Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, November 4, 2012

పవన్ కు చేదయ్యిందే విష్ణుకు బెల్లం అయ్యింది..!


వెంటవెంటనే వరసగా రెండు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చి మహేష్ బాబుకు సవాలు విసురుదాం అనుకున్న పవన్ కళ్యాణ్ ఆశలకు గండి కొట్టింది 'కెమెరా మాన్ గంగతో రాంబాబు.  వివాదాస్పదం కాకుంటే విస్తుపోయే విధంగా రికార్డులు సృస్టించటానికి సిద్దం అయిన ఈ సినిమాను దురదృష్టం వెక్కిరించింది. విడుదల తోలిరోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వివాదాన్ని ధైర్యంగా ఎదుర్కోనలేక 12 సీన్లు కోత పెట్టించుకున్నాడు రాంబాబు. దాంతో సినిమా ఆడటానికి అవసరమైన కంటెంట్ అంతా చెత్తబుట్ట పాలై జనాలు చూడటానికి స్క్రాబ్ మిగిలింది. అందువల్ల వివాదం  మూలంగా వచ్చిన వీపరితమైన ప్రచారానికి అర్ధం లేకుండాపోయింది. అలా సూపర్ హిట్ అనిపించుకోవాల్సిన రాంబాబు యావరేజ్ తో... కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలు మిగుల్చుతూ సర్దుకోవలసివచ్చింది.

రాంబాబు వివాదం సమసిపోయింది అని అనుకునేలోపే దేనికైనా రెడీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ సినిమాది రాంబాబు గొడవంత పెద్దది కాకపోయినప్పటికీ మోహన్ బాబు , విష్ణు పంతానికి పోయి ఊహించనంత పెద్దది చేసి పెట్టారు. ఆ తరవాత జరిగిన పరిణామాలు సినిమాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో ఓ పక్క వివాదం నడుస్తున్నప్పటికీ దియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. రెండు వారాలు దియేటర్లు నిలుపుకోగలిగితే చాలు సినిమా హిట్ అంటున్న ఈ రోజుల్లో.. మూడో వారం కూడా మంచి వసూళ్ళు రాబడుతూ హిట్ నుండి సూపర్ హిట్ స్థాయికి పయనిస్తుంది దేనికైనా రెడీ..! 

ఆ విధంగా ఓ వివాదం పవన్ సినిమాను ముంచేస్తే... మరో వివాదం హిట్ కోసం పరితపిస్తున్న విష్ణుకు మర్చిపోలేని విజయాన్ని అందించింది. కొంత పంతానికి పోయినప్పటికీ సినిమా మీద నమ్మకంతో విష్ణు కుటుంబం ధైర్యం ప్రదర్సించటమే సినిమా విజయానికి దోహదపడింది  అని కొందరు అంటున్నారు. అలానే ఆటువంటి చొరవను పవన్ కళ్యాణ్ దర్శించకపోవటమే కాకుండా సినిమాతో తనకు సంబంధంలేదు అన్నట్టు స్థబ్దుగా ఉండటం కూడా సినిమా పరాజయం కావటానికి కారణం అయ్యింది అని కొన్నివిమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఈ రెండు వివాదాల అనుభవం దృష్ట్యా ఇక నుండి సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.      


No comments:

Post a Comment