Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, December 7, 2012

ఈ కుర్ర హీరోకు ప్రత్యామ్నయం యన్ టి ఆరేనా.....?


 బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా రుపొందాల్సిన కొత్త చిత్రం రూటు మార్చుకుని యన్ టి ఆర్ ముంగిట నిలిచింది. దాంతో కుర్ర హీరో రామ్ కు ప్రత్యామ్నయం యన్ టి ఆరా ..? అన్నా చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో వాడిగా వేడిగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో యన్ టి ఆర్  చేసిన ఊసరవెల్లి వయ రామ్ నుండి వచ్చిందే..! 

నిర్మాతకు, దర్శకుడికి మద్య తలెత్తిన అపార్ధాల కారణంగా ఊసరవెల్లి రామ్ దగ్గర నుండి యన్ టి ఆర్  దగ్గరకు వలస వచ్చిందని అప్పట్లో వినపడింది. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ సినిమా కూడా రామే చేస్తున్నాడని.. దానికి పేరు కందిరీగ 2 అని అవసరానికి మించి ఠాం... ఠాం.... చేశారు . కందిరీగ సినిమా టైం లో బెల్లంకొండ తో పారితోషకం పరమైన వివాదాలు జరిగినప్పటికీ దర్శకుడి కోసం సర్దుకు పోయి రామ్ కూడా ఆ సినిమాను చేస్తున్నా.. అంటూ ట్విట్టర్ లో చాటింపువేశాడు. ఫై కి ఒప్పుకున్నా లోనా ఉన్న అయిష్టం పెరిగి వ్యవహారం పొసగక అసలుకే ఎసరోచ్చింది. దర్శకుడు కూడా రామ్ తోనే చెయ్యాలని ఆశపడ్డాడు. కానీ తొలిగా అవకాశం ఇచ్చిన బెల్లంకొండతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయనకు మరో సినిమా చేయాల్సి ఉండటంతో ఎలాగో అలా ఇద్దరికి సర్దిచెప్పి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నాడు.

ఈ లోపు బెల్లంకొండ అదృష్టం పుచ్చి యన్ టి ఆర్ ఈ కధ  లైన్ విని ఆసక్తి చూపించటంతో రామ్ ను ఆటోమేటిక్ గా పక్కన పెట్టేసారు. అలా అనుకునో... అనుకోకుండానో... యన్ టి ఆర్  రామ్ ను వద్దనుకునే దర్శకనిర్మాతలకు ప్రత్యామ్నయంగా మారాడు. ఈ సినిమా కోసం సంతోష్ శ్రీనివాస్ రూపొందించిన స్క్రిప్ట్ కందిరీగతో పోలిస్తే దాని  అమ్మ మొగుడులా వచ్చిందని  టాక్..! దాదాపు కందిరీగ సినిమాకు కొనసాగింపుగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో యన్ టి ఆర్  రామ్ ను ఏ విధంగా మరిపిస్తాడో... వేచి చూడాలి.  

   

           

No comments:

Post a Comment