Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, December 10, 2012

దియేటర్లకు స్పాట్ పెట్టిన లోకనాయకుడు...!


లోక నాయకుడు కమలహాసన్ ఏది చేసిన సంచలనమే..! అది నటన కానివ్వండి...యవ్వారం కానివ్వండి. బాలచందర్,కె  విశ్వనాధ్ వంటి ఉద్దండ దర్శకుల తరవాత తనలోని నటనా ప్రతిభను వాడుకోగల దర్శకులు దొరక్క అవసరాన్ని బట్టి దర్శకుడిగా మారి తన కళాతృష్ణను తీర్చుకుంటున్నాడు కమల్. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన  'హే  రామ్' , పోతురాజు చెప్పినట్టు' చిత్రాలు కొన్ని వివాదాలను మూటాగట్టుకున్నాయి. తాజాగా కథక్ నాట్యకారుడిగా నటిస్తూ.. తీవ్రవాదాన్ని చర్చిస్తూ... అయన రూపొందించిన 'విశ్వరూపం' చిత్రంతో తమిళనాట సరి కొత్త వివాదానికి తెర తీశాడు. 

హాలీవుడ్ రేంజ్ లో ఖర్చుకు వెనుకాడాకుండా  నిర్మించిన ఈ చిత్రాన్నితెలుగు , తమిళం, హిందీ బాషలలో జనవరి 11న విడుదల చేయటానికి ప్లాన్ చేసుకున్నాడు  కమల్ . ఆ ప్రకారమే రిజనబుల్ మొత్తానికి అన్ని ప్రాంతాలకు హక్కులను అమ్మేసిన తరవాత  కూడా లాస్ లో ఉండటం గమనించి కొత్త పంధాకు శ్రీకారం చుట్టి  వివాదం రేపాడు కమల్.  అదేమంటే సినిమా ప్రదర్శన హక్కులను పంపిణి దారులతో పాటు ఒక డి టి హెచ్ సంస్థకు కూడా భారి మొత్తానికి కట్టబెట్టేసాడు.  అంటే విడుదల రోజే ఆ డి టి హెచ్ కనెక్షన్ ఉన్నవాళ్లు కొంత మొత్తం చెల్లించి ఇంట్లో ఉండే టి వి లో విశ్వరూపం సినిమాను  చూడవచ్చు. 

ఈ విషయం తెలుసుకున్న దియేటర్ల సంఘం ఇలా అయితే దియేటర్లకు  జనాలు రారు అంటూ ఆందోళనకు దిగారు. డి టి హెచ్ తో ఒప్పందాన్ని రద్దుచేసుకోకపోతే సినిమా ప్రదర్శనను నిలిపి వేస్తాం అంటూ వాళ్ళు చేసిన హెచ్చరికలను కమల్ పట్టించుకోకపోవటంతో వివాదం ముదిరి పంచాయితీ అమ్మ జయలిత వద్దకు చేరింది. ఇ ప్పుడు అమ్మ ఏమని సెలవిస్తారో.. అని సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. 

పైరసీ దెబ్బకు, టి వి లా దెబ్బకు నిన్న మొన్నటి వరకు విలవిలలాడిన దియేటర్లు డిజిటలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నాయి. ఇప్పుడు కనుక ఈ డి టి హెచ్ లా వ్యవహారం పట్టాలెక్కిందంటే మళ్లీ దియేటర్ల భవిష్యత్తు ప్రస్నార్ధకం అవుతుంది. ఈ పరిణామం  ఎటు దారి తీస్తుందో... వేచి చూడాలి.           

No comments:

Post a Comment