విడుదల విషయంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ ... ఊహాతీతమైన ఆసక్తిని సర్వత్ర రేకెత్తిస్తూ ఈ వారం విడుదల అయ్యింది డమరుకం. ఆడంబరంగా మొదలై.. అణుకువగా పూర్తై ... ఆర్భాటంగా విడుదలకు సిద్దం అయిన డమరుకం అనూహ్యంగా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆ ఫై సినిమాలో ఉన్నా విశేషాల కంటే విడుదలలో తలెత్తిన వివాదాలే బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకున్నాయి.
26 సంవత్సరాల సినీ జీవితంలో ఎప్పుడు చూడని అనుభవాన్ని రుచి చూసిన నాగ్ ఈ సినిమా మీద కొండంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆర్ధిక పరమైన సమస్యలే కాని సినిమా గురించి అంతటా పాజిటివ్ టాకే వ్యాపించి ఉంది. సమస్యలు తీరిపోవటంతో సినిమాలో ఉన్నఅసలు సంగతి గురించి తెలుసుకోవాలని ఇప్పుడు కుతూహలం చూపిస్తున్నారు తెలుగు సినీ ప్రియులు. ఈ విషయానికి ఋజువు గా డమరుకం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండమైన ప్రారంభాన్ని మొదలు పెట్టింది.
కష్టాలా కడలిని దాటి ఈ డమరుకం మొదలు పెట్టిన చిరు సడి త్వరలోనే భీకరనాదంగా మారి కలక్షన్ల ప్రళయం సృస్టిస్తేనే..... ఈ సినిమా రూపకర్తలకు మనఃశాంతి. మరీ ఇలాంటి అంచనాలను, ఆశలను అందుకునే సూచనలు ఈ సినిమాలో ఏ మేర ఉన్నాయో... మన సమీక్షలో చూద్దాం .
కధ:
పూర్వం దేవదానవుల మద్య జరిగిన అన్ని యుద్దాలలో రాక్షసులు మరణిస్తూరావటంతో అ జాతి దాదాపు అంతమైపోయింది. ఆసమయంలో అందకసురుడ(రవి శంకర్)నే రాక్షసుడు రాక్షస జాతికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఓ కొండ గృహలో దాక్కుని ఉంటాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచి ఇప్పటి కాలం వస్తుంది. ఓ పంచ గ్రహ కూటమి నాడు పార్వతి దేవి అంశతో మహేశ్వరీ(అనుష్క) జన్మిస్తుంది. ఆమెను గొప్ప జాతకురాలిగా పండితులు వర్ణిస్తారు.
ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నా అందకసురుడు నిద్ర మేల్కొని తన ఆన నెరవేర్చే ప్రయత్నాలు మొదలుపెడతాడు. మహేశ్వరీ జాతకం ప్రకారం ఆమెను యుక్త వయసు వచ్చిన తరవాత వివాహమాడి పంచభూత నక్షత్రానికి బలి ఇస్తే... పంచభూతాలు అందకాసురుడి వశం అయ్యి 14 భువనాలను శాసించే శక్తి వస్తుంది. చిన్న పిల్లగా ఉన్న మహేశ్వరీ ఎదిగి ప్రౌడ అయ్యే లోపు తన ప్రయత్నాన్ని ఆపే అడ్డంకులను తొలగించడం మొదలుపెడతాడు. అందులో భాగంగా మహేశ్వరి కోసం పుట్టిన శివ భక్తుడు మల్లికార్జున(నాగార్జున) ను అంతం చేసే ప్రయత్నంలో మల్లి, అతని చెల్లి మినహా కుటుంబం మొత్తం మరణిస్తారు.
మల్లి చనిపోయాడని తలచిన అంధకాసురుడు దేవుడు నుండి తనకు ఇబ్బంది రాకుడదని పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి మహేశ్వరిని తానూ వివాహమాడే ప్రయత్నంలో తనకు అడ్డురావద్దని ప్రమాణం తీసుకుంటాడు. కాని పరమేశ్వరుడు మల్లికి తన సహాయ సహకారాలు అందిస్తూ మహేశ్వరిని కాపాడేందుకు సమాయత్తం చేస్తాడు. ఆ ఫై నరుడికి అసురుడికి మద్య జరిగిన పోరాటంలో ఆ పరమేశ్వరుని కటాక్షంతో మల్లి అందకాసురుణ్ణి ఏ విధంగా మట్టు బెట్టాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
నాగార్జున డమరుకం తో చేసే నాదం భీకరంగా ఉంటుంది అని ఊహించిన అందరి ఆశల మీద నీళ్ళు చల్లాడు. గొప్పగా ఉందని చెప్పలేం కాని... బాగాలేదు అని చెప్పకుండా పర్వాలేదు అని చెప్పటం కూడా కొంత ఎక్కువే ఈ సినిమాకు. అలానే గ్రాఫిక్స్ పరంగా 'ఆరుంధతి , ఈగ చిత్రాలను మించి ఉంటుంది...', భారత దేశంలోనే ఇటువంటి గ్రాఫిక్స్ మొదటి సారి వాడుతున్నాం ', వంటి కామెంట్స్ ను ఈ సినిమా చూసిన తరవాత నిర్ద్వందంగా తోసిపుచ్చవచ్చు . నిజంగా చేయాలి అనుకుంటే ఆరుంధతి , ఈగ సినిమాలకు లేని ఎన్నో అవకాశాలు ఈ సినిమాకు ఉన్నాయి. ఎలా అంటే కధ ప్రకారం రాక్షసుడు, దేవుడు నేపద్యం కాబట్టి మాయలకు, మంత్రాలకు లోటే ఉండదు. కాని డమరుకం రచయతల ఊహల పరిది అద్భుతాల జోలికి వెళ్ళకుండా మన పాత జానపద చిత్రాలను మాత్రమే తాకగలిగింది. అంటే ఇక్కడ చెప్పేదేమంటే ఈ సినిమాలో విశేషాలు , అద్భుతాలు అనుకునేవి మనని త్రిల్ చేయలేవు. ఎందుకంటే అవి ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా ఊహించ గలిగే స్థాయిలోనే ఉండటం...!
డమరుకం చాలా ఆసక్తిగా మొదలవుతుంది. రాక్షసుల కధ , అందకాసురుడి పరిచయం సహా హీరో, హీరోయిన్ ల పరిచయ సన్నివేశాల వరకు ఓ అరగంట పాటు సినిమా రేసిగా సాగి కధతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. కాని ఆ తరవాత నుండే మన ఆశలకు భంగం కలగటం మొదలవుతుంది. అవసరం లేక పోయిన కామెడీ కోసం దర్శకరచయతలు చేసిన ప్రయత్నం సినిమా మీద అప్పటి వరకు ఏర్పరుచుకున్న అంచనాలను కొల్లగోట్టటం మొదలుపెడుతుంది. అలా ఒకదానికి మించిన ఒకటిగా పేలవమైన సన్నివేశాలు మన మీద పడి సినిమా మీద ఉన్న అంచనాలకు ప్రస్నార్ధాకాలు అవుతాయి.
మొదటి అరగంట తరవాత ఇంటర్వెల్ ముందు వరకు సక్కు భాయి , కన్యాకుమారి పాటలే కొంత ఊరటనిచ్చే అంశాలు. ఇంటర్వెల్ ముందు కధ రస పట్టులోకి వెళ్లి నట్టే ఉంటుంది కాని సరైన సన్నివేశాలు లేక ఆకట్టుకోలేక పోయింది. ఇక రెండో సగం విషయానికి వస్తే అప్పటివరకు పర్వాలేదు అని సర్దుకు పోతూ వచ్చిన మనకి అవే పేలవమైన సన్నివేశాలు వరస కడుతూ ఆహానాన్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈ పరంపర క్లైమాక్స్ వరకు కోవసాగుతుంది. క్లామక్స్ బాగానే ఉన్నప్పటికీ అప్పటికే సినిమా మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం కాబట్టి పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తుంది.
రేటింగ్ :
విభాగాలు
|
రేటింగ్
|
|||||||||
అభినయం:
|
2.5/5
| |||||||||
| సినిమాలోని ప్రతి పాత్రను చాలా ఆసక్తితో పరిచయం చేశారు. కాని ఆ ఫై ఆ పాత్రల ప్రవర్తన, నడత ఓ క్రమ పద్దతిలో లేక పోవటంతో అవి గుర్తుంచుకోతగ్గ పాత్రలు కాలేకపోయాయి. నాగార్జున ఎప్పటిలానే నటించాడు. ఆయన నటనలో కాని పాత్రలో కాని ప్రత్యేకత అంటూ ఏమి లేదు. చాలా వరకు 'రగడ' సినిమాలోని పాత్రను కోనసాగించినట్టు అనిపిస్తుంది. ఉన్నా వరకు బానే చేశాడు కాని ఆ పాత్రను హైలైట్ చేసే సన్నివేశాలే కరువయ్యాయి. అనుష్క ది రొటీన్ పాత్ర. కధ వరకు ఆ పాత్ర చాల కీలకమైంది కాని కధనంలో ఆ పాత్రను పొదుపుగా వాడుకుని అనుష్కకు నటించే శ్రమను తగ్గించారు. వాయిస్ తోనే దియేటర్ లోని జనాలను బెదరగొట్టే రవిశంకర్ అసురుడిగా పరవాలేదనిపించాడు. పరమేశ్వరుడి గా ప్రకాష్ రాజ్ కొత్తగా కనిపించాడు. పరిస్థితికి తగ్గట్టు కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. ఈ మద్య రొటీన్ పాత్రలతో కనిపిస్తున్న ప్రకాష్ రాజ్ ఫ్రెష్ గా కనిపించాడు . గణేష్ వెంకట్రామన్ బాగా పాత్రకు తగ్గటు బాగా చేశాడు. బ్రహ్మానందం , రఘు బాబు,కృష్ణ భగవాన్, యం యస్ రొటీన్ పాత్రలతో మూసా నవ్వులు పూయించారు. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా బాగానే నటించారు. | ||||||||||
దర్శకత్వం:
|
2.5/5
|
|||||||||
| దర్శకుడిగా శ్రీనివాస రెడ్డి డమరుకంతో ఓ మెట్టు ఎదిగినట్టే. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న సినిమాలు , చిన్న హీరోలతో నెట్టుకొచ్చిన రెడ్డి ఒకేసారి స్టార్ తో అదీ ఊహించని బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడంటే అందరు అనుమానంగా చూశారు. మొత్తంగా కాదు కాని చాల వరకు పెద్ద సినిమాను హేండిల్ చేసే దర్శకుడిగా సఫలం అయ్యాడు. ముఖ్యంగా సంగీతం , గ్రాఫిక్స్ సహా అన్ని సాంకేతిక విభాగాలనుండి క్వాలిటీ అవుట్ పుట్ ను రాబట్టుకోవటంలో మంచి పని తనాన్ని చూపించాడు. కాని కధనం విషయంగా మరింత క్రియేటివ్ గా కృషి చేసి ఉంటే బాగుండేది. అలానే చిత్రీకరణ పరంగా ఇంటర్వెల్ బాంగ్ , నంది చేజ్ వంటి సన్నివేశాలలో అవకాశం ఉన్నప్పటికీ వాటిని సమర్ధవంతంగా డీల్ చేయలేకపోయాడు. | ||||||||||
రచన :
|
2.5/5 |
|||||||||
కధ
|
కధనం
|
మాటలు
|
||||||||
| కధ రొటీనే అయినప్పటికీ అద్భుతాలు సృస్టించటానికి స్కోప్ ఉన్నది. విఠలాచార్య గారి సినిమా రకం... సో వాడుకున్నోడికి వాడుకున్నంత..! అందుకని.... 2.5/5 |
కధ అనుకోవటం వరుకే చూసేది కధనాన్నే ..! దర్శకుడు సహా ఓ డజను మంది వరకు ఈ సినిమా కధనాన్ని వండటంలో తలో చెయ్యి వేశారు. కాని వాళ్ళందరూ ఆ సినిమాలో ఇలా ఉంది, ఈ సినిమాలో అలా ఉంది అంటూ ఎరుకొచ్చిన సన్నివేశాలతో కూర్చినట్టు ఉన్నారు కాని కొత్తగా ఎదో సృష్టించినట్టు అనిపించలేదు. అందుకని... 2/5
|
మాటల భాద్యతను కూడా భుజాన వేసుకున్న దర్శకుడు తన పూర్వ సినీ పరిజ్ఞానం తోనూ , మునుపటి తెలుగు సినిమాలా ప్రేరణ తోనూ మూస మాటలను వండి వడ్డించాడు. కొత్తదనం లేదనే కాని ఎబ్బెట్టు లేకుండా సన్నివేశాలకు తగ్గట్టు బాగానే వ్రాశాడు. అందుకని 2.75/5
|
||||||||
సంగీతం
|
3.5/5
|
|||||||||
పాటలు
|
నేపధ్య సంగీతం
|
డాన్సులు
|
||||||||
సినిమా కే హైలైట్ అయిన విభాగం ఈ ఇయర్ మంచి ఫాం లో ఉన్న దేవి తన లవబుల్ ట్యూన్స్ తో సూపర్ ఆల్బమ్ ఇచ్చాడు. అందుకని 4/5
|
బ్యాక్ స్కోర్ కూడా అదే రేంజ్ లో అదరగొట్టాడు. అసలు ఇంకా సరైన సీన్స్ పడలేదు కాని... అవే ఉండుంటే జాతర వేరగా ఉండేది. కాని ఏమి చేస్తాం .. ఉన్నవాటి వరకు 3.5/5
|
దాదాపు అన్ని పాటలను బాగా తీసారు, ఒక్క రెప్పల ఫై .. పాట మినహా. సక్కుబాయి , కన్యాకుమారి, శివ శివ శంకర హైలైట్స్. లాలి లాలీ పాత సినిమాలో లేక పోవటం నిరాశపరిచింది. రాజు సుందరం, దినేష్, స్వర్ణ తదితర మాస్టర్ల పనితనానికి 3/5
|
||||||||
సాంకేతికం
|
3.25/5
|
|||||||||
కెమెరా
|
ఎడిటింగ్
|
ఆర్ట్
|
గ్రాఫిక్స్
|
ఫైట్స్
|
||||||
చాలా సన్నివేశాలలో చోటా కెమెరా పనితనం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకు ఫోటోగ్రఫీ తోనే బోలెడంత అందాన్ని తీసుకుచ్చాడు.
అందుకని 3.5/5
|
గౌతంరాజు గారి పని ప్రత్యేకంగాఅనిపించదు.
సినిమా మూడ్ కు తగ్గట్టు బాగానే ఉంది అని చెప్పవచ్చు.
అందుకని 2.75/5
|
'ఒక్కడు' అశోక్ ఆర్ట్ వర్క్ పెద్ద గొప్పగా అనిపించదు.గ్రాఫిక్స్ ప్రాదాన్యత దృష్ట్యా మాంత్రికుడి గుహ సెట్ , కాలనీ సెట్ మాత్రమే వేశారు. కాలనీ లో గుడి సెటప్ బాగుంది.
అందుకని 2.75/5
|
కంటెంట్ ఎంత బలంగాఉంటే అంత కదం తొక్కే విభాగం ఇది. ఈ సినిమాకు ఉన్న స్కోప్ ప్రకారం ఫైర్ ఫ్లై పండగా చేసింది. ముఖ్యంగా భారి బ్లాక్ చీత ను, 'నంది'ని, క్లైమాక్స్ లో 14 అడుగుల మృగ రాక్షసుడిని భలే రూపొందించారు.
అందుకని... 4/5
|
విజయ్ మాస్టర్ పోరాటాలు , చేజ్ లు అవసరానికి తగ్గట్టు బాగానే ఉన్నాయి.
సో... 3/5
|
||||||
తులాభారం
|
2/5
|
|||||||||
హెచ్చులు
|
తగ్గులు
| |||||||||
|
|
|||||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 2.75/ 5
|
||||||||||
కొసమెరుపు:
మొత్తంగా సినిమా గురించి చెప్పేదేమంటే మొదటి అరగంట , చివరి 20 నిముషాలు పరవాలేదనిపిస్తాయి కాని మధ్యలోని 1గం 30 నిమిషాలను భరించటమే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. పైగా ఆ సమయంలో కాలక్షేపానికి అవసరమైన కామెడీ , రొమాన్స్ వంటి అంశాలు కాకుండా పుచ్చిపోయిన సెంటిమెంట్ , పాచి పోయిన ఎమోషన్స్ మన ఎంటర్టైన్మెంట్ సెన్స్ ను ప్రశ్నిస్తాయి. ఈ పరిణామాల మద్య సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉండబోతుందో ఊహించగలిగిందే అయిన ఓ వారం ఆగితే స్పష్టత వస్తుంది.

No comments:
Post a Comment