డమరుకం మరోసారి ఝలక్ ఇచ్చింది. ఏంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఈ రోజు దియేటర్ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఇక నాగార్జున అభిమానులు, సినిమాను పంపిణి చేస్తున్నా పంపిణిదారులైతే పరిస్థితి అర్ధంకాక అసహనంతో రగిలిపోతున్నారు.
నిన్న అన్ని చానల్స్ లోను , చివరికి ఈ రోజు అన్ని పేపర్లలోను ఈ రోజు విడుదల గురించి ప్రచారం జరిగింది కాని తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన నిర్మాణ సంస్థ సినిమాను బయటకు తీసుకురాలేకపోయింది. ఈ ఉదయానికి తేలిందేమంటే... ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఇప్పుడు సినిమాను విడుదల చేసే పొజిషన్లో లేదని..! మరి ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దాని ఫై ఈ రోజు సాయంత్రానికి స్పష్టత రావచ్చని సమాచారం.
అదలా ఉంటే... ఆర్ ఆర్ మూవీ మేకర్స్ జటిలమైన సమస్యలతో వెనక్కి తిరిగిరాలేని పద్మవ్యూహంలో చుక్కుకుందని తెలుస్తుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుణ్ణి కౌరవ సేనలు చుట్టుముట్టినట్టు ఆర్ధిక పరమైన కష్టాలు ఆ సంస్థను ముంచెత్తుతున్నాయి. పద్మవ్యూహంలో చిక్కుకున్నా అభిమన్యుణ్ణి రక్షించుకోలేక చేష్టలుడిగి చూసే అర్జునుడి కాక మిగత పాండవ వీరుల పరిస్థితే... నాగార్జున సహా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ శ్రేయోభిలాషుల పరిస్థితి. అవును మరి అంత పెద్ద హీరో నాగార్జుననే ఏమి చేయలేక చేతులెత్తేస్తే ఎవరు మాత్రం ఏమి చేయగలరు...? కాని పద్మవ్యుహాన్ని చేదించగలిగింది ఒక్క అర్జునుడు మాత్రమే.... ఇక మరి ఈ డమరుకాన్ని గట్టెక్కించగలిగిన అర్జునుడులాంటి పరిష్కారం ఏ రూపంలో వస్తుంది..అన్నదే ఇప్పుడు కీలకం..!
40 కోట్ల భారి బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రానికి సంబంధించి 27 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగకపోవటమే...సినిమా విడుదలలో జాప్యానికి కారణంగా వినపడుతుంది. కాని ఈ విషయానికి సంబందించి అంతర్గతంగా ఏమి జరుగుతుంది అన్నదాని మీద మరింత క్లారిటి రావాల్సిఉంది. ఇదిలా ఉంటే సర్వత్ర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డమరుకం ఈ సమస్యల నుండి త్వరగా బయటపడి దియేటర్ లకు రావాలని కోరుకుంటున్నారు సినీ ప్రియులు.

No comments:
Post a Comment