ఫైన ఫోటోలో కనిపిస్తున్న యన్ టి అర్ కొత్త అవతారం బాద్షా సినిమాలో అతని న్యూ లుక్ గా చెబుతున్నారు. కాని ఆ లుక్ యన్ టి అర్ అభిమానులకు సుపరిచతమే...! మాములు పరిచితం కాదు... యన్ టి అర్ ను అభిమానించే వాళ్ళు ఓ పట్టాన మర్చిపోలేని రూపు అది. ఎందుకంటే 2004 వీపరితమైన అంచనాలతో విడుదలై యన్ టి అర్ అభిమానుల ఆశలను సునామిలా తుడిచి పెట్టేసిన ఆంధ్రావాలా చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద యన్ టి అర్ (జునియరే పెద్దోడిలా చేశాడు ) గెట్ అప్ ఇంచు మించు అలాగే ఉంటుంది. దాంతో గతం గుర్తొచ్చి కొద్దిగా భయపడాల్సిన పరిస్థితి నందమూరి అభిమానుల్లో నెలకుంది .
కానీ భయపడాల్సింది ఏమిలేదని... జూనియర్ బాద్షా లో నాలుగైదు రూపాల్లో కనిపించనున్నాడని... వాటిల్లో ఇది కూడా ఒకటని, శ్రీను వైట్ల ప్రతి పాత్రను చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడని... అందుకని ఆ పాత్ర ఫై ఎంటువంటి అనుమానాలు అక్కర్లేదని యూనిట్ సభ్యులు నమ్మకమైన భరోసా ఇస్తున్నారు. అలానే ఈ సినిమా గురించి ఎక్కడ చూసిన పోజిటివ్ టాకే వినపడుతుంది. ఇండస్ట్రి రికార్డులకు కొత్త టార్గెట్ లు సెట్ చేసే చిత్రంగా బాద్షా నిలబడతాడని మరో పక్క వినపడుతుంది. కాని విటన్నిటిని పట్టించుకోకుండా ఏంతో శ్రద్దగా విజయమే లక్ష్యంగా తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు యన్ టి అర్. ఆఫై ఏమి జరుగుతుంది అనేది ఎప్పుడులానే కాలమే నిర్ణయిస్తుంది.


No comments:
Post a Comment