Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, November 1, 2012

Srikanth Lucky Movie Review


శ్రీకాంత్  శత చిత్రాల హీరోగా పేరునైతే సంపాయించుకున్నాడు కాని అ ఘనతకు తగ్గ రేంజ్ లో హిట్లు లేక కొంత సతమతమవుతున్నాడు. సహాయ నటుడిగా నెట్టుకొస్తున్నాడు కాని సోలో హీరోగా మాత్రం పూర్తిగా చతికిల పడిపోయాడు.  హీరోగా వరస డిజాస్టర్స్  ఇస్తున్నా శ్రీకాంత్  'లక్కీ' తో అన్నా తన లక్ మారుతుందేమో పరిక్షించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

మల్టిప్లెక్స్ లు బలపడేప్పటికి  హీరోగా వెనుక పడ్డ శ్రీకాంత్ ఇప్పటికి బి, సి సెంటర్లను నమ్ముకునే సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా విడుదలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. రోజుల గేమ్ నుండి అధిక దియేటర్ల గేమ్ గా మారిన సినిమా వ్యాపారంలో ఈ లక్కీ తన ఉనికిని చాటుకోవటానికి ఓ వారం మాత్రమే ఉంది. ఎందుకంటే వచ్చే వారం కృష్ణం వందే జగద్గురుమ్ దియేటర్ల ఫై కి దండెత్తనుంది. సో... పరిమిత దియేటర్లలో 20 20 మొదలు పెట్టిన 'లక్కీ ' భవితవ్యం ఏమిటో మన సమీక్షలో చూద్దాం. 

కధ : 

లక్ష్మి నారాయణ అలియాస్ లక్కీ (శ్రీకాంత్) ఆడవాళ్ళ వ్యతిరేకి. ప్రపంచంలో ఉన్న భాదలకు, కష్టాలకు, నష్టాలకు ప్రధాన కారణం ఆడదే అని గాడంగా నమ్ముతూ ఉంటాడు. చివరికి తన భార్య, తల్లి, చెల్లీ, నానమ్మ కూడా ఆ లిస్టు లో ఉంటారు. అలా ఆడవాళ్ళ మీద ఎంత కోపం ఉన్నప్పటికీ వాళ్ళతోనే కలిసి జీవించాలని తెలుసుకుని రాజిపడి నిర్లిప్తంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలా రొటీన్ గా సాగిపోతున్న లక్కీ జీవితంలో  రాజరాజేశ్వరి అమ్మ వారి మూలంగా  ఓ అద్భుతం జరుగుతుంది. 

అదేమంటే.. ఆడవాళ్లు మనసులో అనుకునేవి లక్కీ కి వినపడుతూ ఉంటాయి. దాంతో మొదట తత్తర పడతాడు తరవాత బోల్డంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఫై ఓ మానసిక వైద్యురాలి సహాయంతో అది తనకు దక్కిన వరం అని తెలుసుకుంటాడు. అప్పటివరుకు ఆడవాళ్ళను అసహ్యించుకున్న లక్కీ వారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దానిని ఆసరాగా చేసుకుని మంచి పనులు చేయటం మొదలు పెడతాడు. అలా మొదలైన  ఆ పయనం లక్కీ ని ఏ  తీరం చేర్చింది అన్నది మిగిలిన కధ. 

విశ్లేషణ: 

అవతలి వారి మనసులో మాటలు వినగలగటం అనే పాయింట్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసి ఉన్నాం. కాని ఈ లక్కీ లో హీరో ఆడవారి మనసును మాత్రమే వినగలుగుతాడు అని బేస్ చేసుకుని ప్రయత్నం చేశారు  కాని సినిమాను ఆసక్తిగా చూపి రక్తికట్టించలేకపోయారు . పాయింట్ లో ఉన్న వైవిద్యంతో ఎన్నో అద్భుతాలు తెరమీద ఆవిష్కరించటానికి అవకాశం ఉంది. కాకపోతే పరిమిత బడ్జెట్ , పరిదిదాటని ఆలోచనలు లక్కీ ని అతి సాదారణ చిత్రంగా మర్చి వేశాయి . 

సినిమాలో హీరో తనకు దక్కినది శాపం కాదు ఓ వరం అని రిలైజ్ అయినప్పుడు వచ్చే పాట  మాత్రమే కొంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అది మినహా సినిమా మొత్తం స్టేజిషోలా అనిపిస్తుంది. అలానే ఇంతకు ముందెప్పుడో... వాడి పారేసిన కామెడీ బిట్స్ తో హాస్యం పండించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. సెంటిమెంట్ విషయంలో కూడా సినిమాటిక్ భావిద్వేగాల కంటే  టివి సిరియల్ ఎపిసోడ్స్ నే ఎక్కువ తలపించాయి. మొత్తంగా  ఈ సినిమా గురించి చెప్పాలంటే టివి సిరియల్ కు ఎక్కువ సినిమాకు తక్కువ అని చెప్పవచ్చు. 

దర్శకుడు హారి ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం తయారుచేసుకుని ఉంటాడు ఈ కధను ....! ఆ తరవాత ఎన్నో మార్పులు వచ్చేశాయి. కాని దర్శకుడు ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఫ్రెష్ వెర్షన్ వ్రాసుకోకుండా అప్పటి వెర్షన్ కే  అతుక్కు పోయినట్టు ఉన్నాడు. దాంతో పది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల మద్య ఇప్పటి మనుషులు గడుపుతున్నట్టుంటుంది సినిమాలో...!. అలా అని హరి లో టాలెంట్ లేదని కాదు ఓ రెండు మూడు సన్నివేశాలను మాత్రం చాల బాగా వర్క్ అవుట్ చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ , హీరో రిలైజ్ అయినప్పుడు వచ్చే పాట దర్శకుడిగా అతని ప్రతిభకు కొలమానాలు. సగం ఉడికిన కధను సినిమాగా మలచటం అతను చేసిన పెద్ద తప్పు. కాకపోతే ఈ తప్పును సరిదిద్డుకునే అవకాశం అతనికి మళ్ళి దక్కుతుందో లేదో వేచి చూడాలి. 

సాయి కార్తీక్ పాటలు సో ..సో.గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ గా పరవాలేదనిపించిన శ్రీనివాస రెడ్డి నిర్మాతగా మాత్రం విపరీతమైన పరిమితులు విధించి సినిమాలో గ్రాండియార్ అనేదే లేకుండా చేశారు. ఎదో కొద్ది మంది పేరున్నా ఆర్టిస్టుల కోసం తప్పించి మరే విషయంగాను అసలు ఖర్చు పెట్టినట్టే లేదు. చివరకు అరకును కూడా హైదరాబాద్ లోనే చూపించి జనాలని తరింప చేశారు. ఇక మిగత విభాగాలు పిండి కొద్ది రొట్టే అన్నా చందంగా మోతాదు ప్రకారం వాటి ప్రతిభను ప్రదర్శించాయి.  

శ్రీకాంత్ బాగున్నాడు, చాలా బాగా నటించాడు కూడా..! వంద చిత్రలా ముందు కంటే ఆ తరవాత శ్రీకాంత్ నటనలో పరిణితి కనపడుతుంది. అలానే ఈ సినిమాలో లక్కీ పాత్రకు 100% న్యాయం చేశాడు . ఒక రకంగా ఇది శ్రీకాంత్ ఒన్  మాన్ షో. సినిమాను తన భుజలకేత్తుకుని నడిపించాడు.. కాని విషయం లేని కధను ఎంత మోస్తే మాత్రం ఏంటి ఫలితం..! హీరోయిన్ మేఘనకు నటించటానికి అవకాశం తక్కువ ఉన్నా పరవాలేదనిపించింది. రోజా ఆకట్టుకుంటుంది. బ్రమ్మి కామెడీ రొటీన్ గాను, రోతగాను అనిపిస్తుంది. ఎ వి యస్ , సన సహా మిగత నటులు వారి పాత్రాలకనుగుణంగా బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్: 

శ్రీ కాంత్ నటన , ఓ రెండు సన్నివేశాలు           

 మైనస్ పాయింట్స్ : 

ఆసక్తికరమే అయినప్పటికీ రొటీన్ కధ , అవసరం ఉన్నప్పటికీ ఆకట్టుకోలేని బోరింగ్ కధనం , చెత్త కామెడీ ప్రధానంగా ఈ సినిమాకు శత్రువులు. 

కొసమెరుపు:

ఇప్పటి పరిస్థితుల్లో సినిమా విజయం సాదించటానికి అవసరమైన చాలా అంశాలను ఈ సినిమా మిస్ కొట్టింది. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని 'ఈ లక్కీ సినిమా కూడా శ్రీకాంత్ లక్ ను వెక్కిరించింది అని నిర్ధారించవచ్చు.


      
   మారుతీ టాకీస్ రేటింగ్ : 5 కి 2   



No comments:

Post a Comment