Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, November 4, 2012

మామతో పోటి వద్దంటున్నా అల్లుడు


ఇండియా లో జరిగే పండగల వల్ల ఉపయోగం... ఒక పండక్కి సేల్ కాని స్టాక్ మరో పండక్కి పోద్ది...! అలానే  దసరా స్పెషల్ గా సందడి చేస్తుందనుకున్నా డమరుకం ఇప్పుడు దీపావళి ధమాకాగా రానుంది.  అద్భుతం చేసైనా సరే దసరాకు సినిమాను విడుదల చెయ్యాలనుకున్న నిర్మాతల సంకల్పానికి ఆర్ధిక ఇబ్బందులు గండికొట్టి నాగార్జునకు మునుపెన్నడూ ఎరుగని అవమానాన్ని మూటగట్టాయి. పరిస్థితులు చేయిదాటినా తనకున్న పలుకుబడితో వాటిని అదుపులోకి తెచ్చి నష్టం మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడింది నిర్మాణ సంస్థ ఆర్  ఆర్  మూవీ మేకర్స్. దాంతో డమరుకం ఉత్సాహంగా నవంబర్ 9 న విడుదల అవటానికి సిద్దం అయ్యింది.

ఈ పరిణామం ఇప్పుడు కొన్ని సినిమాల విడుదలకు అవరోధంగా మారింది అని తెలుస్తుంది. డమరుకం విడుదల గురించి  స్పష్టత లేకపోవటంతో కృష్ణం వందే జగద్గురుం నవంబర్ 9 న విడుదలకు ఏర్పాట్లు చేసుకుని అందుకు తగ్గట్టు ప్రచారం కూడా మొదలు పెట్టింది. కాని హఠత్తుగా సైడ్ ట్రాక్ లో ఉందనుకున్నా డమరుకం మెయిన్ ట్రాక్ లోకి రావటంతో సందిగ్దంలో పడింది కృష్ణం వందే జగద్గురుం టీం. దియేటర్ల గేమ్ లో భాగంగా ఎక్కువ హాళ్ళలో ప్రదర్సించటానికి సోలో రీలీజ్ ను ఆశిస్తున్నా రానా, దర్శకుడు క్రిష్ వెనక్కి తగ్గి నాగార్జునకు దారి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కొద్దిగా టైం తీసుకుని డమరుకం ఫలితాన్ని బట్టి దీపావళి రోజు కాని ఆ తరవాత వచ్చే శుక్రవారం కాని విడుదల చెయ్యాలి అనే మంతనాలు అంతర్గతంగా జరుగుతున్నట్టు బోగట్టా..! ఈ  విషయంలో స్పష్టత సోమవారం తెలియవచ్చు.  

డమరుకం విడుదలలో జప్యమేకాని సర్వత్ర సినిమా మీద సానుకులా అంచనాలే ఉన్నాయి. పరిశ్రమతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఈ పాజిటివ్ సంకేతాలే సినిమా విడుదల మరింత ఆలస్యం కాకుండా కాపాడాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇక ఈ దీపావళిని 'డమరుకం'తో సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్దంగా ఉండండి.    

    

No comments:

Post a Comment