Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, November 24, 2012

Review: ' Routine love story ' with Original Feel


ప్రస్థానం చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ తొలిసారి సోలో హీరోగా చేసిన 'రొటీన్ లవ్ స్టొరీ ' తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి ఈ వారం దియేటర్లకు వచ్చింది. సహాయ నటుడిగా, సైడ్ హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకన్న సందీప్ ఈ సినిమాతో సోలో హీరోగా నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నాడు.

ఎల్ బి డబ్ల్యు సినిమాతో పరిశ్రమ దృష్టిలోకి వచ్చిన ప్రవీణ్ సత్తారు  దర్శకుడిగా తన అసలైన సత్తాను నిరుపించుకోవటానికి ఉబలాట పడుతున్నాడు. అలానే మొదటి సినిమా 'యస్ యం యస్' తనకు  గుర్తింపునిచ్చిందో.. లేదో.. తెలియని అయోమయంలో ఉన్నా హీరోయిన్ రెజినా  టాలెంట్ కు  ఈ సినిమా ఓ పరీక్ష. వీరి మాదిరిగానే మరికొందరు ఈ సినిమా రొటీన్ గా... ఓ సూపర్ హిట్ అయ్యి వారి కెరీర్ కు ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నారు.  ఇంతమంది ఆశల సౌదమైన ఈ 'రొటీన్ లవ్ స్టొరీ' లో నిజంగా అంత సత్తా ఉందా.....? మన సమీక్షలో చూద్దాం . 


కధ :

ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన సంజు (సందీప్ కిషన్ ) తోలి చూపులోనే తన్వి (రెజినా) తో ప్రేమలో పడతాడు. ప్రతి మనిషికి ప్రేమ అనేది రొటీన్ .. కాని ఒకసారి ప్రేమలో పడిన తరవాత అందులో కలిగే ఫీలింగ్ ఎప్పుడు ఫ్రెషే ...! అలా మొదలైన  సంజు ప్రేమ అతని ఫ్రెండ్స్ చొరవతో రొటీన్ జర్నీ మొదలుపెడుతుంది. సంజు, తన్విలకు ఒకరంటే ఒకరికి లోన ప్రేమ ఉన్నప్పటికీ... వారి చూట్టు ఉన్న పరిస్థితులు కారణంగా ప్రేమకు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలను దాటుకుని ఈ పిచ్చి ప్రేమ రొటీన్ గా ఆ నవ ప్రేమజంటను ఎలా ఒక్కటి చేసింది అన్నది ఈ సినిమా కధ .


విశ్లేషణ:

రిలేషన్ షిప్స్ అర్ ఫన్..! అని ఈ సినిమా పోస్టర్ లో ఓ కాప్షన్ ఉంది. అంటే.. బంధాలు భలే సరదాగా ఉంటాయ్ అని అర్ధం వచ్చేలా..! సరిగ్గా ఈ కాప్షన్ కు అర్ధం చెప్పేలానే ఉంటుంది ఈ 'రొటీన్ లవ్ స్టొరీ'. ప్రేమించటానికి అన్ని అర్హతలు ఉన్న ఒక అందమైన అమ్మాయి, ఒక స్మార్ట్ అబ్బాయి ప్రేమవశాత్తు ఒక చోట కలుస్తారు. కాకపోతే వారిద్దరికీ ప్రేమ మీద కొన్ని అమాయకమైన అభిప్రాయాలూ ఉంటాయి. దాంతో ప్రేమలో రొటీన్ గా పడిపోకూడదని  కొన్ని ప్రయత్నాలు చేసి కావలసినంత వినోదాన్ని ప్రేక్షకులకు పంచి చివరికి ప్రేమ ఆడిన వింత నాటకంలో రొటీన్ గా పీకల్లోతు కూరుకుపోతారు. ఇలా సినిమా అంత చాలా సరదాగా, హాయిగా , గమ్మత్తుగా మొదటి నుండి చివరి వరకు సాగిపోతుంది. 


అలానే సినిమా ఆద్యంతం 'ఎప్పటికైనా....' పాట  మనల్ని పలకరిస్తూ గిలిగింతలు పెడుతుంది. ఆ పాట వచ్చినప్పుడల్లా ఒక అనిర్వచనియ్యమైన అనుభూతి కలుగుతుంది. మిక్కి చేసిన ట్యూన్ దానికి అనంత శ్రీ రామ్ సాహిత్యం కలిసి ప్రవీణ్ అందమైన చిత్రీకరణ తోడై సందీప్, రేజినాలా పెర్ఫార్మన్స్ జతకూడి ఆ పాటను ఆస్వాదిస్తున్నా వారికీ  మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది. నేను నమ్మకంగా చెప్పగలను సినిమా చూసిన తరవాత ఈ పాట మిమ్మల్ని హంట్ చేయకమానదు.  



అలానే హీరో హీరోయిన్ లకు ప్రేమ మీద ఉన్నా సరదా అనిపించే  అభిప్రాయాలూ, వాటిని నమ్మినట్టే నటించి వాళ్ళను తమదైన స్టైల్ లో మార్చే వారి ఫ్రెండ్స్ బాచ్. హీరోయిన్ ను వన్ సైడ్ లవ్ చేసే తులసి, తాగుబోతు రమేష్ ఎపిసోడ్స్ , విచిత్రంగా ప్రవర్తించే  హీరోయిన్ ఫ్యామిలీ జంగల్ మే మంగల్ అనే రియాలిటీ షో చేసే కామెడీ, రోటినే అయినా సరదాగా ఉండే హీరో ఫ్యామిలీ, హీరో చనువుగా ఉండే పక్కేంటి అక్క , ఆ అక్క గారి భర్త హీరోకు లేడీస్ గురించి చేసే ఉపదేశం... ఇలా దాదాపు సినిమాలోని ప్రతి అంశం మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది.  



రేటింగ్ :


                                      విభాగాలు 
 రేటింగ్ 
  అభినయం:














3.25/5
సినిమాలోని ప్రతి పాత్రను చాలా చక్కగా రూపొందించారు అలానే అంతే  చక్కగా ప్రెజెంట్ చేశారు. కధలో ప్రతి పాత్రకు గుర్తింపు ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ తమ ఉనికిని చాటుకుంటూ కధ గమనానికి ఉపయోగపడతాయి. ఒక్క పాత్ర కూడా అవసరం లేదు అనిపించదు. ఇక సినిమాకే హైలైట్ హీరో హీరోయిన్. వాళ్ళిద్దరి మధ్య వర్క్ అవుట్ అయిన కెమిస్ట్రీ , ఫిజిక్స్ , మాథ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. వాళ్ళిద్దరి మద్య వచ్చే చిలిపి సరసాలు, గమ్మత్తైన తగాదాలు చక్కలిగింతలుపెడతాయి. ఎంత వద్దనుకున్న ఆ లవ్ జంటను చూస్తూ మనసు పారేసుకోకుండా ఉండలేం. వాళ్ళు కూడా పోటి పడి నటించారు. సందీప్ లో ఇంతవరకు చూడని యాంగిల్ చూస్తాం. లవర్ బాయ్ గా చక్కటి ఈజ్ తో నటించి ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల కొందరు హీరోలను అనుకరిస్తున్నట్టు అనిపిస్తుంది కాని మొత్తంగా హీరో మేటిరియాల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. తను అక్కడక్కడ వాడే ఉత్తరాంద్ర స్లాంగ్ బాగుంది.  తమిళ పొన్ను రెజినా ఒక అండర్ డాగ్. ఉపయోగించు కోవాలే  కాని.. టాలెంటెడ్ తురుపు ముక్క. గ్లామర్ పరంగా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది కాని యాక్టింగ్ మాత్రం చితక్కోటేసింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో సందీప్ ను ఫుల్ గా  డామినేట్ చేసింది. ముఖ్యంగా రెండో సగంలో సందీప్ ఫోర్స్ చేసాడని అతనికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో సూపర్ చేసింది. ఆమె ఎక్స్ ప్రేషన్స్ , టైమింగ్ , నటనలో ఈజ్ చాల బాగున్నాయి. హీరో ఫ్రెండ్స్ స్నిగ్ద అండ్ గ్రూప్ ఆకట్టుకుంటారు. తులసి పాత్రలో కనిపించిన కుర్రాడు అమాయకపు రౌడీ వన్ సైడ్ లవర్ గా బాగా నవ్వించాడు. అతని ఎక్స్ ప్రేషన్స్ , కామెడీ టైమింగ్ చాలా బాగున్నాయి. పేస్ బుక్ గురించి, లేస్ గురించి అతని అభిప్రాయాలూ చిత్రంగా ఉంటాయి. తాగుబోతు రమేష్ బాగానే చేశాడు . యం యస్ కు  మంచి పాత్ర పడింది, తనకిచ్చిన కాసేపు టైములోనే  పొట్ట చెక్కలు చేస్తాడు. చంద్ర మోహన్, కవిత, రాళ్ళపల్లి, ఝాన్సీ తదితరులు వారి పాత్రాల కనుగుణంగా బాగా నటించారు.       
  దర్శకత్వం:






3/5
తెలుగులో రొమాంటిక్ కామెడీ సినిమాలు సమర్ధవంతంగా చేయగలిగే దర్శకులు అతి తక్కువమంది ఉన్నారు. కాని వారిలో సక్సెస్ అయినవాళ్ళ లిస్టు లో నందిని రెడ్డి మాత్రమే ఉన్నారు, కాని ఇప్పుడు ఆ కేటగిరికి ఫుల్ వెయిట్ ఇవ్వటానికి ప్రవీణ్ సత్తారు కూడా ఉన్నాడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రవీణ్ సినిమాను ఏంతో వినోదాత్మకంగా మలిచాడు .. అదీ మొదటి నుండి చివరి వరకు ఎక్కడ బిగి సడలకుండా..! దానికి కారణం సినిమాలో ఎం చెప్పాలనుకున్నాడో.. అనే విషయం ఫై ప్రవీణ్ కు ఉన్నా క్లారిటి . కధ , కధనాలు , పాత్రాలు రొటీన్ వే  అయినప్పటికీ అవి నడిచే విధానానికి వైవిధ్యాన్ని జోడించి విజయం సాదించాడు. సాంకేతికంగా మరికొంత విజ్ఞత పదార్శించాల్సి ఉంది. 
 రచన :









3.25/5
 కధ
           కధనం
మాటలు  
కధ  చాలా సింపుల్ గా ఉంది. కానీ ప్రేమ, రొమాన్స్ ఎవర్ గ్రీన్. కధ రొటీనే అయినప్పటికీ ప్రవీణ్ రానా మార్క్ ను ప్రదర్శించాడు.

2.75/5  
సినిమాలో ఉన్న మరో హైలైట్ స్క్రీన్ ప్లే. ప్రవీణ్ సత్తారు బలం కూడా ఇదే..! త్రు అవుట్ సినిమా ఎక్కడ మనకు బోర్ అనిపించదు, అంత పక్కగా ఉంటుంది.  కధనంలో వినోదానికే పెద్ద పీట వేసినప్పటికీ అన్ని రకాల ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. 
4/5 
 పంచ్ డైలాగులు , వీర ఉపన్యాసాలు ఏమి ఉండవు కాని .. సరదాగా సాగిపోయే కొన్ని చమక్కులు మాత్రం ఉంటాయి. మాటలు చాల వరకు రెగ్యులర్ గ పబ్లిక్ లో మాట్లాడుకునే ఫ్లో లోనే ఉంటాయి. 

3/5
సంగీతం 






2.75/5
 పాటలు 
      నేపధ్య సంగీతం 
    డాన్సులు 
 మిక్కి పాటలు పరవాలేదనిపిస్తాయి. ఒక్క 'ఎప్పటికైనా ..' పాట మాత్రమే గుర్తుంచుకునేట్టు ఉంది. మిగత పాటలు రొటీన్ గా ఉన్నాయి.
2.75/5 

 సినిమా మూడ్కు తగ్గట్టు బ్యాక్ స్కోర్ బాగానే ఉంది. ప్రత్యేకంగా 'ఎప్పటికైనా ' ట్యూన్ మినహా మిగతావి పెద్ద అటెన్షన్ క్యాచ్ చెయ్యవు.

2.75/5  

 పాటలు చాల వరకు కధనంలో భాగంగానే వస్తాయి . అన్ని పాటల చిత్రీకరణ బాగానే ఉంది. 

2.75/5
సాంకేతికం 









3/5
 కెమెరా
ఎడిటింగ్ 


 సురేష్ భార్గవ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా ఏమి లేదు కానీ రొటీన్ గా  బానే ఉంది. చిన్న బడ్జెట్ సినిమా కనుక మంచి అవుట్ పుట్ ఇచ్చినట్టే..!

3/5 

ఈ విభాగం బాగా పనిచేసింది.
ఎక్కడ లాగులు లేకుండా సీన్స్ ను కరక్ట్ గా ఎడిట్ చేశారు. కాకపోతే ఎఫెక్ట్స్ మరిన్ని వాడితే బాగుండేది. 
3/5




తులాభారం






4/5
           హెచ్చులు 
తగ్గులు 
  • సందీప్ , రెజినాల మద్య కెమిస్ట్రీ
  • ' ఎప్పటికైనా ...' పాట 
  • ప్రవీణ్ సత్తారు  స్టైల్ అఫ్ సూపర్ స్క్రీన్ ప్లే 
  • ఆరోగ్యకరమైన కామెడీ  

  • ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. ముఖ్యంగా కాలేజీ  స్టూడెంట్స్ ,' ఎ' సెంటర్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కావటం.   





                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :   3.25/5
          














































































































కొసమెరుపు:  
సినిమా బాగుంది కాని బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమా తో పోటి పడాల్సి రావటం కొంత ఆందోళన కలిగించే అంశం. డమరుకం మేనియలో ఉన్నా జనం ఆ  ప్రభావం తగ్గి శాంత పడేవరకు ఈ 'రొటీన్ లవ్ స్టొరీ ' దియేటర్లను అపుకోగాలిగితే మంచి విజయాన్ని నమోదు చేయటం ఖాయం.   





     

No comments:

Post a Comment