![]() |
| Raviteja - Nageswara Reddy New Movie |
గత్తర గత్తర కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులను చిత్తడి చిత్తడి చేసేస్తూ వెటకారానికి ఒక ప్రోఫిషనలిజం కట్టబెట్టిన రవితేజ ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో మాస్ కామెడీ కి టాప్ స్టార్. ఈ ఘనతను మాటి మాటికి గుర్తుచేయ్యాలనే ఆయన్ని మాస్ మహారాజ అని పిలుచుకుంటారు అభిమానులు. వీపరిత దోరణిలో కామెడీ చేస్తూ జనాలను ఉర్రుతలుగించిన రవి గత కొన్ని సినిమాలుగా దారుణంగా నిరుత్సాహపరుస్తున్నాడు. ఫలితం .... వరస తిరస్కరణలు. ఒకే రకమైన స్వభావం కలిగిన పాత్రలను మళ్లీ మళ్లీ చేసి చూపించటమే మొహం మొత్తటానికి కారణం. ఈ తప్పును తెలుసుకునే రాబోయే చిత్రాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడని వినికిడి.
ఆ మార్పుకు పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్నా 'సార్ వస్తారు' శ్రీకారం చూడుతుందని తరవాత గోపీచంద్ తీస్తున్నా 'బలపు' దానిని కంటిన్యూ చేస్తుందని రవి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇలా హిట్ కోసం ప్రక్షాళన బాట పట్టిన రవితేజ తాజా గా దేనికైనా రెడీ హిట్ తో ఉత్సాహంగా ఉన్న జి నాగేశ్వర రెడ్డి తో సినిమా చేయటానికి సై అన్నట్టు సమాచారం. మాస్ కామెడీ ని పండించటంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్న నాగేశ్వర రెడ్డి మాస్ ఎలెమెంట్స్ కు పవర్ స్టేషన్ లాంటి రవితేజ ను ఎలా ఒడిసి పట్టుకుంటాడో... అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
సినిమాలో హాస్య నటులు ఎంతమంది ఉన్నాతనదైన గుర్తింపును ఎప్పుడు హైలైట్ చేసుకునే రవితేజకు, కామెడీ ని స్టార్ ని చేసి హీరోను కూడా సాటి కామెడీ ఆర్టిస్ట్ గా చూపించే నాగేశ్వర రెడ్డికి ఎలా సింక్ అవుతుందో.. తెలుసుకోవటమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన అంశం.

No comments:
Post a Comment