Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, July 2, 2012

Where is Brammi...?


బ్రమ్మి ...ఎక్కడ..? బ్రమ్మి ఎక్కడా బాబు ..? ఇదేంటి ఇలా  అడుగుతున్నాను అని.... వాళ్ళింట్లో ఉంటాడు అని కొంటె సమాధానం చెప్పొద్దూ ... నేను ఏడవలేక నవ్వాలి. ఇక్కడ ప్రశ్న మన బ్రమ్మి ఇంట్లో ఉన్నాడో...ఊరేళ్ళాడో అన్నదాని గురించి కాదు.... పటం (అరవంలో 'సినిమా'ను 'పటం' అంటారులే..!)లో  మేస్టారు ఎక్కడా అని...? ఇప్పటికే వందల్లో సినిమాలు చేసి గిన్నిస్ బుక్ మీద గిన్నేసుకుని కూర్చున్నాడు... అలానే రోజుకు రెండు మూడు సినిమాలకు కాల్ షీట్లిస్తూ యమ బిజీగా ఉంటాడు .... అంతే కాకుండా నెలకు అయన నటించిన సినిమాలు మూడు నాలుగు విడుదల అవుతాయి..అలాంటిది ఏంటీ ప్రశ్న అని  తికమక పడొద్దు.... మీ కంగారుకు కంటిన్యుషన్ ఇవ్వకుండా అసలు విషయంలోకి వచ్చేస్తున్నా ..!

ఫైన చెప్పినట్టు ఎప్పుడు బిజీగా ఉండే బ్రమ్మి ఏదైనా ఓ పెద్ద సినిమాలో కనిపించలేదు అంటే ఆలోచించవలసిందే ..! ఎందుకంటే బ్రమ్మి  లేకుండా ఈ మద్య తెలుగులో పెద్ద హీరోల సినిమాలు చాల అరుదుగా వస్తున్నాయి. అలాంటిది ఈ మద్య విడుదల అయిన అల్లు అర్జున్ 'జులాయి ' ట్రైలర్ లో బ్రమ్మి కనిపించలేదు. అంటే... ఈ సినిమాలో బ్రమ్మి ఉన్నట్టా... లేనట్టా..? లేడు  అనుకుంటే బ్రమ్మి జులాయి ఆడియో ఫంక్షన్ కు ఎందుకు వచ్చినట్టు...? కాదు ఉన్నాడే అనుకుందాం.. ఉంటే  ట్రైలర్ లో ఎందుకు కనిపించలేదు...?   ట్రైలర్ లో చోటు సరిపోలేదా ..? లేక సినిమాలో చోటు తక్కువ ఇచ్చారా...? అనేది తెలియాల్సిఉంది.

అనధికార వర్గాలు  'జులాయి' లో బ్రమ్మి ఓ మంచి పాత్రలో కనిపిస్తాడు అని చెబుతున్నప్పటికీ  సినిమా ప్రచారంలో బ్రమ్మిని వాడుకోకపోవటం అనుమానాలకు తావిస్తుంది. మాటల  ఖజానా త్రివిక్రమ్ తన సినిమాలో బ్రమ్మి కోసం తప్పకుండా  ఓ మంచి పాత్ర వ్రాస్తాడు... ఈ సినిమాలో కూడా కొత్త బ్రమ్మిని చూపిస్తాడు అని అయన  అభిమానులు  ఆకాంక్షిస్తున్నారు. ఏది ఏమైనా నిజం నిలకడ మీద తేలాల్సిందే...! ఆ నిలకడ కోసం జూలై 13 వరకు ఆగాల్సిందే...!

Julayi Trailer

No comments:

Post a Comment