తెలుగు సిని చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మించిన యమ్ యస్ రాజు తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన 'తూనీగా..తూనీగా ..' చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పద్మిని ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ద్వార సుమంత్ అశ్విన్, రీయ లు వెండితెరకు పరిచయం అయ్యారు. యం యస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పరుచూరి సోదరులు మాటలు వ్రాసారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందించాడు.
వాన పరాజయం తరవాత ఉత్సాహం లేకుండా కనిపిస్తున్నా యం . యస్ రాజు కొడుకును హీరోగా నిలబెట్టి పూర్వవైభవాన్ని తిరిగి పొందాలని ఆశ పడుతున్నట్టు కనపడుతుంది. పంపిణి వ్యవస్థ మీద తనకున్న ఆధిపత్యాన్ని ఆసరాగా చేసుకుని సినిమా వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నా దిల్ రాజు 'ఈ రోజుల్లో..' చిన్న సినిమాల పాలిట కనిపించే దైవంగా అవతరించాడు. వాసన బట్టి సినిమాల ఫలితాన్ని పసిగట్టే రాజు చెయ్యి పడితే సినిమా వందరోజుల వేడుక చేసుకోవాల్సిందే.
ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేక పోయిన యం యస్ రాజు ఆశకు దిల్ రాజు మ్యాజిక్ తోడవటంతో పెట్టుబడి రాబట్టుకోవటంలో సినిమా సఫలం అయినట్టే అనుకోవచ్చు. ఇక లాభం ఎంతోస్తుంది అనేది సినిమా ఫలితం నిర్ణయిస్తుంది. మరి ఈ సినిమా ఫలితం ఏమిటో మన సమీక్షలో చూద్దాం .
కధ :
రవీంద్ర బాబు (నాగ బాబు ) అనే పెద్ద వ్యాపారవేత్త , రామస్వామి(ప్రభు) అనే వంటవాడు మంచి మిత్రులు. అంతస్తుల తేడా వారి స్నేహానికి అడ్డు రాలేదు. రవీంద్ర బాబు ఇంట్లోనే వంటవాడిగా పనిచేసేవాడు రామస్వామి. వీళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో వాళ్ళ పిల్లలు అంత మంచి శత్రువులు. రామస్వామి కొడుకు కార్తీక్(సుమంత్ అశ్విన్) రవీంద్ర బాబు కూతురు నిధి (రియా ) ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కార్తీక్ చేసిన మిస్టేక్ కారణంగా అమెరిక వెళ్లి పోతుంది నిధి .
12 సంవత్సరాల తరవాత తండ్రి ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు కు వస్తుంది నిధి. అక్కడ కార్తీక్ మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కాని ఆమె తన పాత శత్రువు నిది అని తెలిసి తానెవరో చెప్పకుండా ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతాడు. మనసుకు దగ్గరైన మనిషి తన శత్రువు అని తెలిసినా అతను చూపించిన ప్రేమకు పడిపోతుంది నిది.
అలా ఇద్దరు ఒక్కటయ్యే సమయానికి రవీంద్ర బాబు చెల్లిలి కుటుంబం అడ్డు తగులుతుంది. వ్యాపారంలో దివాలా తీసే పొజిషన్ లో ఉన్న ఆ కుటుంబం నిది ని వాళ్ళింటి కోడలుగా చేసుకుంటే ఒడ్డున పడవచ్చు అనే ఉద్దేశంతో కార్తీక్ , నిది ల మద్య అపార్దాలు సృస్టిస్తారు. ఆ అపార్ధాలు గొడవలకు దారి తీసి రామస్వామి , రవీంద్ర బాబు విడిపోతారు. మంచి మిత్రులు విడిపోవటం సహించని రవీంద్రబాబు ఫ్యామిలీ డాక్టర్ కమ్ ఫ్రెండ్ జేమ్స్ కార్తీక్ , నిదిలను కలిపే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ ఫై అపోహలు తొలగి ప్రేమికులిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అన్నది మిగిలిన కధ .
విశ్లేషణ :
తూనీగా ... తూనీగా .. ఈ టైటిల్ ను బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా యం యస్ రాజు స్కూల్ నుండి వచ్చిందని. మనసంతా నువ్వే .!, నువ్వస్తానంటే నేనోద్దంటానా..! సినిమాల కోవకు చెందినదే ఈ సినిమా కూడా... నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆ రెండు సినిమాలను కాలేసి మెలేసి మిక్సిలో వేసి తీసి వడ బోసి ఈ సినిమా తీసారు అని అనిపిస్తుంది. మరైతే బాగానే ఉంటుందని మీరు అనుకోవచ్చు అక్కడే మిస్టేక్ లో కాలేస్తాం... ఎందుకంటే ఇక్కడ జరిగింది వేరు కాబట్టి. ఆ రెండు సినిమాల్లో మంచి పాటలున్నాయి , ఆస్వాదించే హాస్యం ఉంది, కదిలించే సన్నివేశాలున్నాయి. ఆ మూడు విషయాలు ఈ సినిమాలో లోపించాయి.
టీనేజ్ ప్రేమకధలు సక్సెస్ అవ్వాలంటే ఎమోషనల్ ఎపిసోడ్స్ తో పాటు పాటలు , కామెడీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సినిమాలో పాటల విషయంగా కొంత ప్రయత్నం జరిగింది కాని కామెడీ ని పూర్తిగా విస్మరించారు. మొదట్లో శత్రువులైన హీరో హీరోయిన్ పాత్రల స్వభావరీత్యా వారి మద్య వచ్చే సన్నివేశాల్లో కామెడీ ఉండేలా చూసారు కాని అది రొటీన్ గా అనిపించి నవ్వురాదు . అలానే హీరో హీరోయిన్ మద్య రొమాన్స్ కూడా సరిపడా లేదు. ఎందుకంటే వారిద్దరి మద్య ఉండే ప్రేమలో సరైన డెప్త్ కనిపించదు. వాటన్నిటిని పక్కన పెట్టి యం యస్ రాజు తన ఇష్టన్ని ఎమోషన్స్, సెంటిమెంట్ వంటి తదితర అంశాల మీద ఒలకబోసారు. అందులోను విలన్స్ సైడ్ హీరోయిన్ మేనమామ కూతురు చూపించే విలనిజం కాస్త ఆకట్టుకుంటుంది తప్పించి మిగతవి పెద్దగా మెప్పించవు.
ఈ మద్య ఓ ప్రెస్ మీట్లో సహా నిర్మాత దిల్ రాజు సినిమాలో హీరోయిన్ కి జంతువులంటే ఇష్టం , హీరోకి సంగీతం అంటే ప్రాణం వాటితో ప్రేక్షకులు కనెక్ట్ అయితే సూపర్ హిట్ ఈ సినిమా అన్నారు. కాని సినిమా చూస్తున్నప్పుడు ఆ విషయాలతో ఎందుకు కనెక్ట్ అవ్వాలో... ఎలా కనెక్ట్ అవ్వాలో అర్ధం కాకపోవటం విచారకరం. అలానే హీరో పెద్ద డాన్సర్ అయ్యేలా స్క్రీన్ ప్లే వ్రాసారు. కాని భాదపెట్టె విషయం ఏమిటంటే ఓ స్పెషల్ ప్రొఫిషనల్ డాన్సర్ కు ఉండవలసిన లక్షణాలు ఈ సినిమా హీరోలో లేకపోవటం. దాంతో ఈ కొత్త హీరో మీద అభిమానం కంటే జాలి ఎక్కువ కలుగుతుంది... మోయలేని భారాన్ని ఎత్తుకున్నందుకు..! ఇలా అనవసరమైన తప్పిదాలు చాల చోట్ల సిన్మాను నీరుగర్చాయి. మొత్తంగా చెప్పేదేమంటే యం యస్ రాజు దర్శకత్వ శాఖ మీద మరింత పట్టు సాదించవలసిన అవసరం ఉంది అని సినిమా చివర్లో అనిపించక మానదు.
పరుచూరి సోదరులు వ్రాసిన మాటలు సరిగా పేలలేదు. చాల చోట్ల నిరుత్శాపరిచారు... మరికొన్ని చోట్ల ఎబ్బెట్టు కలిగించారు. కార్తీక్ రాజా అందించిన పాటలు ఒకటి రెండు మినహా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ స్కోరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. యస్ గోపాల్ రెడ్డి కెమెర పనితనం ప్రమాణాలకనుగుణంగా బాగుంది. మిగత సాంకేతిక విభాగాలు బాగా పనిచేశాయి. ముఖ్యంగా సి జి పనితనం నభూతో నభవిష్యత్...! ఎందుకంటే అసలు జంతువులను సృష్టించారూ ... యాజ్ టీజ్ ఒరిజినల్ గా ఉన్నవాటిని క్లోన్ చేసినట్టు చేసి సినిమాలో చూపించారు. ఎంతలా అంటే వాళ్ళు చూపించిన వాటిని జనాలు నిజమైనవి అని అనుకుంటారేమో అని... ఆ జంతువులూ వస్తున్నప్పుడల్లా కింద ఇవి కంప్యూటర్ తో చేసినవి అని స్క్రోల్ వేయటంలా. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
అభినయం:
సుమంత్ అశ్విన్లో కొంత విషయం ఉంది ఇంకొంచం రాటుతెలితే మంచి ఆక్టింగ్ మేటిరియాల్ కూడా..! ఇక పొతే ఈ సినిమా సుమంత్ అశ్విన్ కు పెర్ఫెక్ట్ లాంచ్ పాడ్ మాత్రం కాదు. అతనిలో ఇంకేదో ఉంది అది బయటకు రాలేదు. ఒన్స్ అతనిలో ఉన్న స్పెషాలిటిని ఎవరన్న గుర్తుపట్టగలిగితే సుమంత్ కూడా స్టార్ అయిపోతాడు. ఈ సినిమా వరకు రామ్ , సిద్దార్థ్ వంటి వారిని అనుకరించే ప్రయత్నం చేసాడు... కాని ఆకట్టుకోలేకపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం సుమంత్ . హీరోయిన్ గా పరిచయం అయిన బెంగాలి భామ రియ లో జనేలియా పోలికలు కనిపించటం మినహా పెద్ద ప్రత్యేకతలు ఏమి లేవు. నటన విషయం గా , గ్లామర్ విషయం గా ఆమె మరింత పరిణితి సాదించాలి. సపోర్టింగ్ కాస్ట్ విషయంలో కొత్తగా కనిపించిన వాళ్ళందరూ చిరాకు పుట్టించారు. నాగబాబు, ప్రభు, షాయాజీ షిండే తదితరులు వారి పాత్రలకనుగుణంగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, 'దిగు ..దిగు జాబిలి ', తూనీగా ..తూనీగా .. పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కధ , కధనాలతో పాటు హాస్యం లేకపోవటం ప్రదానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
కొసమెరుపు :
యం యస్ రాజు, పరుచూరి బ్రదర్స్ , భూపతిరాజా , గోపాల్ రెడ్డి వంటి ఉద్దండ వయసుమీరిన యువకులు రూపొందించిన ఈ టీనేజ్ ప్రేమకధలో... టీనేజ్ యువతను కట్టిపడేసే అంశాలు లేక పోవటం ఈ సినిమాకు పెద్ద కొరత. దాంతో ఈ సినిమా ను రక్షించే భాద్యత ఫ్యామిలీ ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్ళింది. వారిని ఆకర్షించగలిగితే ఈ సినిమా హిట్ అన్నట్టే లెఖ్ఖా...!
MARUTHI TALKIES RATING 2.5 OUT OF 5

No comments:
Post a Comment