Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, November 9, 2012

ఇక 'రంపం' కు పాపులారిటీ ..!

Brahmanandam 
కొన్ని పేర్లు అప్పటివరకు మాములుగానే ఉంటాయి కాని ఉన్నట్టుండి ఒక్క సారిగా కొన్ని ఊహించని పరిణామాలు ఎదురై ఆ పేర్లకు వీపరితమైన క్రేజ్ వచ్చి పడిపోతుంది. తరవాత వద్దనుకున్న పాపులర్ అయిపోతాయి...ఎవరు ఆపలేరు..! ఇప్పుడు ఆ అదృష్టం 'రంపం' కు పట్టనుంది.


 మీరు సరిగ్గానే విన్నారు అది చెక్కలను ముక్కలుగా కోసే సాధనం రంపమే...! ఒక మాములు వస్తువుగా పడి ఉన్న రంపం  ఇక మీదట వరల్డ్ ఫేమస్ కానుంది. అక్కడి తో ఆగకుండా ఈ ఘనత తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోనుంది. కాకపోతే ఈ రంపనికి ఆ ప్రత్యేకత కట్టి పెడుతుంది ఎవరు అని మీరు అడగ వచ్చు... ఇంకెవరు మన బ్రమ్మి అని నేను చెప్పావచ్చు.

ఇంతకీ అసలు విషయంలోకి వస్తే అహన పెళ్ళంటా ..! సినిమాలో అరగుండుగా బట్టతలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినా బ్రమ్మి తరవాత బట్టా .. పొట్టి .. పొట్టా .. పదాలకు వీపరితమైన క్రేజ్ తెచ్చాడు. ఆ ఫై చారి, మెక్డొవెల్ మూర్తి, పద్మశ్రీ,బాబి..., హల్వారాజ్ మొదలగు పేర్లకు గుర్తింపు తీసుకు వచ్చి వాటిని జనాలు ఎప్పటికి మర్చి పోకుండా వారి నవ్వుల మీద ముద్రించాడు. ఈ పరంపరలో క్రిష్ దర్శకత్వంలో బ్రమ్మి నటిస్తున్నా కృష్ణం వందే జగద్గురుం చిత్రంతో రంపనికి ఆ పాపులారిటి కట్టబెట్టి చరిత్రకెక్కించనున్నాడు. విలన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే ఈ 'రంపం' కామెడీని పర పర లాడించిందని ఇన్సైడ్ టాక్...! ప్రస్తుతం ఆ రంపం గురించి ఎంత చెప్పిన ఊరించటమే అవుతుంది. అందుకని నవంబర్ 30 వరకు వేచి ఉండండి.          

No comments:

Post a Comment