గుంజుకుపోతారు.. జాగ్రత్త! శ్రద్ధ గా వింటే మనసును .. మైమపిరిచిపొతే మొత్తంగా మనిషినే గుంజుకుపోతారు. మణిరత్నం, రెహమాన్,శక్తిశ్రీ గోపాలన్ , సాహిత్యం ఈ నలుగురు నిర్దాక్షణ్యంగా సున్నితమైన మనసును గుంజుకు పోవాలని డిసైడయ్యారు. 'నిన్జుకుల్లె..' అంటూ తమిళనాట స్లో పాయిజన్ అయ్యి కూర్చున్న ఈ పాట 'గుంజుకున్నా ..' అంటూ తెలుగు వాళ్ళను వేటాడటం ఖాయంగా కనిపిస్తుంది. పాట విన్నా తరవాత బాబోయ్ ఇదేం పాటండి... బాబు! అని అనకుండా ఉండలేం..!
గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే ..! అంటూ మొదలయ్యే పాట నెమ్మదిగా తనలోకి మనల్ని గుంజుకుంటూ... పాట పూర్తయ్యే లోపు వశం చేసుకుని బానిసల్ని చేసుకుంటుంది. పాటలోని ఫీల్ తోను , పదాలతోను మన మనసు కాలేసుకుని మెలేసుకుపోతుంది. ఓ పడతి తనలోని స్వచ్చమైన ప్రేమను వ్యక్తికరించటమే ఈ పాట ఉద్దేశం. కానీ ఈ పాటలోని భావం ప్రతి ఒక్కరికి సంబందించింది అని అనిపిస్తుంది. పాట కోసం ఉపయోగించిన పదాలు ఎంత బాగున్నాయంటే...'తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా...!', 'పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే...', 'రబ్బరు గాజులకు సడి చేసే నోరేది... ,' వంటి వాఖ్యలు కట్టిపడేస్తాయి.
సింపుల్ గా చెప్పేదేమంటే ఈ పాట వింటున్నంత సేపు లీనమైపోతాం .. పూర్తయ్యాక అయిపోయిందా అని వర్రీ అవుతాం..! కావాలంటే ఓ సారి విని ట్రై చేయండి.. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది... !

No comments:
Post a Comment