తోలి చూపులోనే ప్రేమ గురించి .... విని ఉంటాం... చూసి ఉంటాం..! 'దళం' ట్రైలర్ చూసిన తరవాత సినిమాలను ప్రేమించేవాడికి ఎవడికైనా అదే ఫెల్లింగ్ కలుగుతుంది ఇది నిజం. పేరు విని మాములు సినిమా ఏమో అనుకున్న వాళ్ళు కూడా ట్రైలర్ చూసి షాక్ అవుతారు. ఎక్కువ చెబుతున్నాను... అనిపిస్తే కింద ఉన్నా ట్రైలర్ చూడండి మీకే అర్ధం అవుతుంది.
దళం అని పేరు విని అందరు ఊహించుకునెట్టే ఇది... అన్నాల సినిమానే. ఓ మాజీ నక్సలైట్ల దళం జనజీవ స్రవంతిలో చేసే జీవన పోరాటంలా కనిపిస్తుంది. అలానే అందులోనే ఓ అందమైన ప్రేమ కధను చొప్పించినట్టు అర్ధంఅవుతుంది. అందాల రాక్షసి ఫేం నవీన్, రంగం ఫేం పియ బాజ్ పయ్, కిశోర్ , అభిమన్యు సింగ్ లతో సినిమాకు కట్టిన తార తోరణం ముచ్చటగానే ఉంది.
వీటిని పక్కన పెట్టి సినిమాలోని సాంకేతికత విషయానికి వస్తే అందులో ఉన్నఅసలు మ్యాజిక్ తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో విజిల్ తో చేసే హమ్మింగ్ ఊహించని విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ తరవాత మొదలయ్యే డ్రమ్స్ బీట్ తో సినిమాలోని సీరియస్ నెస్ ను జేమ్స్ వసంతన్ ఎంతో అందంగా తెలియజేశాడు. లొకేషన్స్ , కధ వస్తువును తెలియచేసేలా ఉన్న వాతావరణం, వాటిని ఏంతో వైవిద్యంగా కెమెరా లో బందించిన సుధాకర్ ఎక్కంటి పనితనం, మధు చక్కటి కూర్పు వీటన్నిటిని అద్భుతంగా ఉపయోగించుకున్న నూతన దర్శకుడు జీవన్ రెడ్డి ప్రతిభ సినిమా మీద బోల్డన్ని ప్రోమిస్లు నెలకొల్పుతుంది. మరి ఆ ప్రామిస్లను ఈ దళం నిలుపుకుంటుందో... నీరుగారుస్తుందో... వేచి చూడాలి.

No comments:
Post a Comment