మాస్ మహారాజ అనే బిరుదును సార్ధకం చేయటం కోసం వరసేంబడి మసాలా సినిమాలు చేసి వెగటు పుట్టించిన రవితేజ ఇప్పుడు రూటు మార్చి టాలీవుడ్ షారుఖ్ ఖాన్ అనిపించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందుకు తోలి అడుగుగా ఈ వారం విడుదల అవుతున్న 'సారోచ్చారు' సినిమానే ఎంచుకున్నాడు.
వరసగా ఒకే రకం సినిమాలు చేస్తున్నాడు.. అనే మాటలను కాయటానికి ఈ సినిమాతో ఒక క్లీన్ లవ్ స్టొరీ లో రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించనున్నాడు. ఫుట్ బాల్ కోచ్ లా నటిస్తున్న రవి ఇద్దరు ముద్దుగుమ్మల మనసు దోచుకుని... ఇద్దరితోను దోబుచులాడి చివరికి ఒక భామకే సొంతం అవుతాడని దర్శకుడు చెబుతున్నాడు. అలాంటి హీరో పోలికలకు, కధలో కనిపిస్తున్నా లక్షణాలకు బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ ను పరిగణిస్తారు దేశవ్యాప్తంగా రొమాన్స్ ను ఇష్టపడే సినిమా ప్రేమికులు. అలానే నెగిటివ్ అంశాలకు చోటు లేకుండా పూర్తిగా మనసును ఆకట్టుకునే పోజిటివ్ వాతావరణమే సినిమాలో కనిపిస్తుందని దర్శకుడు చెప్పటం... అందుకు నిదర్శనంగా రెగ్యులర్ రవితేజ సినిమాలకు విరుద్దంగా ఈ సినిమాకు 'U ' సెర్టిఫీకెట్ రావటం సినిమా ఎలా ఉండబోతుందో చెబుతుంది.
ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆటోగ్రాఫ్ సినిమాల తరవాత రవితేజ చేసిన క్లీన్ సినిమా ఇదే అవుతుందేమో... వేచి చూడాలి. మొత్తంగా ఈ పరిణామాలు బట్టి మాస్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే... బాలీవుడ్ ముదురు హీరోలలాగా రొమాంటిక్ ఇమేజ్ ను కూడా తగిలించుకుంటే.. అవసరాన్ని బట్టి సినిమాలు చేసుకుంటూ పోవచ్చనే రవితేజ ముందుచూపు అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ ప్రయత్నాన్ని రవితేజ ను పిచ్చిగా అభిమానించే మాస్ ప్రేక్షకులు ఎంతవరకు ఆహ్వానిస్తారో.. వేచి చూడాలి.

No comments:
Post a Comment