Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, December 25, 2012

మెగా అభిమానులకు వి'నాయక్' షాక్..!

 
నాయక్ సినిమా మొత్తానికే జబర్దస్త్ అనుకుంటున్నా 'లైలా ఓ లైలా' పాటా అనూహ్యంగా బయటకు వచ్చి చేస్తున్నా హాల్ చల్ ను చూసి గోరంత ఆనందం.. కొండంత విషాదంతో (సినిమా ఫై ఆసక్తిని తగ్గిస్తుందేమో అనే భయంతో..) తల్లడిల్లుతున్నా మెగా అభిమానులకు వినాయక్  మరో జేల్లకాయ కొట్టాడు. నాయక్ ఆల్బం కే టాప్ పాటగా మాస్ జనాలా నీరాజనాలు అందుకుంటున్నా "ఎవ్వరమంటే ... ఎలూరే .." మీద మెగా అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది ఆ పాట కోసం అవుట్ డేటెడ్ హీరోయిన్ ను ఐటెం గర్ల్ గా ఎంపిక చేసుకోవటంతో వారికి నమ్మటానికి ఒప్పుకోబుద్దికానటువంటి షాక్ తగిలింది.

కాకపోతే ఎవరు అభిమానుల అనుమానాల గురించి పట్టించుకుంటున్నట్టు లేదు. పాటను తెర మీద చూసి మాట్లాడండి అన్నట్టు వినాయక్ , చరణ్ చాల ఆర్భాటంగా చిత్రీకరణ చేసుకుంటూ పోతున్నారు. ఇక ఆ పాట కోసం ఎంపికైన ఛార్మి సంగతైతే చెప్పటానికే లేదు. ఎందుకంటే సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్ళు అవుతున్నా   అమ్మడి వైపు మెగా హీరోలు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది మొదటిసారి మెగా క్యాంపులో అడుగు పెట్టడం, అందునా మెగా పవర్ స్టార్ తో కాళ్ళు కదపటం వంటి విషయాలతో ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అక్కడితో సరిపెట్టకుండా నిన్నా మెగాస్టార్ పాట జరుగుతున్నా సెట్ కు  వచ్చి అమ్మడితో ఫోటో దిగేప్పటికి ఈ బొద్దుగుమ్మ బెలూన్లా మరింత ఉబ్బిపోయి మెగా భజన మొదలెట్టేసింది. ఇలా అంతా  అయిపోయిందనుకుంటున్నా తరుణంలో తగిలిన ఈ గోల్డెన్ ఛాన్స్ గురించి తరచి తరచి తెలిసిన వాళ్ళుకు, తెలియనివాళ్ళకు చెప్పి చెప్పి  విసుగిస్తుందంటా...! 

 ఇక్కడ సంతోషించ తగ్గ విషయం ఏమిటంటే... ఈ రట్టును సినిమా విడుదల వరకు గుట్టుగా ఉంచకపోవటమే...! అదే జరిగి ఉంటే సినిమా ఫలితం మీద ఏంతో కొంత ప్రభావం చూపించేది. ఇప్పుడు ఛార్మి గురించి తెలిసిపోయింది కాబట్టి ఎక్కువ ఊహించు కోకుండా మనసుకు సర్ది చెప్పుకుని సిద్దపడి సినిమాకు వచ్చిన అభిమానులు ఎలాంటి పరిణామన్నైనా తట్టుకోగలుగుతారు. ఇదే వినాయక్ ప్రణాళిక కూడా అయ్యుంటుంది.. అందుకనే చార్మిని ఇష్టానికి రెచ్చిపో.. అని కీ ఇచ్చి వదిలినట్టు ఉన్నాడు. ఫలితం సందు చూసుకుని సందడి చేస్తున్నా అమ్మణ్ణి పట్టుకోవటం ఎవరి వల్ల కావటం లేదు.






                     

No comments:

Post a Comment