సమసి పోయిందిలే అనుకుంటున్నా వివాదాన్ని ఓ పట్టాన వదిలిపెట్టటం విష్ణుకు ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకు ప్రతీక పైనా కనిపిస్తున్న ప్రకటన. వివాదానికి పరిష్కారం సులువైనదే అయిన పంతం మీద ఉన్నా మంచు ఫ్యామిలీ దానిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలనే ఉన్నట్టు ఈ ప్రకటనను బట్టి అర్ధం చేసుకోవచ్చు. వివాదం మొదలైనప్పటి నుండి విష్ణు ఏమైతే చెబుతున్నాడో.. అదే ఈ ప్రకటనలోను చెప్పాడు తప్పా కొత్తగా వేడుకున్నది ఏమి లేదు. అంటే విష్ణు ఈ సమస్యను ఉపయోగించుకుని సినిమాకు మరింత ప్రచారం దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. అదే కనుక వారి ఆలోచన అయితే ఇది విచారించ తగ్గ విషయం..!
అలానే ఆవేశంలో విష్ణు 'దేనికైనా రెడీ' సినిమా 14 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ మలయాళ చిత్రానికి రీమేక్ అని ప్రకటించటం చర్చనియ్యంశం అయ్యింది. రీమేక్ అన్నప్పుడు కధ పరంగా ప్రశంశలన్ని ఒరిజినల్ సినిమా కధ రచయతకు దక్కుతాయి. అలాంటప్పుడు ఈ సినిమాకు పనిచేసిన రచయతలు అనువాదకులు మాత్రమే అవుతారు.ఈ విషయంలో ఏ మాత్రం వాస్తవం ఉన్నాఈ సినిమాకు పనిచేసిన రచయతలను అవమానించి నట్టే అవుతుంది. అయినా మలయాళం లో తీసిన చిత్రాన్ని కొన్ని మార్పులతో మళ్లీ నిర్మించటానికి ఉద్దండులైన నలుగురు రచయతలు అవసరమా..? ఈ ప్రశ్నకు విష్ణు తడుముకోకుండా సమాధానం చెప్పాలి.
No comments:
Post a Comment