Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, November 3, 2012

దర్శకుడు క్రిష్ కు పొంచి ఉన్న ముప్పు


మనసు స్పందించే చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న క్రిష్  ఇప్పుడు ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పరిశ్రమలో పాతుకుపోవటానికి  'కృష్ణం వందే జగద్గురుం' తో పక్కగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు ప్రశంశాలేకాని పైసలు దక్కించుకోలేక పోయిన క్రిష్ ఈ  సినిమాతో ఒక కమర్షియల్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరోలా కలల దర్శకుడిగా మారిపోవాలని డ్రీమ్స్ వేసుకుంటున్నాడు. ఒక వైపు సొంత స్వప్న సౌధాలు నిర్మించుకుంటూనే  ఇది రానా కు స్టార్ గా లాంచ్ పాడ్ చిత్రం అని ప్రచారం చేస్తున్నాడు. 

దేవుడంటే సాయం, కళ అంటే నోద్రలేపేది వంటి డైలాగులు, మైనింగ్ మాఫియా ఆధారంగా రూపొందిన కధ వంటి విషయాలు కొంత ఆసక్తి కలిగిస్తున్నప్పటికి ఈ విషయాలను జనాలలోకి తీసుకెళ్ళటానికి అవసరమైన వినుత్నమైన ప్రచార లోపం కారణంగా ఈ సినిమా రిలీజ్ కు కావల్సినంత మైలేజ్ దక్కినట్టు కనిపించటంలేదు. ఈ పరిస్థితుల మధ్యే ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. రానా గత చిత్రాల వైఫల్యాలు , క్రిష్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోపోవటం కారణంగా ఈ సినిమా మీద వ్యాపార వర్గాలు కూడా పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించటం లేదు. ఎవరికీ ఆసక్తి ఉన్న లేక పోయిన రానా వెనుక ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ దన్నుతో సినిమా విడుదలకు ఎటువంటి డోకా ఉండదు. అంతవరకూ బానే ఉందికాని ఆ తరవాతే  సినిమా సక్సెస్ కు కనపడని అపాయంగా తమిళ డబ్బింగ్ తుపాకీ 'కృష్ణం వందే జగద్గురుం' మెడ మీద కత్తిలా వెళ్లాడుతుంది.

పోటిలకు,పంతాలకు పోకుండా వంతులు వారిగా సినిమాలు విడుదల చేసి జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రారంభ వసూళ్లతో సినిమాలను గట్టేక్కించుకుంటున్నారు ఇప్పటి అగ్రనిర్మాతలు.ఈ విషయంగా కెవిజె (KVJ) విషయంలో అంత  సవ్యంగా జరిగే సూచనలు ఉన్నప్పటికీ... తుపాకీ రూపంలో కొంత అవరోధం కనపడుతుంది.  ఎందుకంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ కు ఇక్కడ మార్కెట్ లేకపోయినప్పటికీ తుపాకీ సినిమాకు మురుగదాస్ దర్శకుడు అవటంతో కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. గజినీ ముందు వరకు సూర్యకు కూడా తెలుగులో పెద్ద పాపులారిటీ లేదు. కాని ఇప్పుడెంట్రా అంటే తెలుగులో కూడా ఓ మాదిరి స్టార్ హీరో అయి కూర్చున్నాడు. అదే ద్యాసలో ఉన్న విజయ్ కు ఈ సినిమా చాలా కీలకమైనది. మురుగదాస్ మ్యాజిక్ ఫలించి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం ఏంతో  కొంత  కెవిజె(KVJ) ఫై ఉంటుంది అన్నా విషయాన్నీ ఎంత కాదనుకున్న కొట్టిపారేయాలెం ..! 

ఇలా దేనికదే ప్రాముఖ్యతను సంపాయించుకున్నఈ రెండు సినిమాలు నవంబర్ 9న విడుదల అవుతున్నాయి. రెండు చిత్రాలు బాగుంటే తెలుగు ప్రేక్షకులకు ఈ దీపావళి డబుల్ దమక అవుతుంది. అలా కాకుండా తుపాకీ పరాజయం పాలైతే పెద్దగా పట్టించుకోరు... కాని కృష్ణం వందే జగద్గురుం కనుక అటు ఎటు అయ్యిందో.. ఆశాభంగం తప్పదు . 

            

No comments:

Post a Comment