Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, November 5, 2012

క్లారిటీ కావాలంటున్న బాలయ్య ఫాన్స్


సింహ విజయం ఇచ్చిన కిక్ తో వరస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసిన బాలకృష్ణ శ్రీమన్నారాయణ తరవాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. దాంతో బాలయ్య  అభిమానుల్లో స్థబ్ధత నెలకుంది. వారు బాలయ్య తరవాతి సినిమా ఏమిటా అని ఆలోచనలో ఉండగానే మూడు సినిమాలకు సంబందించిన రూమర్స్ సంచారం మొదలుపెట్టాయి. బోయపాటి శ్రీను రూలర్ పేరుతో బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అని వినపడింది. అలానే లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ బాలయ్యను సి బి ఐ ఆఫీసర్ పాత్రలో చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని ప్రచారం జరిగింది. అంతే కాని ఆ సినిమాల గురించి ఎవరు అధికారికంగా ప్రకటించలేదు.

అవి అలా ఉంటే నృత్యదర్శకుడి నుండి దర్శకుడిగా ప్రమోషన్ తెచ్చుకుని ఒక హిట్టు రెండు ప్లాపులతో నిశ్శబ్దంగా ఉన్న అమ్మ రాజశేఖర్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ కధను తాయారు చేసి బాలయ్యకు చెప్పి ఒప్పించాడని కొత్త దూమారం ఈ మద్యనే రేగింది. అలానే ఈ సినిమాను మహాత్మా , రంగ ది దొంగ సినిమాలను నిర్మించిన మనోహర్ నాయుడు నిర్మించనున్నాడని ప్రచారం ఊపందుకుంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా అధికారిక సమర్ధనలేదు. దాంతో బాలయ్య తరవాతి సినిమా ఏమిటి అని అయన అభిమానుల్లో కలవరం కంటిన్యూ అవుతూనే ఉంది.

జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా సినిమాలు చేసుకుంటూ పోయే బాలయ్య కామ్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. రీలాక్స్ అవటం కోసం గ్యాప్ తీసుకున్నారా ...? లేక రాజకీయాల మీద దృష్టి పెట్టటానికి వ్యుహత్మకంగానే గ్యాప్ తీసుకున్నారా..? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఈ విషయాలు అయన అభిమానులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. అందకే వారు అనవసరపు వాదనలకు తవ్వివ్వకుండా బాలయ్య త్వరగా ఓ స్పష్టత ఇవ్వాలని అభిలాషిస్తున్నారు.          

No comments:

Post a Comment