ఈ ముక్కేవరిదా ... అని ఆలోచించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ మేటర్ ముక్కు కాదు.....ముక్కెర ..! ఇక పొతే ఆ కనిపించే సట్టి ముక్కు మన పొట్టి పిల్లా సమంతాది. ఈ తమిళ పొన్ను బుజ్జి మ్కుక్కేసుకుని బానే ఉంటుంది. ఆ బుల్లి ముక్కుకు ముక్కెర పెట్టేప్పటికి ఎంతందం వచ్చిందో.. గమనించండి. 'ముక్కుకు ముక్కెర అందం..అని ఏదో పాటలో విన్నట్టు గుర్తు ..! ఎదో.. ఎక్కడో... అన్నట్టుగానే మన సినిమాల్లో ముక్కు పుడకతో కనిపించే హీరోయిన్ పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి.
పొరపాటున వచ్చినా అందరికీ ఓ పట్టానా ముక్కు పుడక నప్పదు . కాని ఇక్కడ సమంతకు ముక్కెర కొత్త అందాన్ని తీసుకు వచ్చింది. టెన్నిస్ రాణి సానియా ముక్కు పుడకతో ప్రత్యేకమైన అందంతో కనిపిస్తుంది. ఇప్పుడు సమంత కూడా ముక్కు పుడకతో సరిగ్గా సానియాను తలపిస్తుంది. ఈ అమ్మడు ముక్కెర తెచ్చిన సరి కొత్త అందంతో మరి కొన్ని గంటల్లో విడుదలయ్యే 'ఎటో వెళ్లి పోయింది మనసు ' సినిమాలో కనిపించి అలరించబోతుంది . సమంతా కు ముక్కెరలా ఈ సినిమాకు హిట్ అవటానికి సరిపడా అలంకారాలు చాలానే కనిపిస్తున్నాయి. అవి రొమాన్స్ ను తనదైన స్టైల్ లో పండించే గౌతమ్ దర్శకత్వం, నాని, సమంతాలా జంట, వారిద్దరి మద్య కుదిరిన చక్కటి కెమిస్ట్రీ , ఇళయరాజా సంగీతం మొదలైనవి.
ఇలా అన్ని అంశాలు కలిసి సినిమా మీద యూత్ లో అంచనాలకందని క్రేజ్ ను తీసుకొచ్చాయి. అందుకు నిదర్శనం హౌస్ ఫుల్ బోర్డ్ లను చూపిస్తున్న అడ్వాన్సు బుకింగ్ కౌంటర్స్. నాని ఇంతకు మునుపు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు మంచి ఒపెంగ్స్ రాబట్టే పరిస్థితి పుష్కలంగా ఉంది . ఇక ఆ ఒపెంగ్స్ ను విజయం గా మార్చుకోవాల్సిన భాద్యత సినిమా రూపకర్తలా పైనే ఉంది. ఆ భాద్యతను వారు ఎంతవరకు నెరవేర్చారో మరి కొన్ని గంటల్లో రాబోయే మన రివ్యూ లో చూద్దాం .


No comments:
Post a Comment