![]() |
| Aarundhati - Rudhrama Devi |
పైన కనిపిస్తున్నా రెండు పిక్చర్స్ లో మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా ..? నాకైతే పేరు తప్పించి పెద్ద తేడా ఏమి కనిపించటం లేదు. రెండు ఫోటోలలో ఉన్నది ఒకటే స్టిల్ కాకపోతే సినిమాలే వేరు..! ఎడమ చేతి పక్కనుంది 2009 లో వచ్చిన ఆరుంధతి సినిమాలోనిది, మరి కుడి పక్కనుందేమో... రేపు తీయ్యబోయే రుద్రమ దేవి చిత్రానికి సంబందించింది.
అంటే అరుంధతిలానే రుద్రమ దేవి కూడా ఉంటుందా...? ఆ వీరనారికి ఓ ప్రత్యేక ఆహార్యం అంటూ లేదా...? ఆ తేడాని ఎవరు గుర్తించకపోయినా దర్శకుడు గుణశేఖర్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేపు ఆరుంధతినే మళ్లీ తీసి రుద్రమదేవి ఇదే అంటే కుదరదు కాదా..!
అంటే అరుంధతిలానే రుద్రమ దేవి కూడా ఉంటుందా...? ఆ వీరనారికి ఓ ప్రత్యేక ఆహార్యం అంటూ లేదా...? ఆ తేడాని ఎవరు గుర్తించకపోయినా దర్శకుడు గుణశేఖర్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేపు ఆరుంధతినే మళ్లీ తీసి రుద్రమదేవి ఇదే అంటే కుదరదు కాదా..!
ఎన్నో యేళ్ళగా కాకతీయ రాణి మీద పరిశోధన చేస్తున్నా అని చెప్పుకుంటున్న గుణశేఖర్ ఏంతో ప్రతిస్థాత్మకంగా నిర్మించదలచుకున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కోసం ఒక చిన్న ఫోటో సెషన్ కూడా నిర్వహించలేక వేరే సినిమాలోని స్టిల్ ను ఉపయోగించుకోవటం ప్రాజెక్ట్ మీద అతనికున్న ఆసక్తిని తెలియచేస్తుంది. ఇంటర్నెట్ విస్తృతి, 'ఆరుంధతి' జనాలను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసి కూడా ఆ సినిమాలోని స్టిల్ ని వాడుకోవటం సినిమా ప్రియులను చీట్ చేయటం కిందకే వస్తుంది. ప్రేక్షకులను తక్కువ అంచనా వేస్తూ గుణశేఖర్ సృష్టించిన ఈ ఫేక్ పోస్టర్స్ వల్ల సినిమాకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
వరస ప్లాపులతో ఫామ్ కోల్పోయిన గుణశేఖర్ ను టాలీవుడ్ టాప్ హీరోలు దాదాపుగా మర్చిపోయారు. దాంతో మృగరాజు అవతారం ఎత్తిన ఈ ఒక్కడు 'రుద్రమ దేవి' తో నిప్పు రాజేసి తనలోని అసలైనసిసలైన సినిమా 'సైనికుడి'ని ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నాల్లో పడ్డాడు. భారి ఎత్తునా జరుగుతున్నా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావటానికి మరికొంతకాలం పడుతుందని సెలవిచ్చిన ఈ క్రేజీ డైరెక్టర్ ఒక ప్లానింగు పాడు లేకుండా రేపు అనుష్క పుట్టిన రోజు అనే సందర్భాన్ని ఉపయోగించుకోవాలనే హడావిడిలో ఈ తప్పుకు తలొగ్గినట్టు అర్ధం అవుతుంది. నిజంగా అనుష్కకు అంత సీన్ ఉందా..? ఉంటే ఆరుంధతి తరవాత పంచాక్షరి ఎందుకు ఆడలేదు..? అయినా సినిమా ఫంక్షన్ లకు హాజరుకాకుండా, సినిమా ప్రచారానికీ ప్రాధాన్యం ఇవ్వని అనుష్కకు ఇంత బిల్డుప్ ఇవ్వటం అవసరమా...? ఆలోచించుకోవాలి.

No comments:
Post a Comment