Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, November 7, 2012

పిచ్ అదిరిందంటున్నా... చెర్రి

Ram Charan as Nayak
  
చూడాలని ఉంది సినిమాలో ఫస్ట్ ఫైట్ మొదలు పెట్టే ముందు మెగాస్టార్ చేజ్ తరవాత బండి మీద కుర్చుని కాలితో నెల మీద కొడుతూ 'పిచ్ అదిరింది....!' అంటాడు గుర్తుందా...! రేపు సంక్రాంతి పండక్కి నాయక్ తో బరిలోకి దిగుతున్నా చెర్రి కూడా ఇప్పుడు అదే అంటున్నాడు.

సోలో రిలీజ్ తో సంక్రాంతి సెలవుల కలక్షన్లను దున్నుకోవటానికి సిద్దమైన చెర్రి పిచ్ అదిరిందనే... అంటాడు. రచ్చ హిట్ తో కాకమీదున్నా రామ్ చరణ్, బద్రినాద్ పరాజయంతో కసిమీదున్నా వి వి వినాయక్ కలయికలో వస్తున్నా ఈసినిమా మీద అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంతే కాకుండా వ్యాపారపరంగా కూడా కొత్త రికార్డ్ మొత్తాలకు అమ్ముడు పోతూ సంచలనం సృష్టిస్తుంది. ఈ సంచలనాలు ఆ సీజన్ లో రావాలనుకుంటున్న మిగత సినిమా నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటా అని నాయక్ కు సలాం కొట్టి సైడ్ అయిపోతున్నాయి. 

తాజాగా అలా సైడ్ అయిపోతున్న చిత్రాల రేస్ లో 'షాడో' చేరింది. ఎప్పటినుండో.... సంక్రాంతికి విడుదల అంటూ ఊదరగొట్టిన ఆ సినిమా రూపకర్తలు వెంకటేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకు ఫేవర్ చేయటం కోసం  అనే  సాకుని  ఉపయోగించుకుని సంక్రాంతి  పోటి  నుండి  వైదొలిగారు. 'మిర్చి' ఘాటు  చూపిస్తాడనుకున్నా ప్రభాస్ కూడా  డేట్  మార్చుకుని ముందుకు వెళ్లి పోయాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందే విడదల అవుతున్నా అప్పటికి మూడు వారాలు అయిపోతుంది కాబట్టి పోటిగా పరిగణించలేం. 

దాంతో హాట్ సీజన్ ను హోల్ అండ్ సోలోగా చెర్రీ కైవసం చేసుకోవచ్చు. కాకపోతే అంత పెద్ద పండగను ఒక సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి రావటం సిని ప్రియులను నిరశాపరిచేదే..! తెలుగు వాళ్ళు సంక్రాంతికి కోడిపందేల ఫై ఎంత ఆసక్తి చూపిస్తారో... సినిమాల మద్య పోటీని కూడా అంతే బాగా ఆస్వాదిస్తారు. ఆ ప్రకారం ఆలోచిస్తే.. వచ్చే పండుగ మెగా అభిమానులకే ప్రత్యేకం కానుంది..!       

No comments:

Post a Comment