ఒకే సమయంలో రెండు రూపాల్లో కనిపించటం అనేది మాములు విషయం కాదు. అలా కనిపించాలంటే మాయలు మంత్రాలతో టచ్ ఉన్న దేవతలో , దానవులో అయ్యుండాలి లేదా సినిమా వాడై ఉండాలి. దేవుళ్ళు, దెయ్యాల గురించి మనకు తెలిసింది ఊహజనితమే కాబట్టి ఈ విషయంగా ఋజువులు చూపించేది మన రంగుల బాబులే..!
ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు చేస్తూ మూడు నాలుగు వేషాలలో కనిపించి మనల్ని త్రిల్ చేసేది ఈ సినిమా వాళ్ళే . ఇప్పుడు మన హీరో వెంకటేష్ కూడా ఈ సీజన్లో రెండు రకాల గెటప్స్ లో కనిపించి అభిమానులను అలరించాటానికి సిద్దం అవుతున్నాడు. అది కూడా ఒకదానికొకటి పూర్తీ భిన్నమైన పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తో కలిసి హోమ్లీ అప్పిరేన్సు ఇవ్వనున్న వెంకి 'షాడో' లో కరుడు గట్టిన డాన్ లా భయపెట్టనున్నాడు. దానికి అనుగుణంగా ఈ సినిమాలలో రెండు పూర్తీ భిన్నమైన వేషాలు కట్టాడు.
అలానే ఈ రెండు సినిమాలు సమాంతరంగానే షూటింగ్ కూడా జరుపుకున్నాయి అని తెలియగానే ఏంతో కొంత తేడాగా కనిపిస్తున్న రెండు గెటప్స్ ను ఒకే సమయంలో వెంకీ ఎలా మైంటైన్ చేయగలిగాడు అని డౌట్ వస్తుంది...! అది సహజం. తేడాను నిశితంగా గమనిస్తే అదేమంత పెద్ద విషయం కాదు అని ఇట్టే తెలిసి పోతుంది. కావాలంటే... ఈ క్రింద ఉంచిన ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించండి మీకే తెలుస్తుంది..!
మీరు పట్టేసారనే అనుకుంటున్నాను....!
రెండు మూడు రోజుల వయసున్న గడ్డం ..., పొడవు జుట్టుతో ఉన్న విగ్...! అవే తేడాలు....!




No comments:
Post a Comment