్నా..! డైలాగ్ సినిమా ఫీల్ తో సింక్ అయినట్టు కనిపించలేదు. పైగా.. కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. అలా ట్రైలర్ దశలోనే సినిమా మీద అంచనాలు పెంచాల్సింది పోయి తుంచేశారు. మొత్తంగా ఈ సినిమా ఒక లవ్ స్టొరీ కాని ఇందులో మాస్ కు కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పాలనుకున్న ప్రయాస కనపడింది.
'పర్ఫెక్ట్ లవ్ స్టోరి అంటే ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు' అని ట్రైలర్ లో సినిమాకు సంబంధించి హింట్ ఇవ్వటానికి ప్రయత్నించిన దర్శకుడు పరశురాం ను నమ్మటానికి లేదు ఎందుకంటే 'సాలిడ్ లవ్ స్టొరీ ' అంటూ 'సోలో' సినిమాలో ఎమోషనల్ డ్రామా చూపించి మాస్ ప్రేక్షకులను నిరాశపరిచాడు. అలానే దర్శకుడికి మంచి డైలాగ్ రైటర్ గా పరిశ్రమలో పేరుంది. కానీ ఈ ట్రైలర్ లో అతని సిగ్నేచర్ డైలాగ్ వంటివేవి కనిపించకపోవటం విశేషం. ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాలతో చికాకు పెట్టిన మాస్ మహారాజా ఈ సినిమాతో అన్నా గట్టేక్కుతాడో... లేదో.. వేచి చూడాలి.
ఏదెలా ఉన్నా దేవి సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్ లా కనిపిస్తుంది. ఈ సినిమాకోసం తను చేసిన ఐటెం సాంగ్ 'రచ్చ రంబోలా..!' మీద అంచనాలు బాగానే ఉన్నాయి... ! సినిమాలోని పాటల గురించి మళ్ళి మాట్లాడుకుందా...! ప్రస్తుతానికి ట్రైలర్ ఎంజాయ్ చెయ్యండి.

No comments:
Post a Comment