"అందుకే నువ్వు పాడ్డం మొదలు పెట్టగానే..." అని ఒక చిన్న పాజ్ ఇచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి అదోరకంగా చూస్తూ.."పడిపోయా ..!" అని ఓ అందమైన అమ్మాయి ఓ అబ్బాయితో చెబితే ఎలా ఉంటుంది..?
అనుభవించే వాడి సంగతైతే చెప్పనే అవసరం లేదు...! వాడి ఫీలింగ్ ఏ కొలతకి అందదు. కాని చూస్తున్న వాళ్ళకు మాత్రం అదో మధురమైన అనుభూతి. ప్రేమ అనే మాటతో వాళ్ళకు పరిచయం ఉండి ఉంటే ఆ దృశ్యం పెట్టే చక్కలిగింతలను హాయిగా అనుభవిస్తారు. అదే ప్రేమ ఇతివృత్తంతో రూపొందే సినిమాలకు ఎప్పుడు పచ్చదనాన్ని చేకూరుస్తుంది. ఈ సంవత్సరం ఆనందంతో కేరింతలు కొట్టటానికి సరిపడా విజయాలను నమోదు చేసుకున్న తెలుగు సిని పరిశ్రమ ఓ విజయవంతమైన రొమాంటిక్ ప్రేమ కధ చిత్రాన్నిమాత్రం అందించలేక పోయింది. ఆ లోటును ఈ వారం విడుదల అవుతున్న గౌతం మీనన్ చిత్రం తీరుస్తుందేమో... అని ప్రేమ పిపాసులు ఆశ పడటంలో తప్పులేదు.

'ఏటో వెళ్లి పోయింది మనసు' అంటూ ఓ మంచి ఫీల్ తో కనపడుతూ బోలెడన్ని ఆశలు రేపుతూ వచ్చే శుక్రవారం దియేటర్లకు వస్తున్నా నాని,సమంతాలా జంట ప్రేమికులను ఎటువైపుకు తీసుకువెళ్తారో చూడాలి...!
గౌతం మీనన్ మార్క్ రొమాన్స్ ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయంలోనూ స్పష్టంగా కనపడుతుంది. సినిమా సంగతి తరవాత పోస్టర్లతోనే సగం కడుపు నింపేస్తున్నాడు. అందులోను 'ఇది మీ ప్రేమ కధేనేమో..' అనే కొటేషన్ తో ప్రేమతో పరిచయం ఉన్నా ప్రతి ఒక్కణ్ణి అలెర్ట్ చేస్తున్నాడు. అలానే ఈ మద్య కాలంలో ఇంత అందమైన సినిమా వాల్ పేపర్స్ చూడలేదనే చెప్పాలి. గౌతమ్ ఈ మ్యాజిక్ ను పోస్టర్లకే పరిమితం చేశాడో .. సినిమాలోనూ చూపించాడో.. మరో రెండు రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఈ పోస్టర్లను చూసి ఎంజాయ్ చెయ్యండి.

No comments:
Post a Comment