Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, November 6, 2012

ఫీల్ అవుతున్న యన్ టి ఆర్

Nandamuri Taraka Ratna (NTR)
ఈ మద్య 'నేను చాలా వరస్ట్' అంటూ ఒక  కొత్త సినిమాతో మీడియాలో కనిపించి ఓ మోస్తరు సంచలనానికి తెర  తీశాడు నందమూరి తారకరత్న అలియాస్ యన్ టి ఆర్ . సినిమా సంగతేమోగాని ఆ పేరును ఉపయోగించుకుని యన్ టి ఆర్  అంటే గిట్టని వాళ్ళు కసి తీరా నోటి దురద, కంటి దురద , చేతి దురద తీర్చుకున్నారు.

ఇలా జరుగుతుందని ముందే ఊహించిన యన్ టి ఆర్ ఆ సినిమా ప్రారంభం రోజునా టైటిల్ పాత్ర నేను చేయటంలేదు నందన్ అనే తీస్ మార్  ఖాన్ చేసున్నాడు, నేను యముడి పాత్రలో కనిపిస్తాను అని గట్టిగానే చెప్పాడు. కాని ఎవరు పట్టించుకున్న పాపానా పోలేదు. యముడు పాత్ర ఇస్తున్నారని టెంప్ట్ అయ్యి యమదొంగ అయిపోవాలని డిసైడ్ అయ్యింది మనమే కదా... ఏమిచేద్దాం అని సర్దుకుపోదాం అనుకున్నాడు. కాని ఆ విషయం కూడా తనకు ఎదురు తిరగటంతో తెగ ఫీల్ అయిపోతున్నాడు. 

ఎందుకంటే 'యన్ టి ఆర్ వరస్ట్ ...! యన్ టి ఆర్  చాలా  వరస్ట్ అంటా...!' అంటూ.. జరిగిన ప్రాపగండా అంతా తనను  ఉద్దేశించి కాకుండా కేవలం తన పేరు అడ్డు పెట్టుకుని జూనియర్ యన్ టి ఆర్  మీద అక్కసు తీర్చుకున్నారని  తెలిసి కుమిలి పోతున్నడని  అతని సన్నిహితులు వాపోతున్నారని ఓ గాలి వార్త వినపడుతుంది. ఇది ఎంతవరుకు నిజమో తెలియదు కాని తారకరత్న భాద పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే... సినిమా ఇప్పుడేగా మొదలైంది. ముందు ముందు చాలా ఉంది. సినిమా షూటింగ్ అవ్వాలి .. ఆడియో బయటకు రావాలి .. సినిమా విడుదల కావాలి... ఇవన్నీ పూర్తయ్యేలోపు ఇంకెంత ప్రచారానికి అవకాశం ఉందొ....తెలిసిందేగా..! అందుకని ఈ సారి తప్పు జరగకుండా క్లారిఫై చేద్దాంలే...!               

No comments:

Post a Comment