![]() |
| Nagarjuna - Rana |
బావ బావే...! పేకాట పేకాటే..! అన్నా నానుడి ప్రకారం బంధుత్వాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగాడు సురేష్ బాబు. ఈ రోజు మధ్యానం నుండి సురేష్ బాబు , దర్శకుడు క్రిష్, కృష్ణం వందే జగద్గురుం సినిమా నిర్మాతలు పంపిణిదారులతో సాగించిన చర్చలు కాసేపటి క్రితమే ఓ కొలికి వచ్చాయి. వారందరూ సినిమాను నవంబర్ 9 నే విడుదల చెయ్యాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకు సంబందించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం వెలువడనుంది. ఈ రోజు ఉదయం వరకు సందిగ్దంలో ఉన్నఈ టీం సెన్సార్ తరవాత వచ్చిన ప్రశంశలు ఇచ్చిన ఉత్సాహమే వెనక్కి తగ్గక పోవటానికి కారణంగా తెలుస్తుంది.
దసరాకు రెండు సినిమాలు మాత్రమే విడుదలై సెలవుల్లో ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇప్పుడు అసలైన దీపావళి పండగా బాక్స్ ఆఫీస్ దగ్గర జరగనుంది. చాలా రోజులు తరవాత తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు తలపడటం కొంత ఆసక్తిని కలిగించే అంశమే..! ఈ సినిమాలకు వేటి ప్రత్యేకత వాటికుంది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ నే క్యారి చేస్తున్నాయి. కాకపోతే కృష్ణం వందే జగద్గురుంతో పోలిస్తే డమరుకం ఆడియన్సు కు రీచ్ అయిన అంశంలో ఓ అడుగు ముందుందని చెప్పాలి.
క్లాసు సినిమాల దర్శకుడుగా ముద్ర వేయించుకున్న క్రిష్ , ఇంతవరకు హిట్ లేని రానా సినిమా గురించి మాస్ లో కావలసినంత ఆసక్తిని నెలకొల్పలేకపోయారు. ఆ అంశం బి, సి సెంటర్ లలో సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించవచ్చు. ఆ తరవాత మాత్రం బాగున్నా సినిమాదే దీపావళి సింహాసనం. కానీ ఏ ఒక్కటో కాకుండా రెండు సినిమాలు బాగుంటే ఈ సెలవల్లో ప్రేక్షకులకు అంతకు మించిన ఆనందం మరోటుండదు.

No comments:
Post a Comment