Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, November 8, 2012

చెవిలో తుపాకీ పెడుతున్న నిర్మాత..!



చెప్పే మాటలకూ చేసే పనికి పొంతన లేక పొతే చెవిలో పూలు పెట్టొద్దు అని సున్నితంగా చెబుతాం.. కాని చేసే పనికి చెబుతున్న విషయానికి మద్య ఊహించలేనంత వ్యత్యాసం ఉంటే  చెవిలో తుపాకీ పెట్టటమే అవుతుంది. ఆ పనే డబ్బింగ్ సినిమాల స్టార్ నిర్మాత అని అనిపించుకోవాలని ఉబలాట పడుతున్నారు  శ్రీమతి శోభరాణి.


ఇప్పటివరకు నాలుగైదు చిత్రాలను డబ్బింగ్ చేసినా... ఈమెకు ఒక్క సినిమా కూడా పైసలు మిగిల్చిన దాఖలాలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడి చెల్లెలిలా నిర్విరామంగా డబ్బింగ్ సినిమాలు చేసుకుంటూ పోతున్నా శోభ సంచలనాల కోసం తాపత్రేయ పడుతుంది. అందుకోసం నమ్మటానికి మనసొప్పని విషయాలను ప్రచారంలోకి తెస్తుంది. 

వెంటపడి మరి ప్లాప్ అయ్యే చిత్రాలను ఎంచుకునే శోభమ్మ ఈ మద్య బిల్లా 2 చిత్రంతో బాగానే చేతులు కాల్చుకుంది. ఆ పరాజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు తుపాకీ సినిమాతో విజయ్ భవితవ్యాన్ని తెలుగులో నిర్దేశించేందుకు సిద్దం అయ్యింది. విజయ్ హీరో , మురుగదాస్ దర్శకుడు, హారిస్ మ్యూజిక్ ఇలా సినిమాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నపటికీ నిర్మాత శోభ అని తెలిసి ఈ సినిమా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవటంలేదు. దాంతో అందరి దృష్టిని ఆకర్షించి సినిమాకు ప్రచారం తీసుకురావటం కోసం నమ్మలేని నిజంతో జనాల ముందుకు వచ్చింది. అదేమంటే... '15 కోట్ల రూపాయలు వెచ్చించి శోభ రాణి  తుపాకీ తెలుగు అనువాద హక్కులను దక్కించుకుంది' అని తెలిసిన వాళ్లతో ప్రచారం చేయించుకుంటుంది. 

ఎంత మురుగదాస్ సపోర్ట్ ఉన్నపటికీ తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఇంకా అపరిచితుడే..! ఇప్పటివరకు అయన సినిమాలు తెలుగులో లాభాలు కాదు కదా కనీసం బ్రేక్ ఈవెన్ తెచ్చినట్టు కూడా రికార్డుల్లో లేదు. అలాంటి సుడోస్టార్ (తెలుగు వరకు) మీద 15 కోట్లు పెట్టారంటే... నమ్మలంటారా...? 

       

No comments:

Post a Comment