Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 10, 2012

కమర్షియల్ అయిపోతున్న కమ్ముల..!


సినిమా అంటే పిచ్చి.... వెర్రి అంటూ మొదలు పెట్టి మొదటి సినిమా పూర్తవగానే సినిమా అంటే వ్యాపారం అంటూ సంపాదన అనే వ్యామోహంలో పడిపోతున్నారు చాల మంది. ఇప్పుడు ఈ మాటలకు తాజా నిదర్శనంగా వకాల్తా పుచ్చుకోవటానికి సిద్దం అవుతున్నాడు శేఖర్ కమ్ముల. 

ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల  ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా , కొత్త ఆలోచనలున్న దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గౌరవం పొందుతూ వచ్చాడు. కానీ కాసులు రాల్చని పొగడ్తలు మిగిల్చేది బూడిదే అని ఈ మద్యేనే గ్రహించిన కమ్ముల పూర్తీ స్థాయి కమర్షియల్ దర్శకుడిగా అవతారం ఎత్తటానికి ఆరాటపడుతున్నట్టు తెలుస్తుంది. స్వతహాగా కొన్ని భావాలూ అంతర్లీనంగా గట్టిగా పట్టుకుని ఉండటం చేత ఒక్కసారే కమర్షియల్ గా మరిపోలేనని అర్ధం చేసుకున్న శేఖర్ దానిని వేరే చోట నుండి అప్పు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అలా అరువు తెచ్చుకున్న దానితో కొంత అనుభవం గడించి ఆ ఫై కమర్షియల్ దర్శకుడిగా స్థిరపడలన్నది అతని ఉద్దేశంగా కనపడుతుంది. 

ఇంతకి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మనసుకు తట్టిన వాటి నుంచో.. అనుభవించిన అనుభవాల నుండో కధలను తాయారు చేసుకుంటాడు కాబట్టే శేఖర్ సినిమాల్లో ఓ అద్భుతమైన ఫీల్ ఉంటుంది అంటూ అతన్ని గౌరవిస్తూ వచ్చాం. అలాంటిది ఒక సినిమా సరిగా ఆడలేదని రూటు మార్చుకుని ఆర్ధిక పరమైన విషయాల కోసం ఎవరో ఆలోచనలను రిమేక్ చేయటానికి పూను కోవటం విచారించదగ్గ విషయం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ శేఖర్ హిందీ లో వచ్చిన 'కహాని' సినిమాను రిమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని వినపడుతుంది. శేఖర్ మనసు పెట్టి చూడాలే కాని కహాని లాంటి కధలు ఆంధ్రప్రదేశ్ లో అడుగడుక్కి కనపడతాయి. అలాంటివి 100 కధలు వ్రాయవచ్చు. అంతే కాని ఈ ప్రయత్నం మాత్రం ఆహ్వానించతగ్గది కాదని ఒక అభిప్రాయం . కహాని మంచి సినిమా కాదు అని అనలేం... కాని సొంత ఆలోచనలు లేని వాళ్ళే వేరే వాళ్ళ ఆలోచనల మీద పరాన్నజీవులవుతారు. శేఖర్ కు అటువంటి ఖర్మ పట్టకూడదనే ఆయన్ని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు.   ఆ ఫై ఏమి జరగనుందో ..కాలమే నిర్ణయిస్తుంది.            

No comments:

Post a Comment