Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 17, 2012

సంక్రాంతి పండగను కబ్జా చేస్తున్నా దిల్ రాజు


సంక్రాంతి పండగంటే తెలుగు వాళ్ళకు ఏంతో ప్రత్యేకం. సంక్రాంతి అనగానే హరిదాసులు , కోడిపందేలు, బోగి మంటలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో... ఆ సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇక  మన హీరోలైతే కెరీర్ మొత్తంలో ఒక్కసారైనా సంక్రాంతి హీరో అని అనిపించుకుంటే స్టార్ గా ఒక పరిపూర్ణత సాదించినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ అభిమానులు కూడా ఈ పండగను సీరియస్ గానే తీసుకుంటారు. అలాంటి విశిష్టమైన సంక్రాంతి సందర్భాన్ని ఈ సంవత్సరం స్టార్ నిర్మాత దిల్ రాజు కబ్జా చేయనున్నాడు. 

ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంత ఊళ్లకు చేరుకొని ఆనందంగా పండగ జరుపుకుని కాలక్షేపం కోసం ఎంచుకునే వినోద సాదనం సినిమా. అందుకని  ఆ సీజన్లో స్టార్ హీరో సినిమా చేసినవాళ్ళు  జయాపజయలతో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తంలో మరే సీజన్  లోను చూడనంత బిజినెస్ చూస్తారు . ఇక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ కలక్షన్ల సునామీలో మునిగిపోవటం తప్ప తెలేదుండదు . అందుకే సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా నిర్మాతలకు మహా ప్రీతి.  ఈ సంవత్సరం ఆ అదృష్టాన్ని ఎక్కువ మోతాదులో కొట్టేయటానికి దిల్ రాజు అప్పుడే ప్రణాళిక రచించేసుకుని సంక్రాంతి వసూళ్ళలో సింహ భాగాన్ని తన ఖాతాలో వేసుకోవటానికి సిద్దం అవుతున్నాడు. 

తెలివితేటలూ, కష్టపడే తత్త్వం, సమయస్పూర్తి వంటి లక్షణాలతో అగ్ర నిర్మాత వెలుగొందుతున్న రాజు అంది వచ్చిన అవకాశాలను ఏంతో నేర్పుగా అందుకుంటాడు. అదే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాల మీద రాజు ఆధిపత్యం చెలాయించటానికి ఉపయోగపడింది. నిర్మాతగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను భారి ఎత్తున విడుదల చేయటానికి ప్లాన్ చేస్తూనే మరో పక్క ఈ సినిమాకు పోటి అనుకుంటున్నా 'నాయక్' చిత్రం  నైజాం  హక్కులను 11కోట్ల రికార్డ్ మొత్తానికి కొనుగోలు చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలగజేశాడు. 

కాని అదే రాజు యుక్తి. నైజం తెలుగు సినిమాకు గుండెకాయ. అలాంటి చోట  వేరే పంపిణి దారులైతే దియేటర్ల పరంగా కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పుడు రెండు సినిమాలు తన చేతిలోనే ఉండేప్పటికి వాటికీ వచ్చే స్పందనను బట్టి దియేటర్లను  పెంచుతా తగ్గిస్తా వీలును బట్టి వసూళ్ళు దండుకోవచ్చు.  గతంలో రచ్చ , దమ్ము, గబ్బర్ సింగ్ సినిమాల విషయంలో ఇదే చేసి లాభాలు పట్టాడు. కాకపోతే ఆ సినిమాలకు రెండు వారాల గ్యాప్ ఉంది. కాని నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కేవలం రెండు రోజుల వ్యవదిలోనే  వస్తున్నాయి. ఈ పరిస్థితిని  రాజు ఎలా హేండిల్ చేస్తాడో...చూడాలని ఔత్సాహికులు ఆసక్తిగా ఉన్నారు.          

No comments:

Post a Comment