దర్శకుడిగా అవతారం ప్రారంభించిన స్టార్ డాన్స్ మాస్టర్ లారెన్స్ తన తోలి చిత్రం పూర్తికాగానే తరవాతి సినిమా కోసం ప్రభాస్ ను టార్గెట్ చేసుకున్నాడు. ప్రభాస్ కూడా లారెన్స్ తో సినిమా చేయాలని ఉబలాట పడ్డాడు, కాని అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవటంతో ఎప్పటికనే సినిమా చేస్తానని మాటిచ్చాడు. మరో పక్క అలాంటి మాటనే నిర్మాతలు పుల్లారావు, భగవాన్ లకు ఇచ్చాడు ప్రభాస్. అలా కొన్నాళ్ళకు లారెన్స్ , ఆ నిర్మాతల కాంబినేషన్లో 'రెబెల్' సినిమాకు శంకుస్థాపన చేశాడు ప్రభాస్. అంటే ఇప్పుడు జరుగుతున్నా రెబెల్ వివాదానికి నాటు వేసింది ప్రభాసే అని అర్ధం అవుతుంది.
అలానే ఆ వివాదంలో ప్రభాస్ కు పరోక్ష పాత్ర కూడా ఉంది. ఎలాగంటే... నిర్మాత, దర్శకులకు చాన్నాళ్ళకు అవకాశం ఇవ్వటంతో ఇద్దరు ప్రభాస్ మీద వారికున్నా అభిమానాన్ని నిరూపించుకోవటానికి శక్తికి మించి ప్రయత్నించి చిక్కుల్లో పడ్డారు. ప్రభాస్ ను ఇంతకు ముందు చూడని విధంగా చూపించాలనే తాపత్రయంతో లారెన్స్ తీసిన సినిమానే మళ్లీ, మళ్లీ .. మార్చి, మార్చి తీసి 22 కోట్లు అనుకున్న బడ్జెట్ ను 44 కోట్లు చేశాడు. నిర్మాతలు కూడా ప్రభాస్ ను నమ్ముకునే కళ్ళు మూసుకుని ఖర్చు చేశారు . కాని సినిమా ఫలితం తలక్రిందులయ్యేప్పటికి వ్యవహారం పంచాయితిలకు వెళ్లి పరిహారం చెల్లించే వరకు వచ్చింది. నిర్మాతల భాదలను అర్ధం చేసుకున్నా నిర్మాతల మండలి తప్పుకు లారెన్స్ ను భాద్యుణ్ణి చేస్తూ 2.5 కోట్ల జరిమానా విధించింది. అలా పరోక్షంగా ప్రభాసే కదా లారెన్స్ కొంప ముంచింది.
అదలా ఉంటే లారెన్స్ నుండి పరిహారం వాసులు చేయటంలో నిర్మాతల మండలి ఖచ్చితంగా వ్యవహరిస్తోంది. అంటే కాకుండా లారెన్స్ కు వంతపాడే వాళ్ళకు కూడా స్ట్రాంగ్ అల్టిమేటం ఇస్తుంది. ఇక పరిస్థితి చూస్తుంటే... నిర్మాతల మండలి లారెన్స్ ముక్కు పిండి నష్ట పరిహారం వసూలు చేసేట్టే కనపడుతుంది.

No comments:
Post a Comment