Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, July 23, 2012

Julayi Pakado Video Song : Bunny Rocks - DSP Shakes


కొత్త ట్రెండ్ కు తెర  తీస్తూ నిన్న విడుదలైన 'జులాయి ' ప్రమోషనల్ వీడియో సాంగ్ 'పకడో .. పకడో ..' టాలీవుడ్ లో హాల్  చల్  చేస్తుంది. స్టైలిష్ గా రూపొందించిన ఈ పాట ప్రేక్షకుల అటెన్షన్ ను క్యాచ్ చేస్తుంది. సహజంగా వారికున్న ఎనర్జీ తో కూడిన టాలెంట్ తో అభిమానులను సమ్మోహన పరిచే బన్నీ , దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట లో తొలిసారిగా కలిసి స్టెప్పులు వేశారు. ఆల్బం సాంగ్ తరహాలో క్రియేట్ చేసిన ఈ పాటలో బన్నీ రాఫ్ గా కనిపించి రాక్ చేస్తే , దేవి సాఫ్ట్ గా కనిపించి షేక్ చేసాడు.

ఒరిజినల్ ఆల్బం లో ఈ పాటను మాల్గాడి శుభ పాడితే వీడియో కోసం దేవి తన స్వరం ఉపయోగించాడు. ఆకర్షించే డాన్సు మూమెంట్స్ తో , చిన్న చిన్న కాన్సెప్ట్స్ తో పాట  చాలా  బాగా వచ్చింది. సినిమా ప్రచారానికి ఈ మాత్రం సరి పోతుంది. అందులోను తోలి ప్రయత్నం కాబట్టి బాగుంది అని మెచ్చుకోవాలి. ప్రచారం మొదలైనప్పటి నుండి వెరైటిగా సినిమాను ప్రమోట్ చేస్తున్న  దర్శకుడు త్రివిక్రమ్ ఈ ప్రయత్నంలో కూడా సఫలం అయ్యాడు.

పట్టించుకోపోతే పర్వాలేదు కాని ఈ పాటకు సంబంధించి రెండు విషయాలు కొంచెం అసంతృప్తి కలిగిస్తున్నాయి. అవి ఏంటంటే ఇంత గ్రాండ్ గా తయారైన ఈ పాటను బుల్లి తెర మీద మాత్రమే చూడాల్సిరావటం. స్మాల్ స్క్రీన్ మీద పూర్తిగా ఆస్వాదిస్తున్న ఫీలింగ్ కలగటం లేదు. అలానే పాట లిరిక్ కు చిత్రీకరణకు సంబంధం కనపడటంలేదు. ఒరిజినల్ గా మాల్గాడి శుభ పాడిన పాటలో ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది. సాహిత్యం తో సరిగా కనెక్ట్ అయితే విజయం కోసం పోరాడుతున్న వ్యక్తిని ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ ఈ వీడియో పాటలో కనిపించలేదు. ఇప్పుడొస్తున్న చాలా  సినిమా పాటల్లానే  పాట తోవ  పాటది ... చిత్రీకరణ తోవ చిత్రీకరణది... !ముందే చెప్పాం కండిషన్స్ అప్లై అవుతాయని పట్టించుకుంటేనే ప్రాబ్లంకాని లేక పొతే ఈ పాటలాంటి పాట మరొకటి కనిపించదు.


ఏది ఏమైనా కొత్త ఒరవడికి శ్రీకారం  చుట్టిన 'జులాయి ' టీమ్ కు అభినందనలు.


No comments:

Post a Comment