పొగరు అనే పదానికి బ్రాండ్ అంబాజిడర్లు వయసు మీదున్న కోడె గిత్తలు. అందునా ఒంగోలు జాతి గిత్తల వాటం ఎలా ఉంటుందో... ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేదు. అందుకని 'ఒంగోలు గిత్త' అని పేరు పెట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర తన రోషాన్ని ప్రదర్శించటానికి సిద్దం అవుతున్నాడు కోడెగాడు రామ్.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది అని సంకేతాలు అందుతున్నాయి. ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈ సాయంత్రం బయటకు వచ్చింది. ప్రత్యేకంగా అనిపించకపోయినప్పటికి రామ్ ను ఎలా అయితే చూడాలని అతని అభిమానులు ఆశ పడతారో... ఆ లక్షణాలన్ని ఈ సినిమాలో ఉన్నట్టు ఈ టీజర్ తెలియజేస్తుంది. కాకపోతే ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఇలాంటి సినిమాలు రామ్ కు కొత్త కాదు కాని దర్శకుడు భాస్కర్ మాస్ ఎంటర్టైనర్ రూపొందించటం ఇదే మొదలు..!
గత చిత్ర పరాభవాన్ని చాలెంజ్ గా తీసుకున్న భాస్కర్ పౌరుషం పవర్ ఏమిటో ... ఈ ఒంగోలు గిత్త తేల్చనుంది. అలానే టీజర్ కు సంబందించినంత వరుకు హైలైట్ జి వి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ స్కోర్. సినిమాలో ఉన్న ఫీల్ ను తెలియజేస్తూ అల్లాడించాడు. హీరోయిన్ కు ఇందులో ప్లేస్ లేకపోవటం కొంత కొరతే అయినప్పటికీ రామ్ ఆ లోటును పట్టించుకోనివ్వాడు. మొత్తంగా ఈ తోలి ప్రచార చిత్రంతో కావాల్సిన గుర్తింపును మాత్రం సాదించుకోగలుగుతాడు రామ్.
రామ్ నటించిన 'ఒంగోలు గిత్త ' టీజర్ మీకోసం..!

No comments:
Post a Comment